AP Corona Cases Update: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా విలయం.. ఒక్కరోజులో 11 మంది మృతి.. తాజాగా నమోదైన కేసులెన్నంటే..

AP Corona Cases Update: ఆంధ్రప్రదేశ్‌ను కరోనా మహమ్మారి మరోసారి హడలెత్తిస్తోంది. సెకండ్ వేవ్ రూపంలో రాష్ట్రంలో విస్తృతంగా..

AP Corona Cases Update: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా విలయం.. ఒక్కరోజులో 11 మంది మృతి.. తాజాగా నమోదైన కేసులెన్నంటే..
Coronavirus
Follow us

|

Updated on: Apr 07, 2021 | 7:26 PM

AP Corona Cases Update: ఆంధ్రప్రదేశ్‌ను కరోనా మహమ్మారి మరోసారి హడలెత్తిస్తోంది. సెకండ్ వేవ్ రూపంలో రాష్ట్రంలో విస్తృతంగా వ్యాప్తి చెందుంతోంది. ఫలితంగా రోజు రోజుకు కరోనా పాజిటివ్‌ల సంఖ్య విపరీతంగా పెరుగుతున్నాయి. పక్షం రోజుల క్రితం వందలోపే నమోదైన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య ఇప్పుడు ఏకంగా వేలకు చేరింది. తాజాగా గడిచిన 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా 2,331 మంది కరోనా వైరస్ సోకింది. మంగళవారం సాయంత్రం నుంచి ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 31,812 మంది సాంపిల్స్ సేకరించిన కోవిడ్ టెస్టులు నిర్వహించగా.. 2,331 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ఈ విషయాన్ని రాష్ట్ర వైద్యఆరోగ్య శాఖ కరోనా బులెటిన్ ద్వారా వెల్లడించింది. ఈ బులెటిన్ ప్రకారం.. రాష్ట్రంలో కరోనా కారణంగా ఒక్క రోజులోనే 11 మంది మృత్యువాత పడ్డారు.

చిత్తూరు జిల్లాలో నలుగురు, కర్నూలులో ఇద్దరు, అనంతపూర్, తూర్పుగోదావరి, కృష్ణా, నెల్లూరు, విశాఖపట్నం జిల్లాల్లో ఒక్కరు చొప్పున మొత్తం 11 మంది ప్రాణాలు కోల్పోయారు. కరోనా కేసుల సంఖ్య పెరగడంతో పాటు.. మృతుల సంఖ్య కూడా పెరుగుతుండటంతో రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర ఆందోళన వ్యక్తం అవుతోంది. ఇక గడిచిన 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 853 మంది కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 13,276 యాక్టీవ్ కేసులు ఉన్నాయి. ఇక కరోనా బులెటిన్ ప్రకారం.. రాష్ట్రంలో ఇప్పటి వరకు 91,32,74 మంది కరోనా బారిన పడ్డారు. వీరిలో 89,27,36 మంది కోలుకున్నారు. 7,262 మంది కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోయారు.

Also read: Gold-Silver Rates Today: బంగారం పైపైకి.. నిలకడగా వెండి… ఈ రోజు ప్రధాన నగరాల్లో రేట్లు ఏ విధంగా ఉన్నాయంటే..? ( వీడియో )

SBI Home Loans: ఖాతాదారులకు ముఖ్య గమనిక.. గృహ రుణాలపై వడ్డీ రేట్లు పెంపు.. అసలు మ్యాటర్ ఇదీ అంటూ క్లారిటీ ఇచ్చిన ఎస్‌బిఐ

ఆ గ్రామ ప్రజలు పేరుకే కోటీశ్వరులు.. అసలు బట్టలే ధరించరు.. పర్యాటకులకు ఇదే రూల్.. ఎందుకో తెలిస్తే షాక్ అవుతారు!