‘జలజల జలపాతం’ సాంగ్ మేకింగ్ వీడియో.. రొమాన్స్‏ సీన్లలో ఒకరిని మించి ఒకరు.. చివరకు బేబమ్మను భయపెట్టేశారుగా..

Uppena Movie: 'ఉప్పెన'.. లాక్ డౌన్ తర్వాత బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న సినిమా.. హీరో, హీరోయిన్, డైరెక్టర్ తమ మొదటి సినిమాతోనే సూపర్ హిట్ అందుకున్నారు. ఇక తెరపై మెగా హీరో వైష్ణవ్ తేజ్, కృతి శెట్టి జంట

  • Rajitha Chanti
  • Publish Date - 3:38 pm, Tue, 6 April 21
'జలజల జలపాతం' సాంగ్ మేకింగ్ వీడియో.. రొమాన్స్‏ సీన్లలో ఒకరిని మించి ఒకరు.. చివరకు బేబమ్మను భయపెట్టేశారుగా..
Uppena Song

Uppena Movie: ‘ఉప్పెన’.. లాక్ డౌన్ తర్వాత బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న సినిమా.. హీరో, హీరోయిన్, డైరెక్టర్ తమ మొదటి సినిమాతోనే సూపర్ హిట్ అందుకున్నారు. ఇక తెరపై మెగా హీరో వైష్ణవ్ తేజ్, కృతి శెట్టి జంట ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ముఖ్యంగా వీరిద్దరి మధ్య కెమిస్ట్రీని ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా తెరకెక్కించడంలో సక్సెస్ అయ్యాడు డైరెక్టర్ బుచ్చిబాబు సాన. అందుకే విడుదలైన అతి తక్కువ కాలంలోనే విమర్శకుల ప్రశంసలను అందుకుంది ఈ సినిమా. కేవలం సినిమానే కాకుండా.. ఇందులోని సాంగ్స్ కూడా అంతే హిట్ అయ్యాయి. ఇక విడుదలకు ముందే నీ కన్ను నీలి సముద్రం సాంగ్ ఎంతటి సెన్సెషన్ క్రియేట్ చేసిందో తెలిసిన విషయమే. ఇక ఈ పాటనే కాకుండా.. ఈ సినిమాలోని మరో పాట జలజల జలపాతం.. (jala jala jalapatham) సాంగ్ యువతను ఎంతగానో ఆకట్టుకుంది. దేవి శ్రీ బాణిలకు అనుగుణంగా.. హీరోహీరోయిన్లు నటించిన తీరు యువతను కట్టిపడేసింది. అందుకే ఇప్పటికి ఈ సాంగ్ యూట్యూబ్‏లో ట్రెండ్ అవుతుంది.

ఈ క్రమంలోనే జలజల జలపాతం సాంగ్ మేకింగ్ వీడియోను విడుదల చేసింది చిత్రయూనిట్. ఇందులో రోమాన్స్ సీన్లలో ఒకరిని మించి ఒకరు అనే విధంగా నటించారు వైష్ణవ్, కృతిశెట్టి. ఇక సినిమాలో ఈ సాంగ్ మొత్తం సముద్రం మధ్యలో ఓ పడవలో ఉన్నట్లుగా కనిపిస్తుంది. ఇక నిజంగానే సముద్ర మధ్యలో షూట్ జరిగిందా అనే విధంగా ప్రేక్షకుడికి అనుభూతిని కలిగించేలా ఓ ఆర్టిఫిషల్ సెట్స్ వేసి.. తెరకెక్కించారు మేకర్స్. ఇక ఈ పాటలో వైష్ణవ్, కృతి శెట్టి అద్బుతంగా నటించారు. తాజాగా విడుదల చేసిన మేకింగ్ వీడియో చూస్తుంటే.. ఈ సాంగ్ మొత్తాన్ని ఓ స్విమ్మింగ్ ఫూల్‏లో చిత్రీకరించినట్లుగా తెలుస్తోంది. స్విమ్మింగ్ పూల్‏లో ఒక పడవను ఉపయోగించి సాంగ్ షూటింగ్ చేసినట్లుగా కనిపిస్తోంది. ఇక చిత్రీకరణ జరుగుతున్న సమయంలో పడవన అదుపులకు గురికావడంతో బేబమ్మ కాస్త భయపడినట్లుగా కనిపిస్తోంది. అంతేకాకుండా.. ఈ సాంగ్‏కు గ్రాఫిక్స్ డిజైన్స్ మరింత బలం చేకుర్చింది. ప్రస్తుతం యూట్యూబ్‏లో జలజల జలపాతం పాట సెన్సెషన్ క్రియేట్ చేస్తోంది. తాజాగా విడుదలైన ఈ పాట మరోసారి అత్యథిక వ్యూస్ సొంతం చేసుకుంది.

వీడియో..

Also Read: Actor Prakash: తల్లిదండ్రులది ప్రేమవివాహం.. బాల్యం నుంచి కష్ఠాలు ఎదుర్కొన్న విలక్షణ నటుడు..ఆయన జర్నీ కూడా స్ఫూర్తివంతం