ఈ ఫోటోలోని ఇద్దరు హీరోయిన్స్‌ను గుర్తు పట్టారా.? సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న పిక్.!

Keerthi Suresh Childhood Pic: సెలబ్రెటీల చిన్ననాటి వీడియోలు , ఫోటోలు నెట్టింట చక్కర్లు కొట్టడం కామన్. చాలామంది నటీనటులు తమ చిన్ననాటి జ్ఞాపకాలను..

  • Ravi Kiran
  • Publish Date - 12:50 pm, Tue, 6 April 21
ఈ ఫోటోలోని ఇద్దరు హీరోయిన్స్‌ను గుర్తు పట్టారా.? సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న పిక్.!

Keerthi Suresh Childhood Pic: సెలబ్రెటీల చిన్ననాటి వీడియోలు , ఫోటోలు నెట్టింట చక్కర్లు కొట్టడం కామన్. చాలామంది నటీనటులు తమ చిన్ననాటి జ్ఞాపకాలను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటుంటారు. ఇదే కోవలో ఇద్దరు హీరోయిన్స్‌కి సంబంధించిన ఓ త్రోబ్యాక్ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక వారెవరో కాదు.. ఒకరు ‘మహానటి’ కీర్తి సురేష్ అయితే.. మరొకరు ‘హలో’ ఫేం కళ్యాణి ప్రియదర్శన్. ఈ ఇద్దరూ చిన్నప్పుడు కలిసి దిగిన ఓ ఫోటోను కీర్తి సురేష్ తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. కళ్యాణికి బర్త్ డే విషెస్ చెప్పింది. ఇక ఆ ఫోటోలో ఎవరు కీర్తి.? ఎవరు కళ్యాణి ప్రియదర్శన్ అన్నది మీరే కనిపెట్టండి.

కాగా, కీర్తి సురేష్ ప్రస్తుతం తెలుగు, తమిళ భాషల్లో పలు చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది. అటు కళ్యాణి ఇప్పటికే పలు సినిమాల్లో నటించినా.. ఇంకా సరైన సక్సెస్ దక్కించుకోలేకపోయింది. ఇద్దరివి సినిమా ఇండస్ట్రీకి చెందిన కుటుంబాలే. కీర్తి- కళ్యాణిలు చిన్నప్పటి నుంచి మంచి స్నేహితులు. కాగా, కీర్తి, కళ్యాణి చైల్డ్ హుడ్ పిక్ ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది.

Also Read:

Viral: నిమిషాల్లో ప్రాణాలు తీసే మొక్క.. పాము కంటే అత్యంత ప్రమాదకరం.. తస్మాత్ జాగ్రత్త.!

”నువ్వు తోపు.. అయితే నాకేంటి”.. మొసలిని లెక్క చేయని జీబ్రా.. ఏం జరిగిందంటే.!

అద్భుత రికార్డు.. 13 బంతుల్లో 10 వికెట్లు పడగొట్టిన చెన్నై సూపర్ కింగ్స్ బౌలర్.. అతడు ఎవరంటే.!

Shocking: మొక్క కాదు “యమపాశం’..తాకితే తగలబెడుతుంది.. అసలు ఎందుకో తెలుసా.?