Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2021: 13 బంతుల్లో 10 వికెట్లు పడగొట్టిన చెన్నై సూపర్ కింగ్స్ బౌలర్.. అతడు ఎవరంటే.!

IPL 2021: ఇండియా తరపున టీ20 క్రికెట్‌లో ఉత్తమ బౌలింగ్ ప్రదర్శన ఇచ్చిన బౌలర్ ఎవరంటే.? ఠక్కున అందరూ కూడా చెన్నై సూపర్ కింగ్స్ బౌలర్...

IPL 2021: 13 బంతుల్లో 10 వికెట్లు పడగొట్టిన చెన్నై సూపర్ కింగ్స్ బౌలర్.. అతడు ఎవరంటే.!
IPL 2021
Follow us
Ravi Kiran

|

Updated on: Apr 06, 2021 | 12:08 PM

IPL 2021: ఇండియా తరపున టీ20 క్రికెట్‌లో ఉత్తమ బౌలింగ్ ప్రదర్శన ఇచ్చిన బౌలర్ ఎవరంటే.? ఠక్కున అందరూ కూడా చెన్నై సూపర్ కింగ్స్ బౌలర్ దీపక్ చాహార్ అని అంటారు. అవును.! మీరు విన్నది నిజమే. మహేంద్ర సింగ్ ధోని నాయకత్వంలోని చెన్నై సూపర్ కింగ్స్ తరపున దీపక్ చాహార్ ప్రతీ సీజన్‌లోనూ అద్భుతమైన ప్రదర్శన కనబరుస్తు వస్తున్నాడు. ఈ కుడి చేతి పేస్ బౌలర్ బంగ్లాదేశ్‌పై తన కెరీర్ బెస్ట్ పెర్ఫార్మన్స్ ఇచ్చాడు.

నాగ్‌పూర్ వేదికగా బంగ్లాదేశ్‌తో జరిగిన టీ20లో కేవలం 7 పరుగులు సమర్పించి 6 వికెట్లు పడగొట్టాడు. ఇందులో హ్యాట్రిక్ కూడా ఉంది. ఇది మాత్రమే కాదు, సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో అతడు ఏకంగా 13 బంతుల వ్యవధిలో 10 వికెట్లు పడగొట్టాడు. ఇలాంటి అద్భుత ప్రదర్శనలు చేసిన దీపక్ చాహార్.. ఐపీఎల్ 2021లో తన జట్టుకు విజయాలు అందించేందుకు సిద్దమవుతున్నాడు. నెట్స్‌లో కఠోరంగా శ్రమిస్తున్నాడు. బంగ్లాదేశ్‌పై అద్భుత ప్రదర్శన ఇచ్చిన చాహార్.. ఆ తర్వాత జరిగిన సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో విదర్భతో ఆడిన మ్యాచ్‌లో ఆరు బంతుల్లో నాలుగు వికెట్లు పడగొట్టాడు. యూపీతో జరిగిన మ్యాచ్‌లో చివరి ఓవర్లో ప్రత్యర్ధిని బెదరగొట్టాడు. 13 బంతుల్లో 10 వికెట్లు తీశాడు.

ఇన్‌-స్వింగ్ బౌలింగ్ దీపక్ చాహార్ ఆయుధం..

ఐపీఎల్‌లో దీపక్ చాహర్ ప్రదర్శనను పరిశీలిస్తే.. ఈ లీగ్‌లో ఇప్పటివరకు మొత్తం 48 మ్యాచ్‌లు ఆడిన చాహార్.. 7.62 ఎకానమీ రేటుతో 45 వికెట్లు పడగొట్టాడు. అతని ఉత్తమ ప్రదర్శన 15 పరుగులకు మూడు వికెట్లు. ఇక గత సీజన్‌లో దీపక్ చాహర్ 14 మ్యాచ్‌లు ఆడి 12 వికెట్లు తీశాడు. ఐపీఎల్ 2020లో, అతడి ఎకానమీ రేటు 7.61, ఉత్తమ ప్రదర్శన 18 పరుగులకు రెండు వికెట్లు.

Also Read:

Viral: నిమిషాల్లో ప్రాణాలు తీసే మొక్క.. పాము కంటే అత్యంత ప్రమాదకరం.. తస్మాత్ జాగ్రత్త.!

Scary Video: ”నువ్వు తోపు.. అయితే నాకేంటి”.. మొసలిని లెక్క చేయని జీబ్రా.. ఏం జరిగిందంటే.!