Pariksha Pe Charcha 2021: విద్యార్థులతో ప్రధాని మోదీ ముఖాముఖీ.. ‘పరీక్షా పే చర్చ’ను ఇలా వీక్షించండి
PM Narendra Modi – Pariksha Pe Charcha 2021: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఏటా విద్యార్థుల పరీక్షలకు ముందు నిర్వహించే ‘పరీక్షా పే చర్చ’ నాలుగో ఎడిషన్ కార్యక్రమం ఈ రోజు జరగనుంది. బుధవారం సాయంత్రం
PM Narendra Modi – Pariksha Pe Charcha 2021: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఏటా విద్యార్థుల పరీక్షలకు ముందు నిర్వహించే ‘పరీక్షా పే చర్చ’ నాలుగో ఎడిషన్ కార్యక్రమం ఈ రోజు జరగనుంది. బుధవారం సాయంత్రం 7 గంటలకు ప్రధాని మోదీ విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులతో భేటీ కానున్నారు. అయితే కరోనావైరస్ వ్యాప్తి నేపథ్యంలో వర్చువల్ ద్వారా ప్రధాని మోదీ విద్యార్థులతో చర్చించనున్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు అడిగే ప్రశ్నలకు ప్రధాని మోదీ సమాధానాలిస్తారు.
ఈ మేరకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ‘పరీక్షా పే చర్చను వీక్షించాలంటూ సోమవారం ట్విట్ చేశారు. ‘‘మా ధైర్యవంతులైన పరీక్షా యోధులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులతో కొత్త పద్ధతిలో, విస్తృత అంశాలపై ఆసక్తికర ప్రశ్నలతో జరగనున్న చిరస్మరణీయమైన పరీక్ష పే చర్చను ఏప్రిల్ 7న సాయంత్రం 7 గంటలకు చూడండి’’ అంటూ అని ప్రధాని ట్వీట్ చేశారు.
పరీక్షా పే చర్చ కార్యక్రమంలో పాల్గొనడానికి ప్రపంచవ్యాప్తంగా 14 లక్షల మంది తమ పేర్లను రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. వీరిలో 10 లక్షలకు పైగా విద్యార్థులు ఉండగా.. సుమారు రెండున్నర లక్షల మంది ఉపాధ్యాయులు, లక్ష మంది తల్లిదండ్రులు ఉన్నారు. చర్చలో పాల్గొనడానికి ప్రపంచంలోని 81 దేశాల విద్యార్థులు నమోదు చేసుకున్నారు.
ఈ కార్యక్రమాన్ని ఇలా వీక్షించండి..
ప్రధాని మోడీ పరీక్షా పే చర్చ.. లైవ్ వీడియో కాన్ఫరెన్సింగ్ లింక్‌ను తన ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా షేర్ చేయనున్నారు. ఈ కార్యక్రమాన్ని వివిధ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో లేదా డీడీ నేషనల్, డీ న్యూస్, డీడీ ఇండియా, పీఎంవో ఇతర ప్రభుత్వ యాప్స్ ద్వారా వీక్షించవచ్చు.
పరీక్షలు రాయనున్న తొమ్మిది నుంచి 12వ తరగతి విద్యార్థులల్లో భయాందోళనలను తొలగించడానికి 2018 నుంచి ప్రధాని మోదీ పరీక్షా పే చర్చ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఏటా జనవరిలో జరిగే ఈ కార్యక్రమం కరోనా వ్యాప్తి నేపథ్యంలో వాయిదా పడింది. అయితే ఈసారి ప్రత్యక్షంగా కాకుండా వర్చువల్ పద్ధతిలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ.. విద్యార్థులతో సంభాషించనున్నారు. పరీక్షలకు సిద్ధమయ్యే విద్యార్థుల్లో ఉండే భయాలను పొగొట్టేందుకు మూడేళ్లుగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు.
Also Read: