AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Actor Prakash: తల్లిదండ్రులది ప్రేమవివాహం.. బాల్యం నుంచి కష్ఠాలు ఎదుర్కొన్న విలక్షణ నటుడు..ఆయన జర్నీ కూడా స్ఫూర్తివంతం

జాతీయ ఉత్తమ నటుడు.. విలక్షణ నటుడు.. వివాదాస్పద నటుడు ఇలా అన్ని పేర్లు ఆయనకే సొంతం.. తన నటనతో కోట్లాది మంది ప్రేక్షకుల మనసుని దోచుకున్న ఆ నటుడు. తండ్రి, ప్రేమికుడు

Actor Prakash: తల్లిదండ్రులది ప్రేమవివాహం.. బాల్యం నుంచి కష్ఠాలు ఎదుర్కొన్న విలక్షణ నటుడు..ఆయన జర్నీ కూడా స్ఫూర్తివంతం
Prakash Raj
Surya Kala
|

Updated on: Apr 06, 2021 | 2:20 PM

Share

Actor Prakash : జాతీయ ఉత్తమ నటుడు.. విలక్షణ నటుడు.. వివాదాస్పద నటుడు ఇలా అన్ని పేర్లు ఆయనకే సొంతం.. తన నటనతో కోట్లాది మంది ప్రేక్షకుల మనసుని దోచుకున్న ఆ నటుడు. తండ్రి, ప్రేమికుడు, విలన్, స్నేహితుడు, తాత ఇలా ఏ పాత్రలో నటించినా ఆ పాత్రలో ఒదిగిపోతాడు.. తన నటనతో ఆ పాత్రకు జీవం పోస్తాడు. అతనే ప్రకాష్ రాజ్. ఈ భాషలో ఆయన నటనని చూస్తే .. ఆ భాషావాడే అనిపించేంతగా క్యారెక్టర్ లో లీనమైపోతాడు. కె బాలచందర్ స్కూల్ లో గుప్పెడంత మనసు సీరియల్ తో తెలుగు బుల్లి తెర ప్రేక్షకులకు పరిచమైన ప్రకాష్ రాజ్.. చూడాలని ఉంది, సుస్వాగతం వంటి సినిమాతో టాలీవుడ్ లో ఆదరణ సొంతం చేసుకున్నాడు. వరస ఆఫర్స్ తో విభిన్న పాత్రలతో.. దక్షిణాది భాషల్లో నటిస్తూ.. ఓ రేంజ్ లో అభిమానులను సొంతం చేసుకున్నాడు.

అయితే ప్రకాష్ రాజ్ సినిమాల్లోకి రాకముందు ఆయన పడిన కష్టం గురించి తెలిస్తే.. కన్నీరు పెట్టక మానరు ఎవరైనా..! నిజానికి ప్రకాష్ రాజ్ చాలా ముక్కుసూటి మనిషి.. తన మనసులో ఉంది తనకు అనిపించింది నిర్భయంగా ఉన్నది ఉన్నట్లు మొహమాటం లేకుండా చెప్పేస్తారు. కర్ణాటకకు చెందిన ప్రకాష్ రాజ్ బాల్యం అంతా ముళ్లబాట అని చెప్పవచ్చు.. ఆయన తల్లిదండ్రులకు ప్రేమ పెళ్లి. తల్లి క్రిస్టియన్.. అనాథ. నర్సు గా ఉద్యోగం చేస్తూ.. తనని తాను పోషించుకునేవారు. ఆమె పనిచేస్తున్న ఆసపత్రికి చికిత్స నిమిత్తం వచ్చిన ఒక వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. తండ్రిది హుబ్లీ. ఈ దంపతులకు ముగ్గురు సంతానం.. మొదటి సంతానం ప్రకాష్ రాజ్. తర్వాత ఒక చెల్లి తమ్ముడు ఉన్నారు. చిన్నతనంలో స్టేజ్ మీద నటిస్తుండేవారు.. ఆర్ధికంగా దిగువ మధ్యతరగతి కుటుంబం.. దీంతో ప్రకాష్ రాజ్ కు కాలేజీ చదువు కు డబ్బులు పంపే స్టేజ్ ఫ్యామిలీకి లేదు. ఇక కుటుంబ పోషణ భారంమీద వేసుకున్న ప్రకాష్ రాజ్ స్టేజ్ మీద నటించడం మొదలు పెట్టారు. అలా ప్రముఖ దర్శకుడు కే బాల చందర్ దృష్టి లో పడ్డారు. ముందుగా బుల్లి తెరపై అడుగు పెట్టారు. ప్రకాష్ రాజ్ తమిళంలో డ్యూయెట్ సినిమాతో వెండి తెరపై.. తర్వాత తెలుగు చిత్ర పరిశ్రమకు సంకల్పం సినిమాతో పరిచయమయ్యారు. ఎంతో కష్టపడి ఈ రోజు ఈ స్టేజ్ కు చేరుకున్న ప్రకాష్ రాజ్.. ఆ కష్టాన్ని ఇప్పటికీ మరచిపోలేదని.. ఎవరైనా సహాయం కోసం అడిగితె లేదు అనకుండా చేస్తారని సన్నిహితులు అంటారు.

Also Read: తినడానికి చూస్తే ఖాళీ గిన్నె దర్శనం. యజమానిమీద కోపంతో శునకం చేసిన పని చూస్తే నవ్వాపుకోలేరుగా

పరిమళాన్ని, ఆహ్లాదాన్ని ఇచ్చే మల్లెలు… కళ్ళకు, మనసుకు ఎంత ఆరోగ్యాన్ని ఇస్తాయో తెలుసా..!