మగవాళ్ళకు ధీటుగా బిజినెస్ రంగంలోకి ఓ మహిళ.. ఆద్యంతం ఆసక్తికరంగా తమన్నా ’11th అవర్’ ట్రైలర్..
11th Hour: మిల్కీబ్యూటీ తమన్నా.. డైరెక్టర్ ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో తెరకెక్కుతున్న వెబ్ సిరీస్ '11th అవర్'. ఈ సిరీస్‌తో తమన్నా ఓటీటీలోకి ఎంట్రీ ఇస్తుంది. థ్రిల్లర్ జోనర్లో రూపొందుతున్న ఈ వెబ్ సిరీస్

11th Hour: మిల్కీబ్యూటీ తమన్నా.. డైరెక్టర్ ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో తెరకెక్కుతున్న వెబ్ సిరీస్ ’11th అవర్’. ఈ సిరీస్‌తో తమన్నా ఓటీటీలోకి ఎంట్రీ ఇస్తుంది. థ్రిల్లర్ జోనర్లో రూపొందుతున్న ఈ వెబ్ సిరీస్ ఏప్రిల్ 9న ప్రముఖ ఓటీటీ వేదిక ఆహాలో స్ట్రీమింగ్ కానుంది. ఈ నేపథ్యంలో ఈ సిరీస్ ట్రైలర్‌ను ఏప్రిల్ 6న సాయంత్రం 6 గంటలకు విడుదల చేసింది చిత్రయూనిట్.. ఈ ట్రైలర్ లాంచ్ వేడుకను టీవీ9లో ప్రత్యేక్ష ప్రసారంలో వీక్షించవచ్చు.
ఇటీవల విడుదలైన ఈ మూవీ టీజర్‌కు మంచి రెస్పాన్స్ లభించింది. మగవాళ్ళ వ్యాపారం సామ్రాజ్యంలోకి ఓ మహిళ ప్రవేశించి.. వారిని ధీటుగా ఎలా ఎదుర్కోందనేది ఈ సినిమా నేపథ్యం. ఇందులో తమన్నా అరాత్రికారెడ్డి అనే పాత్రలో నటిస్తోంది. ఈ మూవీలో అరుణ్ ఆదిత్ , వంశీ కృష్ణ ,రోషిణి ప్రకాష్ ,జయప్రకాష్ ,శత్రు ,మధుసూదన్ రావు ,పవిత్ర లోకేష్ ,అనిరుధ్ బాలాజీ ,శ్రీకాంత్ అయ్యంగార్ ,వినయ్ ,ప్రియా బెనర్జీ తదితరులు కీలకపాత్రలో నటించారు. తాజాగా విడుదలైన ఈ సినిమా ట్రైలర్ ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. కరోనా ప్రభావంతో లాక్ డౌన్ సమయంలో థియేటర్లు మూతపడడంతో ఓటీటీలకు ఆదరణ మరింత పెరిగిపోయింది. అటు పలువురు హీరోహీరోయిన్లు… డిజిటల్ మీడియాలోకి ఎంట్రీ ఇచ్చేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. ఇప్పటికే సమంత, నయనతార వంటి హీరోయిన్లు ఓటీటీ వేదికపై తమ అదృష్టాన్ని పరీక్షించుకోగా.. తాజాగా మిల్కీ బ్యూటీ కూడా ఆ జాబితాలో చేరింది.
ట్రైలర్..
టీవీ9 లైవ్..
Also Read: Rana Daggupati: సుకుమార్ శిష్యుడి దర్శకత్వంలో రానా.. 1940 పిరియాడిక్ బ్యాక్ డ్రాప్‌తో మూవీ..




