ఓ వైపు అనారోగ్యం.. మరో వైపు చలి.. కానీ పాట కోసం 16 గంటలు నీటిలో ఉన్న ‘తలైవి’ హీరోయిన్..

Kangana Ranaut: బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ అంటే కాంట్రావర్సీలకు మరోపేరుగా మారిపోయింది. తన వ్యక్తిగత విషయాలు మాత్రమే కాకుండా..

ఓ వైపు అనారోగ్యం.. మరో వైపు చలి.. కానీ పాట కోసం 16 గంటలు నీటిలో ఉన్న 'తలైవి' హీరోయిన్..
Kangana Ranaut
Follow us
Rajitha Chanti

|

Updated on: Apr 05, 2021 | 5:54 PM

Kangana Ranaut: బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ అంటే కాంట్రావర్సీలకు మరోపేరుగా మారిపోయింది. తన వ్యక్తిగత విషయాలు మాత్రమే కాకుండా.. సమజంలోని విషయాల పట్ల తనదైన శైలిలో స్పందిస్తూ.. వివాదాలకు కారణమవుతుంటుంది. అయితే కంగనా చుట్టూ బయట ఎన్ని వివాదాలు చెలరేగిన ఆమె మాత్రం సినిమాల విషయంలో మాత్రం చాలా స్ట్రిక్ట్‏గా ఉంటుంది. సినిమాలోని తన పాత్ర కోసం ఎంతో డెడికేషన్ చూపిస్తుంది ఈ బ్యూటీ. ఎలాంటి పాత్ర చేసిన. అందులో జీవించేస్తుంది కంగన. ప్రస్తుతం ఈ అమ్మడు నటిస్తున్న చిత్రం తలైవి.

ఈ సినిమా దివంగత నటి, రాజకీయ నాయకురాలు జయలలిత జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతుంది. ఇటీవల విడుదలైన పోస్టర్లను చూస్తుంటే.. జయలలిత పాత్రలో కంగన ఒదికిపోయిందనే చెప్పుకోవాలి. ఇటీవల ఈ సినిమా నుంచి మొదటి సారి చలి చలి అనే సాంగ్ రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. ఇందులో జయలలిత హీరోయిన్‏గా ఉన్న సమయంలో ఎంత అందంగా ఉందో కళ్ళకు కట్టినట్లుగా చూపించారు మేకర్స్. ఈ పాటకు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ సాంగ్ గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ సినీ పరిశ్రమలో చక్కర్లు కొడుతుంది. ఈ పాట కోసం కంగన చాలా రిస్క్ చేసిందట. ఓ వైపు తీవ్ర అనారోగ్యం, మరోవైపు తనకు చలిగా ఉండడం.. కానీ ఆ పాట చిత్రీకరణ కోసం ఏకంగా 16 గంటలు నీటిలోనే ఉండిపోయిందట ఈ బ్యూటీ. అంతటి చలిలోనూ కంగన సాంగ్ షూట్ చేసిందట.

అయితే ఈ పాటను చిత్రీకరించడానికి నిర్మాతలు చాలా కష్టపడ్డారట. కరోనా ప్రభావంతో ఏర్పడిన లాక్ డౌన్ ముగిశాక.. పాటను పూర్తిచేయాలనుకున్నారట మేకర్స్. అయితే అప్పటికీ కూడా సినిమా షూటింగ్స్ పై ఆంక్షలు ఉండడంతో… దాదాపు 8 నెలల తర్వాత ఈ మూవీ చిత్రీకరణలో పాల్గొందట కంగన. అయితే అంత సమయం వెయిట్ చేసినందుకు ఇప్పుడు ప్రతిఫలం దక్కిందంటున్నారు నిర్మాతలు. ఈ సినిమాలో జయలలిత, ఎంజీఆర్ మధ్య ఉన్న ప్రేమకథను కూడా చూపించబోతున్నట్లుగా సమాచారం. ఈ సినిమాను ఏప్రిల్ 23న తెలుగు, తమిళం, హిందీలో విడుదల చేయనున్నారు మేకర్స్. ఈ చిత్రానికి ఏ.ఎల్ విజయ్ దర్శకత్వం వహిస్తున్నారు.

Also Read: స్కైబ్లూ కలర్ చీరలో హైబ్రిడ్ పిల్లా.. సాయి పల్లవి కట్టిన సారీ రేట్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..

టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్‎గా ‘ఉప్పెన’ భామ.. మహేష్‏తో జోడి కట్టనున్న కృతీ శెట్టి..