Manjula Vaghela’s Success Story: ఒకప్పుడు ఐదు రూపాయల కోసం చెత్త ఏరుకున్న మహిళ.. నేడు కోట్ల రూపాయల టర్నోవర్‌తో బిజినెస్

Manjula Vaghela's journey: కృషి, పట్టుదల ఉంటే మనిషి సాధించాలేది ఏదీ లేదని నిరూపించిందో మహిళ. ఐదు రూపాయల సంపాదన కోసం కష్టపడి రోడ్డు మీద చెత్త ఏరుకుంటూనే తనకంటూ ఓ లక్ష్యాన్ని నిర్ధేశించుకుంది...

Manjula Vaghela's Success Story: ఒకప్పుడు ఐదు రూపాయల కోసం చెత్త ఏరుకున్న మహిళ.. నేడు కోట్ల రూపాయల టర్నోవర్‌తో బిజినెస్
Manjula Vaghela
Follow us

|

Updated on: Apr 07, 2021 | 1:07 PM

Manjula Vaghela’s journey: కృషి, పట్టుదల ఉంటే మనిషి సాధించాలేది ఏదీ లేదని నిరూపించిందో మహిళ. ఐదు రూపాయల సంపాదన కోసం కష్టపడి రోడ్డు మీద చెత్త ఏరుకుంటూనే తనకంటూ ఓ లక్ష్యాన్ని నిర్ధేశించుకుంది. తన ఆర్ధిక ఎదుగుదలకు ఏకష్టాలు అడ్డురావని.. ఆత్మవిశ్వాసం తో సాధించలేనిది ఏదీ లేదని నిరూపించింది. ఐదు రూపాయల నుంచి నేడు కోట్ల టర్నోవర్ కలిగిన కంపెనీని నిర్వహించే స్టేజ్ కు చేరుకుంది. ఎందరికో ఆశ్చర్యాన్ని.. మరి ఎందరికో స్ఫూర్తిని ఇస్తుంది.. అహ్మదాబాద్ కు చెందిన 60 ఏళ్ల మ్నాహులా వాఘేలా. వివరాల్లోకి వెళ్తే..

అహ్మదాబాద్ కు చెందిన అరవై ఏళ్ళ మంజులా వాఘేలా.. ఒకప్పుడు అక్కడ వీధుల్లో ఐదు రూపాయల సంపాదనకోసం చెత్తను ఏరుకుంది. అయితే ఆమె ఇప్పుడు క్లీనర్స్ కో ఆపరేటివ్ సంస్థ యాజమాని.. ప్రస్తుతం కోటి రూపాయల టర్నోవర్ తో నడుస్తుంది. సౌందర్య సఫాయీ ఉత్కర్ష్ మహిళా సేవా సహకారి మండలి లిమిటెడ్ పేరున ప్రస్తుతం అహ్మదాబాద్ లోని 45 సంస్థలకు ఆమె వర్కర్లను సప్లై చేయడంతోపాటు… క్లీనింగ్, మరియు హౌస్ కీపింగ్ సేవలు అందిస్తోంది.

నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ డిజైన్ సంస్థ.. క్లీనర్స్ కో ఆపరేటివ్ సంస్థకు భారత దేశంలో మొట్ట మొదటి అధికారిక ఖాతాదారిగా మారడం ఆమెకు ఎంతగానో కలసి వచ్చింది. అక్కడి నుంచి మంజులా వెనక్కు తిరిగి చూడలేదు.

ఇలా మొదలైన ప్రయాణం నేడు 45 సంస్థలకు నాలుగు వందల మంది సభ్యులతో తమ సేవలు అందిస్తుంది. ఆ తర్వాత ఫిజికల్ రీసెర్చ్ లేబొరెటరీ వాఘేలా సంస్థ ప్రారంభించింది. ఇందులో 15 మంది మహిళలకు పని కల్పించింది. అలా మొదలైన వాఘేలా ప్రయాణం నేడు 400మంది కి పని కల్పిస్తుంది

తనలా చెత్త ఏరుకునే మహిళలకు పలు కల్పించి వర్కర్లుగా చేర్పించి సేవలను అందిస్తుంది. ఆయా సంస్థల్లో రోడ్లు శుభ్రం చేయడం, వాక్యూమ్ క్లీనింగ్, ఫ్లోర్ క్లీనింగ్, కార్పెట్లను శుభ్రపరిచే మెషీన్లను నడపడం వంటి పనులను నిర్వహిస్తున్నారు. ఎందరో చదువుకున్నవారు అవకాశాలు లేవని.. నిరాశతో నిసృహతో సమాజాన్ని నిందించేవారికి మంజులా వాఘేలా ఆదర్శంగా నిలుస్తుంది.

Also Read: లడఖ్ లోయ.. ప్రకృతి ప్రేమికులకు స్వర్గం.. ఆప్రికాట్ ఫెస్టివల్ కు సర్వం సిద్ధం..

రొటీన్ ఫుడ్ భిన్నంగా ట్రై చేయండి టేస్టీ టేస్టీ.. బేబీ కార్న్, శనగల రైస్..

వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!
కేసీఆర్ బస్సును ఆపి భావోద్వేగంతో మాట్లాడిని రైతన్నలు..
కేసీఆర్ బస్సును ఆపి భావోద్వేగంతో మాట్లాడిని రైతన్నలు..
తొక్కే కదా అని తీసిపారేయకండి.. వీరికి ఇది బ్రహ్మాస్త్రం.!
తొక్కే కదా అని తీసిపారేయకండి.. వీరికి ఇది బ్రహ్మాస్త్రం.!
'వరంగల్‎కి త్వరలో ఎయిర్ పోర్టు'.. జనజాతర సభలో సీఎం రేవంత్..
'వరంగల్‎కి త్వరలో ఎయిర్ పోర్టు'.. జనజాతర సభలో సీఎం రేవంత్..
జాక్ పాట్ కొట్టిన ప్రశాంత్ వర్మ..
జాక్ పాట్ కొట్టిన ప్రశాంత్ వర్మ..
ప్రపంచ మలేరియా దినోత్సవాన్ని ఎందుకు జరుపుకుంటారో తెలుసా..
ప్రపంచ మలేరియా దినోత్సవాన్ని ఎందుకు జరుపుకుంటారో తెలుసా..
పంత్ విధ్వంసం, అక్షర్, స్టబ్స్ మెరుపులు .. ఢిల్లీ భారీ స్కోరు
పంత్ విధ్వంసం, అక్షర్, స్టబ్స్ మెరుపులు .. ఢిల్లీ భారీ స్కోరు
పెళ్లినా.. పాప తగ్గడంలేదుగా.. ఓ రేంజ్‌లో అందాలు ఆరబోసిన రకుల్
పెళ్లినా.. పాప తగ్గడంలేదుగా.. ఓ రేంజ్‌లో అందాలు ఆరబోసిన రకుల్