Kim Jong Un: తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉ.కొరియా…కిమ్ ముంగిట అగ్ని పరీక్షే!

North Korea President Kim Jong Un: ఉత్తర కొరియా అధ్యక్ష హోదాలో కిమ్ జోంగ్-ఉన్ పదేళ్లు పూర్తి చేసుకోనున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన ఓ అగ్ని పరీక్షను ఎదుర్కొంటున్నారు.

Kim Jong Un: తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉ.కొరియా...కిమ్ ముంగిట అగ్ని పరీక్షే!
North Korea President Kim Jong-Un
Follow us
Janardhan Veluru

|

Updated on: Apr 07, 2021 | 3:13 PM

ఉత్తర కొరియా అధ్యక్ష హోదాలో కరుడుగట్టిన నియంత కిమ్ జోంగ్-ఉన్ పదేళ్లు పూర్తి చేసుకోనున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన ఓ అగ్ని పరీక్షను ఎదుర్కొంటున్నారు. కరోనా లాక్‌డౌన్ కారణంగా ఉత్తర కొరియా తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటోంది. కిమ్ అస్తవ్యస్థ ఆర్థిక విధానాలకు అమెరికా ఆంక్షలు తోడుకావడంతో ఉత్తర కొరియా ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుంది. దేశంలో నెలకొన్న ప్రస్తుత ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దడం కిమ్‌కు కత్తి మీద సాములా మారిందని ఆర్థిక నిపుణులు విశ్లేషిస్తున్నారు.

దేశం ప్రస్తుతం ఇబ్బందికర ఆర్థిక పరిస్థితిని ఎదుర్కొంటున్నట్లు స్వయంగా కిమ్ ధృవీకరించారు. అధికార వర్కర్స్ పార్టీ కార్యకర్తలనుద్దేశించి మాట్లాడిన కిమ్…మునుపెన్నడూ లేని స్థాయిలో దేశం ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటోందని తెలిపారు. క్లిష్ట పరిస్థితుల్లోనూ దేశ ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపరిచేందుకు కిందిస్థాయి పార్టీ శ్రేణులు క్రియాశీలక పాత్ర పోషించాలని పిలుపునిచ్చారు. దేశాభివృద్ధి కోసం ఈ ఏడాది జనవరి మాసంలో పార్టీ కాంగ్రెస్‌లో నెరవేర్చిన పంచ తీర్మానాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు పార్టీ నాయకులు కృషిచేయాలని కోరారు.

అమెరికాలో నాయకత్వ మార్పు అనంతరం కిమ్ జోంగ్ ఉన్ దూకుడు పెంచారు. వరుస క్షిపణి పరీక్షలు చేపడుతూ గత కొంతకాలంగా అమెరికాతో పాటు పొరుగుదేశాలైన దక్షిణ కొరియా, జపాన్‌తో కయ్యానికి కాలుదువ్వుతున్నారు. అటు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌కు వార్నింగ్స్ ఇస్తూ టెన్షన్ వాతావరణం సృష్టిస్తున్నారు. అణ్వాయుధ నిరాయుధీకరణకు సంబంధించి అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో కిమ్ జరిపిన చర్చల్లో పురోగతి లేకపోవడంతో…ఇప్పుడు ఉత్తరకొరియా పట్ల బైడెన్ నాయకత్వం ఎలా వ్యవహరించబోతున్నది ఆసక్తికరంగా మారింది.

దేశంలో తమ ఆర్థిక దుస్థితికి అమెరికా ఆంక్షలే కారణమని ఉత్తర కొరియా నాయకత్వం మొదటి నుంచీ భావిస్తోంది. తన అస్తవ్యస్థ ఆర్థిక విధానాలపై కిమ్ ఎలాంటి ఆత్మవిమర్శ చేసుకోవడం లేదన్న విమర్శలు ఉన్నాయి.

ఇవి కూడా చదవండి.. 22 గంటలు బెడ్ మీదనే.. కదిలినా..ఎండ తగిలినా ప్రాణం పోతుంది.. ఇక్కడే నరకం చూస్తున్నా అంటూ కన్నీరు

తక్కువ పెట్టుబడి.. ఎక్కువ లాభాలు తెచ్చే బొద్దింకల వ్యాపారం.. లక్షల్లో సంపాదన