- Telugu News Photo Gallery Viral photos Visual delight ladakh apricot blossom festival is a travelers paradise
Visual Delight: లడఖ్ లోయ.. ప్రకృతి ప్రేమికులకు స్వర్గం.. ఆప్రికాట్ ఫెస్టివల్ కు సర్వం సిద్ధం..
జమ్ము కాశ్మీర్ నుంచి విడిపోయి యూటీగా ఏర్పడిన లడఖ్ ప్రకృతి సోయగాలతో కనువిందు చేస్తోంది. ఇక్కడ పర్యాటక రంగాన్ని ప్రోత్సహించే ప్రయత్నంలో భాగంగా అక్కడ ప్రభుతం ఆప్రికాట్ బ్లోసమ్ ఫెస్టివల్‌ను ప్రవేశపెట్టింది. అక్కడ జపాన్ లో చెర్రీ పండుగ మాదిరిగానే ప్రపంచ పర్యాటకను ఆకర్షించడానికి ప్రయత్నాలు చేస్తుంది. అప్రికాట్ , చెర్రీ, నేరేడు పండు , పువ్వులతో ఎంతో అందాన్ని సంతరించుకున్నాయి.
Updated on: Apr 07, 2021 | 7:45 PM

21 వ శతాబ్దంలో అప్రికాట్ పండ్లు లడఖ్ లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నాయి. అవి లడఖ్ సంస్కృతి, వారసత్వం మరియు ఆర్థిక వ్యవస్థలో అంతర్భాగంగా మారాయి. ప్రస్తుతం లడఖ్ లోయలు అప్రికాట్ చెట్లతో నిండి పోయాయి.

ఇప్పటి వరకు జమ్మూకాశ్మీర్ ను పర్యాటకులకు సర్వధామంగా పిలుస్తారు.. అదే రేంజ్ లో లడఖ్ లో కూడా అందాలు ఉన్నాయి. కనుక పర్యాటకులను ఆకర్షించే విధంగా అన్ని చర్యలు తీసుకుంటున్నారు. స్థానిక హస్తకళల ప్రదర్శన, ఆప్రికాట్స్ అమ్మకం, సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించడం ఇలా అన్ని చర్యలు తీసుకుంటున్నారు.

ఈ ఆప్రికాట్ ఫెస్టివల్ ను లడఖ్ లోని పలు గ్రామాల్లో నిర్వహించడానికి అధికారులు ఏర్పాట్లు చేశారు. లడఖ్ లోని గార్కోన్, డార్కిక్, సంజాక్, హర్దాస్, తుర్తుక్, త్యాక్షి వంటి గ్రామాల్లో ఈ పండగను నిర్వహిస్తారు.

ప్రతి ఏడాది ఏప్రిల్ నెలో గులాబీలను తలపించే విధంగా తెల్లని పువ్వులతో లోయలు నిండిపోతాయి. సరికొత్త అందాలను తీసుకొస్తాయి. ఈ పువ్వులు వికసించిన సమయంలో లోయలు ఎంతో మనోహరంగా ఉంటాయి. ఆ అందాలను చూడాలి తప్ప వర్ణించలేము. ఈ నేపథ్యంలో జపాన్ చెర్రీ పండగ నిర్వహించినట్లు మనం ఎందుకు లడఖ్ లో ఆప్రికాట్ పండగను నిర్వహించలేము అని ప్రశ్నించారు.. మనకు కూడా అంత అందమైన ప్రకృతి సొంతం.. అలా నిర్వహించే సామర్ధ్యం ఉన్నాయని అన్నారు.

లడఖ్ లో ఈ ఆప్రికాట్ బ్లోసమ్ ఫెస్టివల్ ఏప్రిల్ 6 నుండి ప్రారంభమై ఏప్రిల్ 18 వరకు కొనసాగుతుంది. కనుక ప్రకృతి అందాలతో మంత్రముగ్ధులను చేసే సౌందర్యాన్ని చూడడానికి ఆహ్లాదంగా గడపడానికి తగిన విధంగా ప్లాన్ చేసుకోవాలి

ఈ సంవత్సరం లడఖ్ లో ఇప్పటి వరకూ జరగని విధంగా అప్రికాట్ ఫెస్టివల్ ను నిర్వహిస్తున్నారు. కనులకు విందు అందించే అందాలను ఆస్వాదించడానికి జపాన్ వరకూ అవసరం లేదు.. మనదేశంలోని లడఖ్ పయనం అవ్వండి.. లక్షల ఖర్చు చేయాల్సి అవసరం లేకుండానే లడాఖ్ లోని ఆప్రికాట్ ఫెస్టివల్ లో పాల్గొని . అంతకు మించి ఆనందాన్ని సొంతం చేసుకోండి.




