Saipallavi Nithin: నితిన్‌తో జోడి కట్టనున్న హైబ్రిడ్ పిల్లా..? ఈసారైనా సాయి పల్లవి ఒప్పుకుంటుందా..!
Saipallavi Acting With Nithin: 'ప్రేమమ్' సినిమాతో కేవలం మలయాళ ప్రేక్షకులనే కాకుండా తెలుగు ప్రేక్షకులను కూడా ఆకట్టుకుంది నటి సాయి పల్లవి. డాక్టర్ చదివి యాక్టర్‌గా మారిన ఈ అందాల భామ 'ఫిదా' సినిమాతో తెలుగు...
Saipallavi Acting With Nithin: ‘ప్రేమమ్’ సినిమాతో కేవలం మలయాళ ప్రేక్షకులనే కాకుండా తెలుగు ప్రేక్షకులను కూడా ఆకట్టుకుంది నటి సాయి పల్లవి. డాక్టర్ చదివి యాక్టర్‌గా మారిన ఈ అందాల భామ ‘ఫిదా’ సినిమాతో తెలుగు ప్రేక్షకులను నిజంగానే మెస్మరైజ్ చేసింది. ఈ సినిమాలో తనదైన సహజ నటనతో తెలంగాణ యాసలో మాట్లాడుతూ ఆకట్టుకుందీ చిన్నది. ఇక అనంతరం పలు విజయవంతమైన చిత్రాల్లో నటించింది. చేసినవి కొన్ని సినిమాలో అయినా భారీ పాపులారిటీని సొంతం చేసుకుంది సాయిపల్లవి. దీనికి కారణంగా సాయి పల్లవి ఎంచుకునే పాత్రలే అనడంలో ఎలాంటి సందేహం లేదు. రెమ్యునరేషన్ కంటే తాను చేయబోయే సినిమాలో తన పాత్రకు ఉన్న ప్రాధాన్యత గురించి ఎక్కువగా ఆలోచించే సాయిపల్లవి ఆ క్రమంలోనే ఆచితూచి సినిమాలను ఎంచుకుంటూ తనకంటూ ఓ ప్రత్యేకతను సంపాదించుకుంటోంది. ఇదిలా ఉంటే తాజాగా సాయి పల్లవి హీరో నితిన్‌తో జత కట్టనుందన్న వార్త వైరల్‌గా మారింది. ప్రస్తుతం ‘మ్యాస్ట్రో’ సినిమాలో నటిస్తోన్న నితిన్ తన తర్వాతి చిత్రాన్ని వక్కంతం వంశీతో చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాలో సాయిపల్లవిని తీసుకోవాలని చిత్ర యూనిట్ భావిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే సాయిపల్లవిని ఈ విషయమై సంప్రదించగా దానికి తాను కూడా ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. మరి ఈ వార్తలో ఎంత వరకు నిజం ఉందో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే. ఇదిలా ఉంటే గతంలో నితిన్ హీరోగా తెరకెక్కిన ‘శ్రీనివాస కళ్యాణం’ సినిమాలో సాయిపల్లవి హీరోయిన్‌గా నటిస్తోందని వార్తలు వచ్చాయి. కానీ సినిమాలో హీరోయిన్ పాత్రకు సరైన ప్రాధాన్యత లేదన్న కారణంగా సాయి పల్లవి ఆ సినిమాకు నో చెప్పిందని వార్తలు వచ్చాయి. కానీ దానిపై ఎలాంటి అధికారిక వార్త మాత్రం రాలేదు. మరి ఇప్పుడైనా సాయిపల్లవి నిజంగానే నితిన్‌తో జతకడుతుందా లేదా అన్నది చూడాల్సి ఉంది.
Also Read: షూటింగ్ లోకేషన్లో గొడవ పెట్టుకున్న సోహైల్.. తోటి సభ్యుడి కాలర్ పట్టుకోని.. కానీ చివరకు..
Vakeel Saab pre release event live: ‘వకీల్ సాబ్’ ప్రీరిలీజ్ ఈవెంట్.. హోరెత్తుతున్న శిల్పకళావేదిక