Loan Moratorium: మళ్లీ లోన్ మారటోరియం ఊరట కలిగిస్తారా?.. క్లారిటీ ఇచ్చేసిన ఆర్బీఐ గవర్నర్
RBI News - Loan Moratorium News: దేశంలో కరోనా ఉధృతి విలయతాండవం చేస్తోంది. ఇప్పటికే పలు రాష్ట్రాలు కొన్ని నగరాల్లో లాక్‌డౌన్ అమలు చేస్తుండగా...మరికొన్ని నగరాల్లో రాత్రిపూట కర్ఫ్యూ అమలు చేస్తున్నారు.
దేశంలో కరోనా ఉధృతి కొనసాగుతోంది. సెకండ్ వేవ్ కారణంగా ఇప్పటికే పలు రాష్ట్రాలు కొన్ని నగరాల్లో లాక్‌డౌన్ అమలు చేస్తుండగా…మరికొన్ని నగరాల్లో రాత్రిపూట కర్ఫ్యూ అమలు చేస్తున్నారు. కరోనా కట్టడి చర్యల్లో భాగంగా వివిధ రకాల ఆంక్షలు అమలు చేస్తున్నారు. మరికొన్ని రాష్ట్రాలు కూడా ఆంక్షల అమలుపై మొగ్గుచూపుతున్నాయి. దీంతో చాలాచోట్ల వాణిజ్య కార్యకలాపాలకు తీవ్ర విఘాతం కలుగుతోంది. హోటళ్లు, రెస్టారెంట్లు, బార్లు, సినిమా థియేటర్లు మూతపడ్డాయి. ఈ నేపథ్యంలో మరోసారి రుణగ్రహీతలకు బ్యాంకులు లోన్ మారటోరియం ఇవ్వాలన్న డిమాండ్ వినిపిస్తోంది. గత ఏడాది లాక్‌డౌన్ కారణంగా ఆరు మాసాల పాటు లోన్ మారటోరియంతో రుణగ్రహీతలకు ఆర్బీఐ ఉపశమనం కల్పించడం తెలిసిందే. లాక్‌డౌన్ కారణంగా ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకపోయిన రుణగ్రహీతలకు లోన్ మారటోరియం పెను ఊరట కలిగించింది.
కోవిడ్ సెకండ్ వేవ్ కారణంగా ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో లాక్‌డౌన్ అమలు చేస్తున్నందున రుణాల చెల్లింపులపై మరోసారి మారటోరియంకు అవకాశం కల్పించాలన్న డిమాండ్ వినిపిస్తోంది. దీనిపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) గవర్నర్ శక్తికాంత దాస్ బుధవారం క్లారిటీ ఇచ్చేశారు. ప్రస్తుతం లోన్ పేమెంట్స్‌పై మారటోరియం ఇవ్వాల్సిన అవసరం లేదని ఆయన స్పష్టంచేశారు. ఇలాంటి పరిస్థితులను అధిగమించేందుకు ప్రైవేటు వాణిజ్య సంస్థలు ముందుగానే సన్నద్ధమయ్యాయని ఆయన పేర్కొన్నారు. ఈ విషయంలో భవిష్యత్తులో ఆర్బీఐ ఎలాంటి నిర్ణయాలు తీసుకోనుందో వెల్లడించేందుకు ఆయన నిరాకరించారు.
ఇవి కూడా చదవండి..ఖాతాదారులకు ముఖ్య గమనిక.. గృహ రుణాలపై వడ్డీ రేట్లు పెంపు.. అసలు మ్యాటర్ ఇదీ అంటూ క్లారిటీ ఇచ్చిన ఎస్‌బిఐ
కేంద్రం సంచలన నిర్ణయం.. ఇకపై వర్క్ ప్లేస్‌లలోనూ కోవిడ్ వ్యాక్సినేషన్‌కు అనుమతి.!