IPL Live streaming: హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్ లేకుండానే మొబైల్‌లో ఐపీఎల్ మ్యాచ్‌లు.. ఏలాగంటే..
IPL Live streaming: ఐపీఎల్ 2021కి సర్వం సిద్ధమైంది. గతేడాది కరోనా కారణంగా విదేశాల్లో జరిగిన టోర్నీ ఈసారి దేశంలోనే జరగనుండడం, స్టేడియంలోకి ప్రేక్షకులను అనుమతించడంతో...
IPL Live streaming: ఐపీఎల్ 2021కి సర్వం సిద్ధమైంది. గతేడాది కరోనా కారణంగా విదేశాల్లో జరిగిన టోర్నీ ఈసారి దేశంలోనే జరగనుండడం, స్టేడియంలోకి ప్రేక్షకులను అనుమతించడంతో క్రికెట్ లవర్స్‌లో జోష్ నిండింది. ఇక ఇప్పటికే ఐపీఎల్ వేలం కూడా పూర్తికావడంతో జట్ల సభ్యులంతా పోరుకు సిద్ధమయ్యారు. ఇక సమరానికి సమయం దగ్గరపడుతుండడంతో ఒక్క మ్యాచ్ కూడా మిస్ కావొద్దని ప్లాన్ చేసుకుంటున్నారు. అయితే ఇంట్లో ఉంటే టీవీలో చూస్తారు.. మరి బయట ఉంటే స్మార్ట్ ఫోన్‌లో లైవ్ మ్యాచ్ చూసే అవకాశం కూడా ఉంది. కానీ స్మార్ట్ ఫోన్‌లో మ్యాచ్ చూడాలంటే ప్రత్యేకంగా డిస్నీ+హాట్ స్టార్‌కు సబ్‌స్క్రిప్షన్ చేసుకోవాల్సి ఉంటుంది. కానీ అలాంటిదేం లేకుండా కేవలం మీరు చేసుకున్న మొబైల్ రీచార్జ్ ద్వారానే ఉచితంగా మ్యాచ్‌లను చూసే అవకాశం ఉందని మీకు తెలుసా? అలాంటి రీచార్జ్ ఆఫర్లపై ఓ లుక్కేయండి..
జియో ఆఫర్లు..
జియో తన యూజర్ల కోసం ఐపీఎల్ మ్యాచ్‌లను లైవ్‌లో చూసుకోవడానికి మూడు రకాల రీచార్జ్ ఆఫర్లను తీసుకొచ్చింది. ఇందుకోసం రూ.401, రూ. 598, రూ. 2,599లతో రీచార్జ్ చేసుకుంటే డిస్నీ+హాట్ స్టార్ వీఐపీ సబ్‌స్క్రిప్షన్ పొందొచ్చు. వీటితో పాటు రూ. 612, రూ.1004, రూ.1204, రూ.1208లతో కూడా ఈ ఆఫర్ అందిస్తోంది. ఒక్కో ప్లాన్‌లో డిస్నీ+హాట్ స్టార్ వీఐపీ సబ్‌స్క్రిప్షన్‌కు ఒక్కో వ్యాలిడిటీ ఉంది.
ఎయిర్ టెల్ ఆఫర్లు..
మరో ప్రముఖ టెలికాం సంస్థ ఎయిర్ టెల్ కూడా ఐపీఎల్ మొబైల్‌లో వీక్షించే యూజర్ల కోసం ప్రత్యేకంగా రీచార్జ్ ప్లాన్‌లు తీసుకొచ్చింది. ఇందులో భాగంగా రూ.401, రూ.448, రూ.499, రూ.599, రూ.2,698 ప్రత్యేక రీచార్జ్ ప్లాన్స్‌తో డిస్నీ+హాట్ స్టార్ వీఐపీ సబ్‌స్క్రిప్షన్‌ను ఉచితంగా పొందొచ్చు.