Baby Corn Peas Rice: రొటీన్ ఫుడ్ భిన్నంగా ట్రై చేయండి టేస్టీ టేస్టీ.. బేబీ కార్న్, శనగల రైస్..

Baby Corn Peas Rice: రోజు ఒకే రకమైన ఆహారపదార్ధాలను తినాలంటే పిల్లలకే కాదు పెద్దలకు కూడా బోర్ కొడుతుంది. రోజూ ఇవే తినాలా డిఫరెంట్ గా వండి పెట్టమని ఒకొక్కసారి పిల్లలు పేచీ పెడతారు. అటువంటి వారి కోసమే ఈరోజు బేబీకార్న్ , శనగలతో...

Baby Corn Peas Rice: రొటీన్ ఫుడ్ భిన్నంగా ట్రై చేయండి టేస్టీ టేస్టీ.. బేబీ కార్న్, శనగల రైస్..
Baby Corn Peas Rice
Follow us
Surya Kala

|

Updated on: Apr 07, 2021 | 11:40 AM

Baby Corn Peas Rice: రోజు ఒకే రకమైన ఆహారపదార్ధాలను తినాలంటే పిల్లలకే కాదు పెద్దలకు కూడా బోర్ కొడుతుంది. రోజూ ఇవే తినాలా డిఫరెంట్ గా వండి పెట్టమని ఒకొక్కసారి పిల్లలు పేచీ పెడతారు. అటువంటి వారి కోసమే ఈరోజు బేబీకార్న్ , శనగలతో రైస్. ఈ రైస్ ఎంతో రుచిగా ఉంటుంది. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. బేబికార్న్‌ శనగల రైస్ తయారీకి కావాల్సిన పదార్ధాలు.. తయారీ విధానం తెలుసుకుందాం..!

కావలసిన పదార్థాలు

ఉడికించిన అన్నం – రెండు కప్పులు, ఉడికించిన శెనగలు – పావు కప్పు, బేబీకార్న్‌ – ఆరు (నిలువుగా చీల్చి నాలుగు ముక్కలుగా కోయాలి), ఉప్పు – రుచికి సరిపడా, నూనె – రెండు టేబుల్‌ స్పూన్లు.

మసాలా కోసం:

శెనగపప్పు – ఒక టేబుల్‌ స్పూన్‌, ఎండుమిర్చి – ఐదు, ధనియాలు – అర టేబుల్‌ స్పూన్‌, మిరియాలు – అర టీస్పూన్‌, జీలకర్ర – అర టీస్పూన్‌, నువ్వులు – ఒక టీస్పూన్‌.

తయారీ విధానం:

శనగల్ని ఒక రాత్రంతా లేదా వేడి నీళ్లలో ఒక గంట నానపెట్టాలి. కుక్కర్‌లో నాలుగైదు విజిల్స్‌ వచ్చే వరకు ఉడికించాలి. బేబీకార్న్‌ను శుభ్రంగా కడిగి నిలువుగా చిన్న ముక్కలుగా కోసుకుని నీళ్లలో ఉప్పు వేసి మెత్తగా ఉడికించాలి. అన్నం పలుకుగా ఉడికించి వెడల్పాటి పళ్లానికి నూనె పూసి అందులో పరవాలి.

అనంతరం పాన్‌ను వేడిచేసి మసాలా దినుసుల్ని వేయించి చల్లారాక పొడి కొట్టాలి. నాన్‌ స్టిక్‌ కళాయిలో నూనె వేడిచేసి ఉడికించిన శనగలు, బేబీకార్న్‌ వేసి కమ్మగా స్మెల్ వచ్చే వరకూ వేయించాలి. తర్వాత మసాలా పొడి వేసి కొంచెం సేపు వేయించాలి. ఉడికించిన అన్నాన్ని వేసి గరిటెతో కలిపి అవసరమనుకుంటే ఉప్పు వేయాలి. అన్నం మీద కొన్ని నీళ్లు చల్లి మరో ఐదు నిమిషాల పాటు సన్నటి సెగ మీద ఉంచాలి. కొత్తిమీర తరుగు వేసి, ఆ పైన క్యారెట్‌ తురుము కూడా చల్లుకుంటే బాగుంటుంది.

ఈ రైస్ ను రైతాతో తింటే ఆహా ఏమి రుచి అనాల్సిందే ఎవరైనా ..!

Also Read:   తక్కువ పెట్టుబడి.. ఎక్కువ లాభాలు తెచ్చే బొద్దింకల వ్యాపారం.. లక్షల్లో సంపాదన

రోజూ త్వరగా అలసిపోతున్నారా..అయితే అవయవాలు విశ్రాంతిని కోరుతున్నాయి.. ఈ ఆసనం ట్రై చేయండి

.