టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్‎గా ‘ఉప్పెన’ భామ.. మహేష్‏తో జోడి కట్టనున్న కృతీ శెట్టి..

Krithi Shetty: 'ఉప్పెన' సినిమాతో టాలీవుడ్‏కు పరిచయమైంది కృతీశెట్టి. ఈ మూవీ విడుదలకు ముందే ఫుల్ పాపులారిటీని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే.

టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్‎గా 'ఉప్పెన' భామ.. మహేష్‏తో జోడి కట్టనున్న కృతీ శెట్టి..
Mahesh Babu Krithi Shetty
Follow us
Rajitha Chanti

|

Updated on: Apr 05, 2021 | 3:28 PM

Krithi Shetty: ‘ఉప్పెన’ సినిమాతో టాలీవుడ్‏కు పరిచయమైంది కృతీశెట్టి. ఈ మూవీ విడుదలకు ముందే ఫుల్ పాపులారిటీని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ సినిమాతో దర్శకుడు బుచ్చిబాబు, మెగా హీరో వైష్ణవ్ తేజ్ సినీ ఇండస్ట్రీకి పరిచమయ్యారు. మొదటి సినిమాకు విడుదలకు ముందే కృతి అకౌంట్లో మరో రెండు సినిమాలు చేరిన సంగతి తెలిసిందే. అవే నేచురల్ స్టార్ నాని శ్యామ్ సింగరాయ్, సుధీర్ బాబు సరసన ఓ మూవీ చేయబోతున్నంది ఈ చిన్నది. ఇలా ఉంటే… ఇక ఉప్పెన విడుదలైన తర్వాత బ్లాక్ బస్టర్ హిట్‏గా నిలిచింది. దీంతో బేబమ్మకు ఆఫర్లు క్యూ కడుతున్నాయి.

తాజాగా ఈ అమ్మడు సూపర్ స్టార్ మహేష్ బాబు తన రాబోయే సినిమా కృతి శెట్టి ఛాన్స్ కొట్టేసినట్లుగా టాక్ వినిపిస్తోంది. మహేష్ ప్రస్తుతం పరశురాం దర్శకత్వంలో సర్కారు వారి పాట అనే సినిమా చేస్తున్నాడు. ఇందులో మహానటి ఫేమ్.. కీర్తి సురేష్ హీరోయిన్‏గా నటిస్తోంది. ఈ మూవీ తర్వాత మహేష్ దర్శకదీరుడు రాజమౌళి డైరెక్షన్‏లో ఓ మూవీ రాబోతున్న విషయం తెలిసిందే. అయితే తాజా సమాచారం ప్రకారం రాజమౌళీ సినిమా కంటే ముందే మహేష్.. మరో డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో మరో సినిమా చేయబోతున్నట్లుగా ఫిల్మ్ నగర్లో టాక్ వినిపిస్తోంది. ఈ సినిమాలో కృతి శెట్టి నటించబోతుందట. ప్రస్తుతం అనిల్ రావిపూడి.. ఎఫ్ 3 మూవీ చేస్తున్నాడు. ఇందులో విక్టరి వెంకటేష్, వరుణ్ తేజ్, మెహ్రీన్, తమన్నా ప్రధాన పాత్రలలో నటిస్తున్నారు. ఈ సినిమా తర్వాత అనిల్ రావిపూడి, మహేష్ కాంబినేషన్లో వచ్చే చిత్రం సెట్స్ పైకి వెళ్ళనుంది. ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే ప్రకటించనున్నట్లుగా టాక్.

Also Read: Vakeel Saab: టాలీవుడ్‏లో పవన్ ఫిల్మ్ ఫెస్టివల్.. నాకు ఫ్యాన్స్ వార్నింగ్ ఇచ్చారు.. డైరెక్టర్ క్రిష్..

షూటింగ్ లోకేషన్‏లో గొడవ పెట్టుకున్న సోహైల్.. తోటి సభ్యుడి కాలర్ పట్టుకోని.. కానీ చివరకు..