YS. Sharmila: వైఎస్ షర్మిల ‘సంకల్ప సభ’కు గ్రీన్ సిగ్నల్.. కోవిడ్ నిబంధనలతో అనుమతి
Khammam police - Sankalpa Sabha: తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకు భారీగా పెరుగుతోంది. ఈ క్రమంలో రాష్ట్రం అంతటా
Khammam police – Sankalpa Sabha: తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకు భారీగా పెరుగుతోంది. ఈ క్రమంలో రాష్ట్రం అంతటా ఆందోళన నెలకొంది. దీంతో పలు సభలు, సమావేశాలపై ఆంక్షలు సైతం విధిస్తున్నారు. ఈ తరుణంలో వైఎస్ షర్మిల ఈనెల 9న నిర్వహించే సంకల్ప సభకు ఖమ్మం పోలీసులు అనుమతి ఇచ్చారు. కోవిడ్ నిబంధనలకు లోబడి సభను జరుపుకోవాలంటూ వైఎస్ షర్మిల అనుచరులకు సూచించారు. ఈ సమావేశంలో షర్మిల పార్మిల పార్టీ పేరును, గుర్తు, జెండా, విధివిధానాలను ప్రకటించనున్నారు.
ఇప్పటివరకూ ఆత్మీయ సమ్మేళనాలతో లోటస్ పాండ్‌లో షర్మిల పలు జిల్లాల నాయకులతో సమావేశమయ్యారు. పార్టీ గుర్తు, విధివిధానాలను మాత్రం ప్రకటించలేదు. ఎలాంటి వ్యూహాలతో ముందుకు వెళతారనేదీ స్పష్టంచేయనున్నారు. ఇదిలాఉంటే.. ఈ సమావేశంలో షర్మిలతోపాటు వైఎస్ విజయలక్ష్మి, పిన్ని భారతి పాల్గొనే అవకాశముంది. ఈ సభా వేదికపై వందమంది పాల్గొనేలా ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే సంకల్ప సభకు పోలీసులు అనుమతి ఇవ్వడంతో.. షర్మిల అనుచరులు జన సమీకరణపై దృష్టి సారించనున్నారు.
Also Read: