Woman Suffers With EDS: 22 గంటలు బెడ్ మీదనే.. కదిలినా..ఎండ తగిలినా ప్రాణం పోతుంది.. ఇక్కడే నరకం చూస్తున్నా అంటూ కన్నీరు
Woman Suffers With EDS: ఒక వ్యాధి నివారణకు మందులు కనుకున్నాం అని మనిషి మురిసే సమయంలో మళ్ళీ ప్రకృతి సవాల్ విసురుతుంది. సరికొత్త వ్యాధి వెలుగులోకి వచ్చి ప్రపంచ జనాభాను వణికిస్తుంది. ఎయిడ్స్, ఎబోలా, కరోనా వంటి మందులు లేని..
Woman Suffers With EDS: ఒక వ్యాధి నివారణకు మందులు కనుకున్నాం అని మనిషి మురిసే సమయంలో మళ్ళీ ప్రకృతి సవాల్ విసురుతుంది. సరికొత్త వ్యాధి వెలుగులోకి వచ్చి ప్రపంచ జనాభాను వణికిస్తుంది. ఎయిడ్స్, ఎబోలా, కరోనా వంటి మందులు లేని వ్యాధులతో పాటు.. అనేక అరుదైన వింత జబ్బులు సోకుతూ మనిషిని నరకయాతన పెడుతున్నాయి.
తాజాగా నెదర్లాండ్ లోని డ్రాన్‌టెన్‌కు చెందిన 27 ఏళ్ల సెలెస్ట్ వాస్ వీనస్ అనే యువతి అరుదైన ఓ వింత జబ్బుతో బాధపడుతుంది.కాదు నరకయాతన అనుభవిస్తుంది. ఈ యువతి కదిలేచాలు ఆమె ప్రాణాలు పోతాయి. మెదిలితే చాలు నరకం ఇక్కడే అనుభవిస్తుంది. ఈ వింత జబ్బుతో వీనస్ రోజుకు 22 గంటలపాటు క్షణమొక యుగంగా బతుకుతోంది.
వీనస్ ఎహ్లర్స్ డాన్లోస్ సిండ్రోమ్ (EDS) అనే ఈ జన్యు సంబంధ వ్యాధితో బాధపడుతుంది. వంశపారపర్యంగా సోకే ఈ అరుదైన వ్యాధి ప్రభావం చర్మం, ఎముకలు, రక్తనాళాలు, అవయవాలకు సంబంధించిన కణజాలాలపై చూపిస్తుంది. ఇది వంశపారపర్యంగా సోకే ఈ అరుదైన వ్యాధి అని తెలుస్తోంది. వీనస్ రోజుకు 22 గంటలు మంచంమీదే పడుకుని ఉంటుంది. ఎందుకంటే ఆమె కదల్లేదు..మెదల్లేదు. మెడ, వెన్నుపూసలు నిటారుగా నిలబడలేవు. ఒకవేళ కదిలినా ప్రాణం పోతుంది కనుక. ఇక తినే తిండి ద్రవ పదార్ధాలను మాత్రం ఆహార గొట్టాల సాయంగానే తీసుకుంటుంది.
ఇక వీనస్ శరీరంలోని కొన్ని భాగాలు కదలకుండా ఉండటానికి 22 రింగులను తొడిగారు. కదిలితే మరణిస్తుంది కనుక ఇలా చేయాల్సి వచ్చింది. ఇక శరీరం సూర్యరశ్మి కిరణాల వేడి ని కూడా తట్టుకొలేదు. అందుకే వీనస్ ఎప్పుడూ చీకటిలోనే ఉండేలా చూసుకుంటుంది ఫ్యామిలీ. తన అరుదైన వ్యాధి గురించి వీనస్ మాట్లాడుతూ.. తనకు ఇంకా ఎంత జీవితకాలం ఉందొ తెలియదు.. నేను మానసికంగా శారీరకంగా అలసిపోతున్నా .. ఇన్ని బాధలు పడుతూ బతకాలని లేదు అంటూ కన్నీరు పెట్టుకుంటుంది.
అయితే ఆమెకు ఉపశమనఁ కలిగించడానికి స్పెయిన్‌లోని బార్సినాలోని వైద్యులు ముందుకొచ్చారు. ఓ అరుదైన ఆపరేషన్ చేయాల్సి ఉందని.. ఇది చాలా ఖర్చుతో కూడుకుందని చెప్పారు. అందుకని ఈ ఆపరేషన్‌కు అవసరమైన మొత్తాన్ని క్రౌడ్ ఫండింగ్ సహయంతో సేకరిస్తున్నారు. డాక్టర్ల కృషి ఫలించి. వీనస్ వ్యాధి నయం అయ్యి.. అందరిలా సంతోషంగా జీవించాలని నెటిజన్లు ప్రార్థిస్తున్నారు.
Also Read: మనం పళ్ళను శుభ్రపరచుకోవడానికి వాడే టూత్ పేస్ట్ ఎన్ని రోగాలను తెస్తుందో తెలుసా..!
ఒకప్పుడు ఐదు రూపాయల కోసం చెత్త ఏరుకున్న మహిళ.. నేడు కోట్ల రూపాయల టర్నోవర్‌తో బిజినెస్