AP Police: పోలీసన్న నీకు సలాం.. మంచి మనసు చాటుకున్న ఏపీ పోలీస్.. హ్యాట్సాఫ్ అంటోన్న జనాలు..
Human Face In Police: పోలీసులు అంటే చాలా కఠిన హృదయంతో ఉంటారు అని చాలా మందిలో ఉన్న భావన. అక్రమార్కులపై, నేరాలు చేసిన వారిపై కాస్త కఠినంగా వ్యవహరిస్తారు కాబట్టే బహుశా వారికి అలాంటి...
Human Face In Police: పోలీసులు అంటే చాలా కఠిన హృదయంతో ఉంటారు అని చాలా మందిలో ఉన్న భావన. అక్రమార్కులపై, నేరాలు చేసిన వారిపై కాస్త కఠినంగా వ్యవహరిస్తారు కాబట్టే బహుశా వారికి అలాంటి గుర్తింపు వచ్చిండొచ్చు. కానీ వారికి కుటుంబాలు ఉంటాయి, పోలీసులు హృదయంలోనూ తడి ఉంటుందని వారిని దగ్గరి నుంచి చూసిన వారికే తెలుస్తుంది. తాజాగా తమిళనాడులో చోటుచేసుకున్న ఓ సంఘటన దీనికి ప్రత్యక్ష ఉదాహరణగా నిలుస్తోంది. అంతేనా.. పోలీసులకు సలాం చెప్పేలా చేస్తోంది. వివరాల్లోకి వెళితే.. తాజాగా తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఓ కానిస్టేబుల్ ఎన్నికల విధుల్లో భాగంగా తమిళనాడు వెళ్లాడు. అదే సమయంలో ఓ తల్లి నెల వయసున్న తన చిన్నారితో పోలింగ్ కేంద్రానికి వచ్చింది. ఎండ తీవ్రంగా ఉండడం, లైన్ ఎక్కువ ఉండడంతో చిన్నారి గుక్కపెట్టి ఏడిచింది. దీంతో ఆ సంఘటనను చూసిన ఓ కానిస్టేబుల్ వెంటనే చిన్నారిని తన చేతుల్లోకి తీసుకొని లాలించాడు. ఆ తల్లి ఓటు హక్కు వినియోగించుకొని వచ్చే వరకు బిడ్డను ఎత్తుకుని ఆడించాడు. ఇక ఈ సంఘటనకు సంబంధించిన ఫోటోను ఆంధ్రప్రదేశ్ పోలీసులు ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. ఈ ఫొటోతో పాటు.. ‘తమిళనాడు ఎన్నికల్లో మానవత్వం చాటుకున్న ఏపీ పోలీసు కానిస్టేబుల్. ఈ అనంతపురం పోలీసు కానిస్టేబుల్ తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా అక్కడ విధులు నిర్వహించాడు. ఈ క్రమంలో ఓ తల్లి తన నెల రోజుల పసికందును తీసుకుని ఓటు వేయడం కోసం పోలింగ్ కేంద్రానికి వచ్చింది. ఇక ఆ మహిళ ఓటు వేసి వచ్చేవరకు ఆ చిన్నారిని ఎత్తుకుని ఆడించాడు. ఈ కానిస్టేబుల్ చేసిన పనిని అక్కడున్న వారందరు ప్రశంసించారు’ అంటూ క్యాప్షన్ జోడించింది. దీంతో ఈ ఫొటో చూసిన నెటిజన్లు సదరు కానిస్టేబుల్‌పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ పోలీస్ చేసిన ట్వీట్..
#APPolice‘s humane face at #TamilNaduElections: @AnantapurPolice constable deployed to #TamilNadu for #TamilNaduElections2021 carried & lulled a 1-month-old crying baby until the mother’s return from the voting booth, winning the hearts of many.#AndhraPradesh#Elections2021 pic.twitter.com/vk0DO2doJN
— Andhra Pradesh Police (@APPOLICE100) April 6, 2021
Also Read: Megha Engineering: మరో ఘనత సాధించిన ‘మేఘా’.. స్వదేశీ పరిజ్ఞానంతో ఆయిల్ రిగ్గులు..