AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sonusood: హైదరాబాద్‌ పోలీసులకు కృతజ్ఞత తెలిపిన సోనూసూద్‌.. పేదలను మోసం చేసేవారు ఊచలు లెక్కపెట్టాల్సిందే అంటూ..

Sonusood: లాక్‌డౌన్‌ సమయంలో ఎంతో మంది పేదల జీవితాల్లో వెలుగులు నింపాడు సినీ నటుడు సోనూసూద్‌. సినిమాల్లో విలన్‌గా కనిపించే సోనూసూద్‌ రిలయ్‌ లైఫ్‌లో మాత్రం హీరోగా మారాడు. పేద ప్రజలకు దేవుడిగా మారిన సోనూసూద్‌కు ఏకంగా...

Sonusood: హైదరాబాద్‌ పోలీసులకు కృతజ్ఞత తెలిపిన సోనూసూద్‌.. పేదలను మోసం చేసేవారు ఊచలు లెక్కపెట్టాల్సిందే అంటూ..
Sonusood
Narender Vaitla
|

Updated on: Apr 06, 2021 | 12:59 PM

Share

Sonusood: లాక్‌డౌన్‌ సమయంలో ఎంతో మంది పేదల జీవితాల్లో వెలుగులు నింపాడు సినీ నటుడు సోనూసూద్‌. సినిమాల్లో విలన్‌గా కనిపించే సోనూసూద్‌ రిలయ్‌ లైఫ్‌లో మాత్రం హీరోగా మారాడు. పేద ప్రజలకు దేవుడిగా మారిన సోనూసూద్‌కు ఏకంగా గుడినే కట్టించారు ఆయన అభిమానులు.

సోనూసూద్‌ సోషల్ మీడియా వేదికగా ఎవరు ఏం అడిగినా ఇచ్చి ఆదుకున్న విషయం తెలిసిందే. అయితే దీనిని అవకాశంగా మార్చుకున్న ఓ యువకుడు పేద ప్రజలను మోసం చేశాడు. హైదరాబాద్‌కు చెందిన ఆశిష్‌ కుమార్‌ అనే వ్యక్తి సోనూ సూద్‌ పేరితో ఓ ఫేస్‌బుక్‌ అకౌంట్‌ను క్రియేట్ చేసి.. సాయం కోసం ఆర్జించిన వారిని మోసం చేశాడు. దీంతో బాధితులు చేసిన ఫిర్యాదు మేరకు పోలీసులు అతణ్ని అరెస్ట్‌ చేశారు. తాజాగా ఈ విషయంపై సోనూసూద్‌ ట్విట్టర్‌ వేదికగా స్పందించాడు. పోలీసులు అరెస్ట్ చేసిన సదరు వ్యక్తి ఫొటోను ట్విట్టర్‌లో పోస్ట్‌ చేస్తూ.. ప్రజలను మోసం చేసిన వ్యక్తిని గుర్తించి అరెస్ట్ చేసినందుకు.. తెలంగాణ, సైబరాబాద్‌ పోలీసులతో పాటు, డీజీపి, కమిషనర్‌కు కృతజ్ఞతలు తెలిపాడు. పేద ప్రజలను మోసం చేసేవారు ఎప్పటికైనా ఊచలు లెక్కపెట్టాల్సిందే అంటూ ఇకనైనా పేదవారిని మోసం చేయకండి అంటూ క్యాప్షన్‌ జోడించాడు.

సోనూసూద్ చేసిన ట్వీట్..

Also Read: ఈ ఫోటోలోని ఇద్దరు హీరోయిన్స్‌ను గుర్తు పట్టారా.? సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న పిక్.!

Kareena Kapoor Second Baby: కరీనా-సైఫ్ రెండో బేబీ ఫొటో లీక్.. ఎవరు షేర్ చేశారో తెలిస్తే షాకే.. వైరల్

నాన్న సినిమా చూడు.. మరణించిన కొడుకు ఫోటోతో థియేటర్‌కు వెళ్లి సినిమా చూసిన తండ్రి