- Telugu News పొలిటికల్ ఫొటోలు Minister puvvada ajay kumar bycycle visit at khammam city enquired about the pending works
కారు వదిలి సైకిల్ ఎక్కిన మంత్రి.. పలు అభివృద్ధి పనుల పరిశీలన.. పెండింగ్ వర్క్స్‌పై ఆరా.. వైరల్‌గా మారిన చిత్రాలు
Updated on: Apr 07, 2021 | 2:12 PM

ఖమ్మం నగరంలోని పలు ప్రాంతాల్లో మంత్రి పువ్వాడ పర్యటించారు. రోడ్డు కు ఇరు వైపులా జరుగుతున్న సైడు కాల్వ పనులు, రోడ్డు విస్తరణ పనులు, విద్యుత్ స్తంభాలు, మిషన్ భగీరథ అంతర్గత పైప్ లైన్ పనులు, పారిశుధ్యం పనులను పరిశీలించారు.

జిల్లా కలెక్టర్ ఆర్ వీ కర్ణన్, మున్సిపల్ కమిషనర్ అనురాగ్ జయంతితో కలిసి మంత్రి పువ్వాడ ఆజయ్ కుమార్ సైకిల్ పై పర్యటించారు.

పెండింగ్ పనులపై అడిగి తెలుసుకుంటున్న మంత్రి పెండింగ్ పనులపై అడిగి తెలుసుకుంటున్న మంత్రి

సైకిల్ పై ఖమ్మంలో పర్యటిస్తున్న మంత్రి పువ్వాడ అజయ్ కుమార్.

ప్రజా రవాణాకు, ట్రాఫిక్ కు ఇబ్బందులు తలెత్తకుండా పనుకు నాణ్యతతో త్వరగా పూర్తి చేయాలన్నారు. వారి వెంట మున్సిపల్, విద్యుత్, పబ్లిక్ హెల్త్, రెవెన్యూ తదితర శాఖ అధికారులు ఉన్నారు..

పనుల అలస్యం పట్ల మంత్రి అధికారులపై నిలదీశారు. నెలల తరబడి పనులు కొనసాగింపు కుదరదని పనుల్లో వేగం పెంచాలని ఆదేశించారు.

ఖమ్మం నగరంలో జరుగుతున్న పలు అభివృద్ధి పనులను స్వయంగా పరిశీలించేందుకు రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అధికారులతో కలిసి సైకిల్ పై పర్యటించారు. పెండింగ్ పనులను త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
