Lakkamma Devi: అక్కడ వింత ఆచారం.. అమ్మవారికి చెప్పుల నైవేద్యం.. రాత్రి దేవత చెప్పులు వేసుకుని గ్రామంలో తిరుగుతుందని నమ్మకం
ఫలం, పుష్పం, కొబ్బరికాయ, అరటిపళ్ళు ఇలా దేవుడిని నైవేద్యంగా ఇవ్వడం మన సంప్రదాయం... ఇక దేవాలయానికి వెళ్లే సమయంలో శుభ్రంగా వెళ్తాము.. గుడి బయట చెప్పులను విడిచి ఆలయంలో అడుగు పెడతాం.. అది మన హిందూ సంప్రదాయం..
Lakkamma Devi Temple: ఫలం, పుష్పం, కొబ్బరికాయ, అరటిపళ్ళు ఇలా దేవుడిని నైవేద్యంగా ఇవ్వడం మన సంప్రదాయం… ఇక దేవాలయానికి వెళ్లే సమయంలో శుభ్రంగా వెళ్తాము.. గుడి బయట చెప్పులను విడిచి ఆలయంలో అడుగు పెడతాం.. అది మన హిందూ సంప్రదాయం.. అయితే అక్కడ అమ్మోరికి చెప్పుల కానుకగా ఇస్తారు.. అయ్యో ఇదేమిటి అపచారం అనుకోకండి. అక్కడ అమ్మవారికి చెల్లించుకునే మొక్కు అదే. కర్ణాటకలోని కాలాబురాగి జిల్లాలో ఉన్న లక్కమ్మ దేవి ఆలయంలో అమలవుతున్న వింత ఆచారం ఇది. ప్రతీ ఏటా దీపావళి తర్వాత ఆరో రోజు జరిగే జాతరకు వేలాదిగా తరలివచ్చే భక్తులు అమ్మవారికి ఇలా చెప్పుల దండను సమర్పించుకోవడం ఆనవాయితీగా వస్తోంది.
కాలాబురగి జిల్లా కేంద్రానికి 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న గోలా -బి గ్రామంలో ఉంది ఈ ఆలయం. కుల మతాలకు అతీతంగా భక్తులు అమ్మవారిని దర్శించుకోవడానికి వస్తారు. కోరిన కోర్కెలు తీరిన వారు.. అమ్మవారికి చెప్పులు సమర్పించుకుంటారు. ఈ చెప్పులను ధరించి రాత్రి వేళల్లో అమ్మోరు తల్లి తిరుగుతుందని భక్తుల విశ్వాసం. కొత్తగా కోర్కెలు కోరుకుంటున్న వాళ్లు.. ఈ చెప్పుల దండలను తమ తలలకు తాకించుకుంటారు. కోరిన కోర్కెలు తీర్చే దైవంగా ప్రసిద్ధి చెందడంతో.. లక్కమ్మ దర్శనానికి వచ్చే భక్తుల సంఖ్య ఏటా పెరుగుతూనే ఉంది.
Also Read: ఈరోజు ఈ రాశివారికి ఆర్ధికంగా. ఉద్యోగపరంగా శుభఫలితాలు పొందడం కోసం ఏం చేయాలంటే..!