AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rana Daggupati: సుకుమార్ శిష్యుడి దర్శకత్వంలో రానా.. 1940 పిరియాడిక్ బ్యాక్ డ్రాప్‏తో మూవీ..

దగ్గుబాటి రానా.. 'లీడర్' సినిమాతో తెలుగు తెరకు హీరోగో పరిచయమై.. మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. కానీ ఆ సినిమా రానాకు సక్సెస్ ఇవ్వలేకపోయింది. ఆ తర్వాత విభిన్న తరహా సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తూ

Rana Daggupati: సుకుమార్ శిష్యుడి దర్శకత్వంలో రానా.. 1940 పిరియాడిక్ బ్యాక్ డ్రాప్‏తో మూవీ..
Rana Daggubati
Rajitha Chanti
|

Updated on: Apr 06, 2021 | 4:22 PM

Share

దగ్గుబాటి రానా.. ‘లీడర్’ సినిమాతో తెలుగు తెరకు హీరోగో పరిచయమై.. మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. కానీ ఆ సినిమా రానాకు సక్సెస్ ఇవ్వలేకపోయింది. ఆ తర్వాత విభిన్న తరహా సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తూ వస్తున్న రానా.. రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి సినిమాతో పాన్ ఇండియా లెవల్లో క్రేజ్ అందుకున్నాడు. ఇక ఈ మూవీ తర్వాత రానా అనారోగ్య కారణాల వల్ల కొద్ది రోజులు సినిమాలకు దూరంగా ఉన్నాడు. లాక్ డౌన్ అనంతరం ‘అరణ్య’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు రానా.  ఈ సినిమాకు ప్రభు సాల్మన్ దర్శకత్వం వహించగా.. హిందీలో మినహా.. తెలుగు, తమిళ బాషల్లో విడుదలై..  తెలుగు మంచి టాక్ తెచ్చుకుంది… కానీ  బాక్సాఫీసు దగ్గర ఆశించినంత కలెక్షన్లను మాత్రం రాబట్టలేకపోయింది. ఇదిలా ఉంటే.. రానా ప్రస్తుతం ‘విరాట పర్వం’ సినిమాతో మరోసారి ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఇందులో సాయిపల్లవి హీరోయిన్‏గా నటింస్తోంది. అలాగే సీనియర్ హీరోయిన్ ప్రియమణి, నందితా దాస్.. కీలక పాత్రలలో నటించారు. ఈ సినిమాకు వేణు ఉడుగుల దర్శకత్వం వహించగా.. ఏప్రిల్ 30న విడుదల కానుంది.

అలాగే రానా ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న మలయాళ మూవీ ‘అయ్యప్పనుమ్ కోషియమ్’ రీమేక్‏లో నటిస్తున్నాడు. ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జురగుతోంది. తాజా సమాచారం ప్రకారం రానా సక్సెస్ ఫుల్ డైరెక్టర్ సుకుమార్ శిష్యుడి దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నట్లుగా టాక్ వినిపిస్తోంది. సుకుమార్ శిష్యుడు వెంకీ 1940 పిరియాడిక్ బ్యాక్ డ్రాప్‏తో డైరెక్టర్‏గా పరిచయం కాబోతున్నాడు. ఈ మూవీ స్టోరీని రానాకు వినిపించగా.. వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని.. త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్ళనున్నట్లుగా ఫిల్మ్ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. 14 రీల్స్ నిర్మాణ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించనుంది. త్వరలోనే దీనికి సంబంధించిన పూర్తి వివరాలను ప్రకటించనున్నారు మేకర్స్.

Also Read: ‘జలజల జలపాతం’ సాంగ్ మేకింగ్ వీడియో.. రొమాన్స్‏ సీన్లలో ఒకరిని మించి ఒకరు.. చివరకు బేబమ్మను భయపెట్టేశారుగా..

ఓ వైపు అనారోగ్యం.. మరో వైపు చలి.. కానీ పాట కోసం 16 గంటలు నీటిలో ఉన్న ‘తలైవి’ హీరోయిన్..