Errabelli Dayakar Rao: బీజేపీ నేతల వల్లే సునీల్ ఆత్మహత్య.. సంచలన కామెంట్స్ చేసిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు..

Errabelli Dayakar Rao: బీజేపీ నాయకులపై మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో బీజేపీకి..

Errabelli Dayakar Rao: బీజేపీ నేతల వల్లే సునీల్ ఆత్మహత్య.. సంచలన కామెంట్స్ చేసిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు..
కాశ్మీర్‌లో అసెంబ్లీ సీట్లు పెంచుతున్న మోడీ ప్రభుత్వం తెలంగాణ- ఆంద్రప్రదేశ్ లో ఎందుకు సీట్లు పెంచారో సమాధానం చెప్పాలని మంత్రి ఎర్రబెల్లి నిలదీశారు.
Follow us
Shiva Prajapati

|

Updated on: Apr 07, 2021 | 3:52 PM

Errabelli Dayakar Rao: బీజేపీ నాయకులపై మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో బీజేపీకి స్థానమే లేదన్నారు. మొన్నటి ఎమ్మెల్సీ ఎన్నికలతో బీజేపీ బలం తేలిపోయిందని, నాగార్జునసాగర్‌లో బీజేపీకి డిపాజిట్ కూడా రాదన్నారు. బుధవారం నాడు వరంగల్‌లో జరిగిన పార్టీ కార్యక్రమంలో ఎర్రబెల్లి దయాకర్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పార్టీ కార్యకర్తనుద్దేశించి ప్రసంగించిన ఆయన.. బీజేపీపై తీవ్రస్థాయిలో విరుచుకుప్డారు. రాష్ట్రంలోనే కాదు.. దేశంలో కూడా బీజేపీ బొక్క బోర్ల పడబోతోందన్నారు. తమిళనాడులో కూడా బీజేపీకి ఎదురుదెబ్బ తగలడం ఖాయం అన్నారు. మే 10వ తేదీలోపు వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు ఎప్పుడైనా రావొచ్చునని, పార్టీ శ్రేణులు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు.

ఇదిలాఉంటే.. వరంగల్‌లో సునీల్ నాయక్ ఆత్మహత్యకు బీజేపీ నేతలే కారణం అని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు వ్యాఖ్యానించారు. బీజేపీ నేతుల చేస్తున్న రెచ్చగొట్టే వ్యాఖ్యల వల్లే విద్యార్థి సునీల్ నాయక్ ఆత్మహత్య చేసుకున్నాడని అన్నారు. సునీల్ నాయక్ ఆత్మహత్యకు కారణమైన బీజేపీ నేతలు మళ్లీ సిగ్గు లేకుండా ధర్నాలు చేస్తున్నారంటూ నిప్పులు చెరిగారు. రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చి యువకులను బీజేపీ నేతలు రెచ్చగొడుట్టారని ఫైర్ అయ్యారు. విభజన హామీలను కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం నెరవేర్చడం లేదన్నారు. కాజీపేట కోచ్ ఫ్యాక్టరీని ఇవ్వకుండా మోసం చేసిన బీజేపీ.. ఇప్పుడు కాజీపేట రైల్వే స్టేషన్‌ను ప్రైవేటుపరం చేయాలని చూస్తోందని మండిపడ్డారు. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రయివేట్‌పరం చేస్తే రిజర్వేషన్లు ఉండవని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పేర్కొన్నారు. బీజేపీ నేతలను ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, బీసీ యువకులు తరిమికొట్టాలని పిలుపునిచ్చారు.

Also read: RBI: పేమెంట్స్ బ్యాంక్ ఖాతాదారులకు శుభవార్త.. డిపాజిట్ పరిమితిని ఆర్‌బీఐ ఎంత పెంచిందంటే..?

Poco X3 Pro: 19 వేల లోపు సరికొత్త ఫోన్…!! స్నాప్ డ్రాగన్ 860 ప్రాసెసర్ తో పోకో ఎక్స్3 ప్రో… ( వీడియో )

Sonu Sood: కరోనా వ్యాక్సిన్ తీసుకున్న రియల్ హీరో.. సంజీవని వ్యాక్సినేషన్ డ్రైవ్ ను ప్రారంభించిన సోనూసూద్..