AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vakeel Saab: టాలీవుడ్‏లో పవన్ ఫిల్మ్ ఫెస్టివల్.. నాకు ఫ్యాన్స్ వార్నింగ్ ఇచ్చారు.. డైరెక్టర్ క్రిష్..

Vakeel Saab Pre Release Event: పవన్ కళ్యాణ్ దాదాపు మూడు సంవత్సరాల తర్వాత 'వకీల్ సాబ్' సినిమాతో రీఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే.

Vakeel Saab: టాలీవుడ్‏లో పవన్ ఫిల్మ్ ఫెస్టివల్.. నాకు ఫ్యాన్స్ వార్నింగ్ ఇచ్చారు.. డైరెక్టర్ క్రిష్..
Director Krish
Rajitha Chanti
|

Updated on: Apr 04, 2021 | 9:29 PM

Share

Vakeel Saab Pre Release Event: పవన్ కళ్యాణ్ దాదాపు మూడు సంవత్సరాల తర్వాత ‘వకీల్ సాబ్’ సినిమాతో రీఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. మీ మూవీ మొదటి నుంచి ఫ్యాన్స్ అంచనాలు భారీగానే ఉన్నాయి. ఇక ఈ సినిమాతో మళ్లీ పవన్‏ను తెరపై చూడాలని ఫాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఏప్రిల్ 9న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సందర్భంగా ఈరోజు సాయంత్రం శిల్పాకళా వేదికలో వకీల్ సాబ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహింస్తున్నారు చిత్రయూనిట్.

కరోనా నిబంధన మధ్య కేవలం పాసులు ఉన్నవారిని మాత్రమే అనుమతించింది చిత్రయూనిట్. ఇక ఈ కార్యక్రమానికి డ్రైరెక్టర్ క్రిష్ ముఖ్య అతిదిగా వచ్చారు. స్జేట్ పైకి వచ్చిన క్రిష్ పవన్ ఫ్యాన్స్ గురించి సెన్సెషనల్ కామెంట్స్ చేశాడు.. ఫ్యాన్స్ లందూ పవన్ ఫ్యాన్స్ వేరయా అంటూ స్పీచ్ మొదలు పెట్టాడు క్రిష్. మొన్న ఒకసారి షూటింగ్ చేస్తు్న్నాం. లంచ్ టైంలో అలా ట్విట్టర్ ఓపెన్ చేసి నోటిఫికేషన్స్ చూస్తున్నాను. నాకు ఓ పది మంది వరకు మేసేజేస్ చేశారు. అందులో చాలా మంది నాకు వార్నింగ్ ఇచ్చారు. ఈ రోజు ఎండ ఎక్కువగా ఉంది. మా పవన్ కళ్యాణ్‏ను జాగ్రత్తగా చూసుకోండి అంటూ వార్నింగ్ ఇచ్చారు అంటూ చెప్పుకోచ్చాడు క్రిష్. ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ జరుగుతుంటుంది. కానీ ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో పవన్ కళ్యాణ్ ఫిల్మ్ ఫెస్టివల్ జరుగుతుంది. దానికి ముందుగా వకీల్ సాబ్ దిగ్విజయాన్ని ఆరంభిస్తోందని క్రిష్ చెప్పుకోచ్చాడు. ముఖ్యంగా ఇలాంటి కథను పవన్ దగ్గరకు తీసుకెళ్లినందుకు దిల్ రాజు గారికి శతకోటి వందనాలు.. తన కంటే ఓ మెట్టు ఎక్కువగా ఇంపార్టెన్స్ ఉన్న పాత్రలు ఉన్నా కూడా ఈ కథను అందరికీ చెప్పాలనుకున్నా పవన్ గ్రేట్. ఈ మూవీ పెద్ద విజయం సాధించాలని ఆశిస్తున్నాను అంటూ చెప్పుకోచ్చాడు క్రిష్. ఇదిలా ఉంటే. ప్రస్తుతం పవన్… క్రిష్ డైరెక్షన్లో హరిహర విరమల్లు సినిమా చేస్తుండగా.. అటు అయ్యపనుమ్ కోషియమ్ సినిమాలో నటిస్తున్నాడు.

Also Read: మోనిత పాత్రను చేయడానికి మొదట్లో ఒప్పుకోలేదు.. కానీ ఇప్పుడు ఆనందంగా ఉన్నాను.. ‘కార్తీక దీపం’ మోనిత కామెంట్స్.. 

Vakeel Saab pre release event live: ‘వకీల్ సాబ్’ ప్రీరిలీజ్ ఈవెంట్.. హోరెత్తుతున్న శిల్పకళావేదిక