Cockroach Farming: తక్కువ పెట్టుబడి.. ఎక్కువ లాభాలు తెచ్చే బొద్దింకల వ్యాపారం.. లక్షల్లో సంపాదన

Cockroach Farming: సర్వసాధారణంగా మన దేశంలో ఎక్కువ మంది బల్లులకు, బొద్దింకలకు భయ పడే వాళ్ళు, అసహ్య భావాన్ని వ్యక్తం చేస్తారు. ఇక చాలా మంది ఇంట్లో ఒక్క బొద్దింక కనిపిస్తేనే..చాలు దానిని తరిమి తరిమి..

Cockroach Farming:  తక్కువ పెట్టుబడి.. ఎక్కువ లాభాలు తెచ్చే బొద్దింకల వ్యాపారం.. లక్షల్లో సంపాదన
Cockroach Farming
Follow us

|

Updated on: Apr 07, 2021 | 11:20 AM

Cockroach Farming: సర్వసాధారణంగా మన దేశంలో ఎక్కువ మంది బల్లులకు, బొద్దింకలకు భయ పడే వాళ్ళు, అసహ్య భావాన్ని వ్యక్తం చేస్తారు. ఇక చాలా మంది ఇంట్లో ఒక్క బొద్దింక కనిపిస్తేనే..చాలు దానిని తరిమి తరిమి హిట్ కొట్టి చంపేస్తాం.. అటువంటి మన ఇంటిలో ఓ పది లక్షల బొద్దింకలు ఉంటే.. ఒక్క సారి ఊహించుకోండి.. ఆ ఊహే బాబోయ్ అనిపిస్తుందా..! అయితే మనం ఇంతగా అసహ్యించుకొనే బొద్దింకలు కొన్ని దేశాల్లో ఆహారంగా ఉపయోగిస్తారు.. ఇక కొన్ని దేశాలు బొద్దింకలనుపెంచి ఆదాయాన్ని సంపాదిస్తున్నారు. అలా బొద్దింక పెంపకం ను ఎక్కువగా డ్రాగన్ కంట్రీ చేస్తుంది. ఇంకా చెప్పాలంటే బొద్దింకలు మా ఇంట్లో ఉంటే.. లాఫింగ్ బుద్ధా మా ఇంట్లోకి నడుచుకొంటూ వచ్చినట్లే… అని చైనీయులు తమ ఆనందాన్ని వ్యక్త పరుస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే..

చైనీయులు అనేక మంది బొద్దింకల పెంపక పరిశ్రమలను నిర్వహిస్తున్నారు. ఒక్కొక్క పరిశ్రమలోనూ పది లక్షల బొద్దింకలను పెంచుతున్నారు. చైనాలో భారీ ఆదాయాన్ని సమకూర్చి పెడుతున్న బొద్దింకలంటే వారికి చాలా ఇష్టం.. బొద్దింకల్ని పలు ఔషధాల తయారీలో వినియోగిస్తున్నారు.. గుండె జబ్బులు, టీబీ, రక్త నాళాలకు సంబంధించిన జబ్బులను నివారించడానికి ఉపయోగించే ఔషధాల తయారీలో బొద్దింకలను ఉపయోగిస్తున్నారు. పెట్టుబడి తక్కువ ఆదాయం ఎక్కువ ఉండడంతో చైనా లో ఈ బొద్దింకల పెంపకం మంచి లాభసాటి వ్యాపారంగా మారింది.. లక్షల సంఖ్యలో బొద్దింకల్ని వివిధ దేశాలకు ఎగుమతి చేస్తున్నారు.. ఇక చైనాలో బొద్దింకలను ఆహారంగా తీసుకొంటారు అన్న సంగతి తెలిసిందే.

కరోనా నేపథ్యంలో పలు దేశాలపై రవాణ విషయంలో ఆంక్షలు ఉన్నాయి. దీంతో చైనా లో కూడా ఆర్థికపరమైన ఇబ్బందులు ఏర్పడినట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయాన్ని చైనా ప్రభుత్వం కొట్టిపడేస్తుంది

Also Read: రోజూ త్వరగా అలసిపోతున్నారా..అయితే అవయవాలు విశ్రాంతిని కోరుతున్నాయి.. ఈ ఆసనం ట్రై చేయండి

నేడు ప్రపంచ ఆరోగ్య దినం.. కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో మన ఆరోగ్యము మనమే కపాడుకోవాలని పిలుపు