IPL 2021: సన్‌రైజర్స్ హైదరాబాద్: ఆ ముగ్గురు ఆటగాళ్లే జట్టుకు బలం.. ప్లేఆఫ్స్ టికెట్ ఖచ్చితమే.!

IPL 2021: ఐపీఎల్ చరిత్రలో సన్‌రైజర్స్ హైదరాబాద్‌ జట్టుకు ఉన్న ఫాలోయింగ్ సెపరేట్. అంతేకాకుండా ఈ జట్టు అసాధ్యాలను సైతం సుసాధ్యం చేస్తుంది..

IPL 2021: సన్‌రైజర్స్ హైదరాబాద్: ఆ ముగ్గురు ఆటగాళ్లే జట్టుకు బలం.. ప్లేఆఫ్స్ టికెట్ ఖచ్చితమే.!
Follow us
Ravi Kiran

|

Updated on: Apr 06, 2021 | 6:46 AM

IPL 2021: ఐపీఎల్ చరిత్రలో సన్‌రైజర్స్ హైదరాబాద్‌ జట్టుకు ఉన్న ఫాలోయింగ్ సెపరేట్. అంతేకాకుండా ఈ జట్టు అసాధ్యాలను సైతం సుసాధ్యం చేస్తుంది. ప్రత్యర్ధులను తక్కువ స్కోర్‌కు కట్టడి చేయడంలో ‌ఎస్‌ఆర్‌హెచ్ టీం దిట్ట. ఐపీఎల్ 2016లో తొలిసారిగా ఛాంపియన్స్ అయిన సన్‌రైజర్స్ హైదరాబాద్.. ఆ తర్వాత 2018‌లో ఫైనలిస్ట్‌గా నిలిచింది.

సన్‌రైజర్స్‌కు బౌలింగ్ ప్రధాన బలం…

సన్ రైజర్స్ హైదరాబాద్‌కు బౌలింగ్ అతి పెద్ద బలం. అంతర్జాతీయ మేటి బౌలర్లు ఈ జట్టు సొంతం. రషీద్ ఖాన్, మహ్మద్ నబీ, విజయ్ శంకర్, భువనేశ్వర్ కుమార్ వంటి బౌలర్లు ప్రత్యర్ధులను బెంబేలెత్తిస్తారు. అదే సమయంలో జట్టుకు బ్యాటింగ్ కూడా అద్భుతమైన సహకారాన్ని అందిస్తుంది. డేవిడ్ వార్నర్ ఈ జట్టును విజయపధంలో నడిపించడమే కాకుండా అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల లిస్టులో ముందు ఉంటాడు. ఆ తర్వాత జానీ బెయిర్ ‌స్టో, సాహా, మనీష్ పాండే, జాసన్ రాయ్, విజయ్ శంకర్ వంటి బ్యాట్స్‌మెన్ అద్భుత ప్రదర్శన ఇస్తున్నారు.

ఐపీఎల్ 2020లో ఈ ఇద్దరే టాప్…

తక్కువ ఎకానమీతో బౌలింగ్ చేసిన ఆటగాళ్లలో రషీద్ ఖాన్ మొదటి స్థానంలో ఉండగా, నబీ రెండవ స్థానంలో ఉన్నారు. అదే సమయంలో, సన్‌రైజర్స్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ గత సీజన్‌లో 548 పరుగులు చేసి మూడో అత్యధిక స్కోరర్‌గా నిలిచాడు. కాగా, ఐపీఎల్‌ చరిత్రలో 125 మ్యాచ్‌లు ఆడిన ఈ జట్టు 66 మ్యాచ్‌లలో విజయం సాధించింది. ఈసారి కూడా ట్రోఫీపై గురి పెట్టి ప్రణాళికలు సిద్దం చేస్తోంది.

సన్‌రైజర్స్ హైదరాబాద్(జట్టు):

డేవిడ్ వార్నర్ (కెప్టెన్), బెయిర్‌స్టో, విలియమ్సన్, మనీష్ పాండే, ప్రియం గార్గ్, విజయ్ శంకర్, జాసన్ హోల్డర్, అబ్దుల్ సమద్, మిచెల్ మార్ష్, రషీద్ ఖాన్, అబిషేక్ శర్మ, నబీ, సాహా, భువనేశ్వర్ కుమార్, నటరాజన్, సందీప్ శర్మ, సిద్ధార్థ్ కౌల్, నదీమ్, గోస్వామి, ఖలీల్ అహ్మద్, బసిల్ తంపి, విరాట్ సింగ్

కొత్తగా టీమ్‌లోకి వచ్చిన ఆటగాళ్లు: సుచిత్, కేదార్ జాదవ్, ముజీబ్ రెహమాన్

Also Read:

Viral: నిమిషాల్లో ప్రాణాలు తీసే మొక్క.. పాము కంటే అత్యంత ప్రమాదకరం.. తస్మాత్ జాగ్రత్త.!

Scary Video: ”నువ్వు తోపు.. అయితే నాకేంటి”.. మొసలిని లెక్క చేయని జీబ్రా.. ఏం జరిగిందంటే.!

అద్భుత రికార్డు.. 13 బంతుల్లో 10 వికెట్లు పడగొట్టిన చెన్నై సూపర్ కింగ్స్ బౌలర్.. అతడు ఎవరంటే.!

ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే