నాన్న సినిమా చూడు.. మరణించిన కొడుకు ఫోటోతో థియేటర్‌కు వెళ్లి సినిమా చూసిన తండ్రి

కన్నకొడుకుకి హీరో పునీత్‌ రాజ్‌కుమార్‌ అంటే ఎంతో ఇష్టం. ఆయన సినిమాలన్నీ విడుదలైన మొదటి రోజే చూసేవాడు. ఏప్రిల్‌ 1న విడుదలైన యువరత్న సినిమా కోసం ఎన్నో..

నాన్న సినిమా చూడు.. మరణించిన కొడుకు ఫోటోతో థియేటర్‌కు వెళ్లి సినిమా చూసిన తండ్రి
Follow us
Subhash Goud

|

Updated on: Apr 06, 2021 | 11:38 AM

కన్నకొడుకుకి హీరో పునీత్‌ రాజ్‌కుమార్‌ అంటే ఎంతో ఇష్టం. ఆయన సినిమాలన్నీ విడుదలైన మొదటి రోజే చూసేవాడు. ఏప్రిల్‌ 1న విడుదలైన యువరత్న సినిమా కోసం ఎన్నో రోజులుగా ఎదురు చూశాడు. కానీ దురదృష్టవశాత్తు అంతకు ముందే తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయాడు. అంత దుఃఖంలోనూ తండ్రి బాలుని ఫోటో తీసుకుని సినిమా థియేటర్‌కు వచ్చాడు. ఫోటోతో కలిసి యువరత్న సినిమాచూసి కొడుకు ఆశ తీర్చినట్లు నిట్టూర్చాడు.

అయితే కర్ణాటకలోని మైసూర్‌ కువెంపు నగరంకు చెందిన మురళీధర్‌ అనే వ్యక్తి కుమారుడు హరికృష్ణన్‌ నాలుగు నెలల కిందట మిత్రులతో కలిసి వరుణ కాలువలో ఈతకు వెళ్లి నీట మునిగి ప్రాణాలు విడిచాడు. యువరత్న సినిమా విడుదలైన రోజే మొదటి ఆట చూడాలని తండ్రిలో చెప్పేవాడు. ఈ నేపథ్యంలో యువరత్న ఆడుతున్న సినిమా థియేటర్‌కు బాలుని తల్లిదండ్రులు, అన్నయ్య వచ్చారు. తమతో పాటు బాలుని ఫోటోను తీసుకొచ్చి నాలుగు టికెట్లు తీసుకుని మూవీని చూశారు. దీంతో ఇదేంటని ప్రేక్షకులు ఆరా తీయగా అసలు విషయం చెప్పాడు.

ఇవీ చదవండి: Karthika Deepam : కార్తీక్ మోసం చేశాడంటూ మోనిత కన్నీరు.. దీపని ఎప్పటికీ నమ్మనంటున్న డాక్టర్ బాబు

Nagendra Babu: ‘వరుణ్‌ తేజ్‌కు సాయి పల్లవికి పెళ్లి’.. స్పందించిన నాగబాబు.. వైరల్‌ అవుతోన్న రియాక్షన్‌..