Karthika Deepam : కార్తీక్ మోసం చేశాడంటూ మోనిత కన్నీరు.. దీపని ఎప్పటికీ నమ్మనంటున్న డాక్టర్ బాబు

Karthika Deepam : తెలుగు లోగిళ్ళలో బుల్లి తెర ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న సీరియల్ కార్తీకదీపం. రోజు రోజుకి మరింత ఆసక్తిగా సాగుతున్న కార్తీక దీపం సీరియల్ ఈరోజు 1006 ఎపిసోడ్ లో...

Karthika Deepam : కార్తీక్ మోసం చేశాడంటూ మోనిత కన్నీరు.. దీపని ఎప్పటికీ నమ్మనంటున్న డాక్టర్ బాబు
Karthika Deepam
Follow us
Surya Kala

|

Updated on: Apr 06, 2021 | 2:18 PM

Karthika Deepam : తెలుగు లోగిళ్ళలో బుల్లి తెర ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న సీరియల్ కార్తీకదీపం. రోజు రోజుకి మరింత ఆసక్తిగా సాగుతున్న కార్తీక దీపం సీరియల్ ఈరోజు 1006 ఎపిసోడ్ లో అడుగు పెట్టింది. దీపని పిల్లలని కార్తీక్ ఇంటికి తీసుకుని వస్తాడు.. . ఈ నేపథ్యంలో ఈ రోజు (ఏప్రిల్ 6 ) సీరియల్ లోని హైలెట్స్ చూద్దాం..!

దీపని ప్రేమగా దగ్గరకు తీసుకుంటుంది సౌందర్య. సంతోష పడుతున్న సౌందర్య తో నేను భార్యని తీసుకుని రాలేదు మమ్మీ.. నీ కోడలి తీసుకొచ్చాను అంటూ.. సౌందర్య చేతిలో దీప చేతిని పెడతాడు.. అందరూ షాక్ తింటారు. నువ్వే కదా మమ్మి.. నాకుభార్యఅక్కర్లేక పోవచ్చు.. నాకు నా కోడలు కావాలి అన్నావు.. ఇదిగో నీ కోడలు.. నీకు అప్పగిస్తున్నా.. నాకు భార్య అక్కర్లేదు.. పిల్లలు చాలు.. అని అంటాడు కార్తీక్. ఏమిట్రా నువ్వు అనేది అని ఆనందరావు అంటుంటే.. అమ్మ చెప్పిన ఒప్పదం అంటాడు .. అప్పుడైనా ఇప్పుడైనా నువ్వు అన్న మాటే అమ్మ.. తప్పదు అని అంటాడు కార్తీక్.. నువ్వు ఇలా అంటే దీప మానసిక పరిస్థితి ఎలా ఉంటుందో చూశావా .. అంటుంది సౌందర్య.. దీంతో చూడు మమ్మీ.. పిల్లల దృష్టిలో.. మీ అందరి దృష్టిలో కూడా నేను తండ్రిని.. కానీ నా దృష్టిలో మార్పులేదు.. పిల్లలంటే ప్రేమ తగ్గలేదు.

అలాంటి నా నుంచి పిల్లల్ని వేరు చేసి తీసుకెళ్లిన నీ కోడలు క్రూరమైందా.. తల్లికిచ్చిన మాట కోసం పిల్లల కోసం . పిల్లల తల్లిని తీసుకొచ్చిన నేను క్రూరమైనవాడినా అని ప్రశ్నిస్తాడు కార్తీక్. పిల్లలని, తల్లిని దూరం చేసేటంత దుర్మార్గుడిని కాదు నేను..

పాత పడతావేమిటి రా దుర్మార్గుడా అని అంటుంది.. సౌందర్య. నీవు అడిగింది చేశాను.. నన్ను నిందించకు.. దీప ఎందుకు వెళ్ళిపోయింది అని అడుగు అని ప్రశ్నిస్తాడు. నీ అపనమ్మకంతోనే కదా వెళ్ళిపోయింది.

హిమ ని ఎలా పెంచుకున్నాను మమ్మి.. శౌర్య ని కూడా అలాగే చూసుకున్నా కదా.. దీని పనికి రాని సెల్ఫ్ రెస్పెక్ట్ తో ఎక్కడికో తీసుకుని వెళ్లి.. టిఫిన్ బండి పెట్టి.. దాని కళ్ళు తుడవడానికి దానికి నా పేరు పెట్టి.. హిమ చేత టిఫిన్లు సప్లై చేయిస్తుంది. నాకు ఎలా ఉంటుంది. దీని పనికిమాలిన పట్టుదలతో ఆరోగ్యం పాడు చేసుకుని దానికి ఏమైనా అయితే.. పిల్లల భవిష్యత్ ఏమవుతుంది అని ఆగ్రహం వ్యక్తం చేస్తాడు కార్తీక్. పిలల్లు దిక్కులేని పక్షులయ్యేవారు. దీనిని నువ్వు క్షమించినా నేను క్షమించను అంటాడు

షాక్ లో ఉన్న దీపను చూసి సౌందర్య. ఆవేదనతో నువ్వు ఏమి అనడం లేదు.. ఏమిటి.. గొర్రె కసాయివాడిని నమ్మినట్లు.. వాడిని నమ్మి వచ్చావు కదా పిచ్చి మొహం దానా అంటుంది. ఇప్పుడు ఏమీ అడగవేమిటి..? కడిగి పారెయ్యవు ఏమిటి..?

మీ అబ్బాయి అందనంత ఎత్తులో ఉన్నారు అత్తయ్య.. ఆయన ముందు తలెత్తి ఎలా మాట్లాడాను..తల్లికి మాట ఇచ్చారు.. కోడలిని తీసుకొచ్చారు ఆదర్శ సుపుత్రుడు.. పిల్లల కోసం వచ్చారు. వాళ్ళకోసం తల్లిని తీసుకొచ్చారు. మేక పిల్ల పాలకోసం మేకని కూడా తెచ్చినట్లు.. ఆదర్శ తండ్రి.. ఎక్కడా తప్పు పట్టడానికి వీలు లేకుండా గోడకూడా కట్టేసి.. తండ్రిగా గెలిచాను అంటుంటే.. ఇవతల నిలబడి.. భర్తగా ఓడిపోయారు అనడానికి కూడా లేకుండా చేశారు. అడగమంటే ఏమని అడగను అత్తయ్య..

ఆయన దృష్టిలో ఆత్మ గౌరవం అంటే పనికిమానిలిన పని .. ఆడదానిగా నా ఉనికి, నా వ్యక్తిత్వం.. నా స్థానం నన్ను అట్టడుక్కి తొక్కేసి… అందలమెక్కిన దేశోద్ధారకుడిని నిలదీయడానికి నేను ఎంత ..? పిల్లల కోసం ఎంతో ఔన్నత్యం పెంచుకుని నన్ను తీసుకొచ్చారు. నన్ను ఒక్క లగేజ్ లాగా లాక్కొచ్చారు. ఇప్పుడు నేను ఈ ఇంట్లో నా కన్న బిడ్డలకు అమ్మగా రాలేదు.. ఆయాగా వచ్చాను. గాయపడిన అమ్మకి మారుపేరు ఆయమ్మ.. అంటుంది దీప..

విన్నావా ఒక స్త్రీ తన హక్కులన్నీ పక్కన పెట్టి.. ఏళ్ల తరబడి పడిన కష్టాలు మరచిపోయి.. నువ్వు రమ్మంటే వెంట వచ్చిన స్త్రీ పట్ల ఇలా మాట్లాడడం న్యాయం గా ఉందా అని కార్తీక్ ని ప్రశ్నిస్తాడు ఆనందరావు. దీంతో నేను తప్పు చేయలేదు డాడీ.. అది తప్పు చేసింది . ఆమె చేసిన తప్పుకి ప్రతిఫలంగా పుట్టిన బిడ్డలకు నేను తండ్రిగా నిలబడ్డాను.. రేపు సమాజంలో ఆ బిడ్డలకు డాక్టర్ కార్తీక్ తండ్రిగా ఉంటాడు.. ఇంతకన్నా నేను నా భార్యకు ఏ విధంగానూ న్యాయం చేయలేను.. దాని బిడ్డలకు హోదా భద్రత కల్పిస్తున్నాను.. ఆస్థి హక్కు కల్పిస్తున్నాను.. ఇంతకంటే దీపకి ఏ విధంగా సాయపడలేను.. అంతగొప్ప ఔందర్యం నాకు లేదు.. అందలం ఎక్కించవద్దు. పాతాళానికి తోసేయవద్దు.. నా వైపు నుంచి అలోచించి నన్ను ఎప్పటికీ సుపుత్రుడుగానే ప్రేమించండి అంటాడు కార్తీక్..

దీంతో ఆదిత్య కలుగజేసుకుని.. అన్నయ్య ఒక్క మాట.. వదిన అడిగిన దానిలో న్యాయం ఉంది.. నువ్వు చెప్పినదానిలో కూడా నిజం ఉంది.. మరి ఇంత త్యాగం ఎందుకు చేయాలి.. వాళ్ళ బతకు వాళ్ళని బతకనివ్వచ్చుకదా.. వెళ్లి తీసుకొచ్చి మరీ ఏ సంబంధం లేదు అని ఎందుకు అనాలి.. ఎందుకు ఇంత బాధపెట్టాలి. వదిన ఎక్కడ ఉందొ చెప్పిన ఆ మహానుభావులు ఎవరు అని ప్రశ్నిస్తాడు..

అప్పుడు కార్తీక్ డాక్టర్ మోనిత అని చెబుతాడు.. అందరూ షాక్ తింటారు. వెంటనే సౌందర్య.. తనే తీసుకుని రాకుండా కార్తీక్ కి ఎందుకు చెప్పింది. ఇందులో మోనిత ప్లాన్ ఏమిటి అని ఆలోచిస్తుంది. మరోవైపు మోనిత కూడా ఇంటికి చేరుకుంటుంది. పనిమనిషి ప్రియమణిని పిలుస్తుంది. వచ్చారమ్మా హిమని ఎత్తుకొస్తానని వెళ్ళారుగా.. ఏమైంది. ఆ దీపమ్మ మిమ్మల్ని దుమ్ము దులిపి పంపించేసిందా..అని ఎద్దేవా చేస్తుంది ప్రియమణి. దీంతో మోనిత ఏడుస్తూ.. ప్రియమణిని హత్తుకుని ఏడుస్తుంది. నేను కార్తీక్ నా చేయి దాటిపోయాడు అంటూ కన్నీరు పెట్టుకుంటుంది. మీది కూడా ఆడజన్మే కదా.. పుట్టి పెరిగాక మోనిత అయ్యారు కానీ.. పాపం.. హిమని ఎత్తుకొస్తారని వెళ్లారు .. ఏమయ్యింది. అయినా మీకు పెళ్లా పెటాకులా.. పిల్లా జెల్లా .. ఏముంది ఏడుపుతప్ప అని అంటుంది ప్రియమణి.. మీ కోసం అమ్మవారి గుడిలో పూజ చేయించిన పసుపుదారం తీసుకొచ్చా అని చెబుతుంది. పసుపుతాడుకే నోచుకోని మీరు .. కట్టుకుంటే ఏమిటి కట్టుకోకపోతే ఏమిటి అంటుంది.. మోనిత కార్తీక్ ని తలుచుకుని ఏడుస్తుంది.. పనిమనిషి మోనిత కి జాతకం చూపించుకోమని సలహా ఇస్తుంది. నా కు అడ్డుపడే గ్రహం పేరు దీప . దానిని ఎలా అడ్డు తగిలించుకోవాలో.. నాకు బాగా తెలుసు అంటుంది.

కార్తీక్ ఒంటరిగా నిల్చుని దీప మాటలను గుర్తు చేసుకుంటాడు. ఆనందరావు వచ్చి కార్తీక్ ని కౌగిలించుకుంటాడు. నువ్వు నిజంగా సుపుత్రుడి.. అదేమిటి అమ్మ నన్ను కర్కోటడు చేసింది. ఆదిత్య కంటే నువ్వు అంటేనే ప్రేమ ఎక్కువ.. ఎందుకు తెలియదు డాడీ.. అమ్మ అడిగింది అనే కదా.. దీపని తీసుకుని వచ్చాను.. కాదు.. అంటాడు ఆనందరావు.. పిల్లలనుంచి దీపని దూరం చేయలేక తీసుకొచ్చాను.. అంటే అది కూడా ఒక కారణం దీపని ఇక్కడకి తీసుకుని రావడానికి కారణం ప్రేమ.. దీప మీద నీకున్న ప్రేమ అంటాడు ఆనందరావు.. నాకు దీప మీద ప్రేమ ఏమిటి డాడీ.. అంటుంటే.. నువ్వు దీపని పెళ్లి చేసుకుంది నీ ఆదర్శం కోసమో.. దీపలోని ఆత్మ సౌందర్యం కోసమో కాదు.. నువ్వు దీప స్వచ్ఛమైన మనస్సు చూసి ప్రేమించి పెళ్లి చేసుకున్నావు.. అప్పుడే కాదు.. ఇప్పుడు కూడా అదే నడిపిస్తుంది.

మీరు ఏదేదో ఊహించుకోకండి డాడీ.. ఇంట్లో పరిస్థితులు చక్కబడాలంటే దీప ఇంట్లోకి రావాలి అదే చేశాను. దానికి ప్రేమ అనే అందమైన రంగు పులమొద్దు డాడీ.. అంటాడు. దీంతో ఆనందరావు.. దీప పట్ల అనుమానం అనే కారణం పక్కకు పెడితే…. ఆమె వ్యక్తిత్వం పట్ల నీకు ఉన్నతమైన అభిప్రాయం ఉంది కాదంటావా అని ప్రశ్నిస్తాడు ఆనందరావు. నిజమే దీపని అందరూ ప్రేమించేది.. అంటాడు. అవును నాకోడలకి ఒక ఉన్నత స్థానం కల్పిస్తాను.. ఫ్యాక్టరీ పెద్ద ఉద్యోగం ఇప్పిస్తాను.. కారులో దర్జాగా వెళ్లేలా చేస్తాను అంటదు ఆనందరావు. నా కోడలు ఇడ్లి బండి నడిపినా ఫ్యాక్టరీ అయినా సక్సెస్ ఫుల్ గా నడిపించే సత్తా నాకోడలుతుంది. తనకు ఉన్నత స్థానం కల్పిస్తాను.. నువ్వేమీ అభ్యంతరం పెట్టవు కదా..!

Also Read: సారంగదారియా సాంగ్ ఎవరిదీ కాదు.. అసలు ఆ లిరిక్స్ కు సంబంధమే లేదు 70 ఏళ్ల క్రితం నుంచి ఉంది.. ఇదిగో సాక్ష్యం

నోటి నుంచి దుర్వాసన వస్తుందా..! నిర్లక్ష్యం వద్దు.. ఇతర సమస్యలకు హెచ్చరిక కావొచ్చు

ఇవి తింటే.. నెలరోజుల్లో మీ జుట్టు ఒత్తుగా పెరగడం పక్కా.. అందం
ఇవి తింటే.. నెలరోజుల్లో మీ జుట్టు ఒత్తుగా పెరగడం పక్కా.. అందం
కేసీఆర్ సినిమా చూస్తూ కన్నీళ్లు పెట్టుకున్న రాకేష్, సుజాత..
కేసీఆర్ సినిమా చూస్తూ కన్నీళ్లు పెట్టుకున్న రాకేష్, సుజాత..
కారు కొనుగోలుదారులకు బ్యాడ్‌ న్యూస్‌.. జనవరి 1 నుంచి ధరలు పెంపు
కారు కొనుగోలుదారులకు బ్యాడ్‌ న్యూస్‌.. జనవరి 1 నుంచి ధరలు పెంపు
పెర్త్‌లో సెంచరీతో చెలరేగిన జైస్వాల్.. భారీ ఆధిక్యం దిశగా భారత్
పెర్త్‌లో సెంచరీతో చెలరేగిన జైస్వాల్.. భారీ ఆధిక్యం దిశగా భారత్
ఏఆర్ రెహమాన్ సీరియస్ వార్నింగ్..
ఏఆర్ రెహమాన్ సీరియస్ వార్నింగ్..
BSNL, Jioలో 70 వ్యాలిడిటీ ప్లాన్‌ గురించి తెలుసా? ఏది చౌకైనది..!
BSNL, Jioలో 70 వ్యాలిడిటీ ప్లాన్‌ గురించి తెలుసా? ఏది చౌకైనది..!
అరటిపండు, యాపిల్ కలిపి తింటే ఏమవుతుందో తెలుసా..?తప్పక తెలుసుకోండి
అరటిపండు, యాపిల్ కలిపి తింటే ఏమవుతుందో తెలుసా..?తప్పక తెలుసుకోండి
కల్తీ నెయ్యి కథ తేలే సమయం వచ్చేసింది.. తిరుమల లడ్డు విచారణలో
కల్తీ నెయ్యి కథ తేలే సమయం వచ్చేసింది.. తిరుమల లడ్డు విచారణలో
నెయ్యిలో వేయించిన వెల్లుల్లి తినడం వల్ల బోలెడన్నిఆరోగ్యప్రయోజనాలు
నెయ్యిలో వేయించిన వెల్లుల్లి తినడం వల్ల బోలెడన్నిఆరోగ్యప్రయోజనాలు
ఈవారం హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యేది ఆమెనా..
ఈవారం హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యేది ఆమెనా..
రోడ్డుపై చల్లా చదురుగా పడిపోయిన ఇంటింటి సర్వే దరఖాస్తులు.. వీడియో
రోడ్డుపై చల్లా చదురుగా పడిపోయిన ఇంటింటి సర్వే దరఖాస్తులు.. వీడియో
ఎమ్మార్వో కార్యాలయం ముందు "చాకిరేవు".! బట్టలు ఉతికి, ఆరేసి నిరసన.
ఎమ్మార్వో కార్యాలయం ముందు
ఏపీకి వర్ష సూచన! మోస్తరు వర్షాలు 26నాటికి వాయుగుండంగా మారే అవకాశం
ఏపీకి వర్ష సూచన! మోస్తరు వర్షాలు 26నాటికి వాయుగుండంగా మారే అవకాశం
డ్రైవింగ్ రాని డ్రైవర్‌కి స్కూల్ బస్ అప్పగిస్తే.. యాక్సిడెంట్
డ్రైవింగ్ రాని డ్రైవర్‌కి స్కూల్ బస్ అప్పగిస్తే.. యాక్సిడెంట్
భారత్ Vs పాకిస్తాన్.! పాక్‌ ఓడలో భారత మత్స్యకారులు.. రెండు గంటల
భారత్ Vs పాకిస్తాన్.! పాక్‌ ఓడలో భారత మత్స్యకారులు.. రెండు గంటల
సంపూర్ణ ఆరోగ్యానికి రోజూ చిటికెడు.! ఆరోగ్య సమస్యలన్నీ పరార్..
సంపూర్ణ ఆరోగ్యానికి రోజూ చిటికెడు.! ఆరోగ్య సమస్యలన్నీ పరార్..
ఏపీ ప్రజలకు గుడ్‌ న్యూస్‌.! కొత్తవారికి పెన్షన్లు జారీ.. స్వీకరణ?
ఏపీ ప్రజలకు గుడ్‌ న్యూస్‌.! కొత్తవారికి పెన్షన్లు జారీ.. స్వీకరణ?
హృదయవిదారక ఘటన.. తల్లి చెంతకు చేరేలోపే చిన్నారి.! వీడియో..
హృదయవిదారక ఘటన.. తల్లి చెంతకు చేరేలోపే చిన్నారి.! వీడియో..
జియోనుంచి అదిరిపోయే కొత్త రీచార్జ్‌ ప్లాన్‌.! 4జీ కే 5జీ సేవలు..
జియోనుంచి అదిరిపోయే కొత్త రీచార్జ్‌ ప్లాన్‌.! 4జీ కే 5జీ సేవలు..
గంటన్నరపాటు ఆగిపోయిన సైనికుడి గుండె.. అద్భుతం చేసిన వైద్యులు.!
గంటన్నరపాటు ఆగిపోయిన సైనికుడి గుండె.. అద్భుతం చేసిన వైద్యులు.!