సోషల్ మీడియాలో అల్లు అర్జున్ హావా.. బన్నీ కోసం ఒకేసారి రంగంలోకి దిగిన 46 మంది సెలబ్రెటీలు…

Allu Arjun: స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్‏కు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కేవలం తెలుగులోనే కాకుండా.. దక్షిణాది సినీ ఇండస్ట్రీలో బన్నీకు ఉన్న క్రేజ్ మాములుగా

  • Rajitha Chanti
  • Publish Date - 8:27 pm, Tue, 6 April 21
సోషల్ మీడియాలో అల్లు అర్జున్ హావా.. బన్నీ కోసం ఒకేసారి రంగంలోకి దిగిన 46 మంది సెలబ్రెటీలు...
Allu Arjun

Allu Arjun: స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్‏కు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కేవలం తెలుగులోనే కాకుండా.. దక్షిణాది సినీ ఇండస్ట్రీలో బన్నీకు ఉన్న క్రేజ్ మాములుగా ఉండదు. సోషల్ మీడియాలో ప్రస్తుతం అల్లు అర్జున్ హవా కొనసాగుతుంది. ఏప్రిల్ 8న బన్నీ పుట్టిన రోజు సందర్బంగా.. ఆయన అభిమానులు ఇప్పటినుంచే సోషల్ మీడియా వేదికగా సంబరాలు మొదలు పెట్టారు. తమ అభిమాన హీరో పుట్టిన రోజు వేడుకలు మరింత ఘనంగా జరిపేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటివరకు సినీ పరిశ్రమలో జరగని విధంగా బన్నీ పుట్టినరోజు వేడుకలను జరిపేందుకు సన్నాహాలు మొదలు పెట్టారు. ఇందులో భాగంగా.. అల్లు అర్జున్ బర్త్ డే సీడీపీని ఏకంగా 46 మంది సెలబ్రెటిలతో ఏకకాలంలో విడుదల చేయించారు. ఇందులో టాప్ హీరోలు, హీరోయిన్లు, దర్శకులు, కమెడియన్లు ఇతర నటులు కూడా ఉన్నారు. అటు ట్వీట్టర్ వేదికగా పలువురు సెలబ్రెటీలు సైతం అల్లు అర్జున్‏కు ముందుగానే పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతూ విష్ చేస్తున్నారు.

Allu Arjun Cdp

Allu Arjun Cdp

ఇదిలా ఉంటే ప్రస్తుతం బన్నీ.. సుకుమార్ దర్శకత్వంలో పుష్ప సినిమా చేస్తున్నాడు. ఇందులో అల్లు అర్జున్ సరసన రష్మిక మందన్నా నటిస్తోంది. ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో బన్నీ లారీ డ్రైవర్ పుష్ప రాజ్ పాత్రలో నటిస్తున్నాడు. ఇప్పటికే ఈ మూవీకి సంబంధించిన ఫస్ట్ లుక్, గ్లింప్స్ వీడియోలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఇక ఈ సినిమా కోసం అభిమానులు ఎప్పటినుంచో ఎదురుచూస్తున్నారు. ఇక బన్నీ పుట్టిన రోజు సందర్భంగా పుష్పరాజ్ పాత్రను ఏప్రిల్ 7న సాయంత్రం ఆరు గంటల 12 నిమిషాలకు విడుదల చేయబోతున్నట్లుగా ఇదివరకే చిత్రయూనిట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా ఏప్రిల్ 6న పుష్ప మూవీకి సంబంధించిన డబ్బింగ్ పనులను కూడా ప్రారంభించింది చిత్రయూనిట్. ఈ సినిమాలో ఫహద్ ఫాసిల్ ప్రతినాయకుడిగా నటిస్తున్న ఈ సినిమాలో జగపతి బాబు, ప్రకాశ్ రాజ్, ధనంజయ్, సునీల్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ఈ సినిమాకు దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమా ఈ ఏడాది ఆగస్టు 13వ తేదీన తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విడుదల కానుంది.

ట్వీట్..

Also Read: Premi Vishwanath: సోషల్ మీడియాలో వంటలక్కకు చేదు అనుభవం.. నయనతారతో పోల్చుతూ ట్రోల్ చేస్తున్న నెటిజన్స్..

విజయ్ కోసం మాస్టర్ ప్లాన్ వేసిన పూరీ జగన్నాథ్.. ‘లైగర్’ కోసం హాలీవుడ్ స్టంట్ కొరియోగ్రాఫర్..