Srisailam Project: శ్రీశైలం జలాశయం ఖాళీ.. ఏప్రిల్ 9న కృష్ణా బోర్డు సమావేశం..!
Srisailam Project: గతేడాది సంభవించిన భారీ వరదలు కారణంగా నిండుకుండలా తలపించిన శ్రీశైలం జలాశయం.. ప్రస్తుతం నీరు లేక వెలవెలబోతోంది...
Srisailam Project: గతేడాది సంభవించిన భారీ వరదలు కారణంగా నిండుకుండలా తలపించిన శ్రీశైలం జలాశయం.. ప్రస్తుతం నీరు లేక వెలవెలబోతోంది. విద్యుత్ ఉత్పత్తి ఇప్పటికే నిలిచిపోగా, జలాశయం నుంచి నీరు వెళ్లే ఎత్తిపోతల పథకాలకు నీటిని లిఫ్ట్ చేయలేని పరిస్థితి నెలకొంది. ఈ నేపధ్యంలో ఏప్రిల్ 9వ తేదీన కృష్ణా బోర్డు ప్రత్యేకంగా సమావేశం కావాలని నిర్ణయించింది. ఈ మేరకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు సమాచారాన్ని అందించింది. రెండు రాష్ట్రాల పరిధిలోని ప్రాజెక్ట్‌లలో ఉపయోగించిన నీటి వివరాలను అందించాలని కోరింది. ఈ అన్ని అంశాలపై బోర్డు త్రిసభ్య కమిటీ చర్చించి.. నీటి పంపిణీపై తుది నిర్ణయం తీసుకుంటామని తెలిపింది.
ఇదిలా ఉంటే ఈ ఏడాది మొదటి నుంచి రాష్ట్రంలో భారీగా కురిసిన వర్షాల కారణంగా కృష్ణా, గోదావరి బేసిన్‌లోని ప్రాజెక్ట్‌లన్నీ కూడా నీటితో నిండిపోయాయి. అయితే కృష్ణా బేసిన్‌లో ఏకంగా 1,280 టీఎంసీల నీరు వృధా కావడం.. అటు శ్రీశైలం ప్రాజెక్ట్‌లో ప్రస్తుతం 35.73 టీఎంసీల నీరు మాత్రమే నిల్వ ఉంది. ఈ ఏడాది నీటి నిల్వ కనీస మట్టం కన్నా కిందకు వెళ్ళకూడదని గతంలో జరిగిన సమావేశంలో కృష్ణా బోర్డు నిర్ణయం తీసుకోగా.. వేసవి ఆరంభం కాకముందే అందుకు భిన్నంగా జరిగింది.
Also Read:
‘జగనన్న స్మార్ట్ టౌన్’.. దరఖాస్తు చేసుకోండిలా.. అర్హతలు ఇవే.!
ఈ ఫోటోలోని ఇద్దరు హీరోయిన్స్‌ను గుర్తు పట్టారా.? సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న పిక్.!
ఇంటి గుమ్మంలో తిష్టవేసిన సింహాలు.. డోర్ తీసి కంగుతిన్న యజమాని.. కట్ చేస్తే ఊహించని సంఘటన.!