షూటింగ్ లోకేషన్‏లో గొడవ పెట్టుకున్న సోహైల్.. తోటి సభ్యుడి కాలర్ పట్టుకోని.. కానీ చివరకు..

Sohel:  బిగ్ బాస్ సీజన్ 4లోకి పక్కింటి కుర్రాడిగా ఎంట్రీ ఇచ్చిన సోహైల్ తన ఆట తీరుతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక ఆట తీరు కంటే..

షూటింగ్ లోకేషన్‏లో గొడవ పెట్టుకున్న సోహైల్.. తోటి సభ్యుడి కాలర్ పట్టుకోని.. కానీ చివరకు..
Sohel
Follow us
Rajitha Chanti

|

Updated on: Apr 06, 2021 | 7:40 PM

Sohel:  బిగ్ బాస్ సీజన్ 4లోకి పక్కింటి కుర్రాడిగా ఎంట్రీ ఇచ్చిన సోహైల్ తన ఆట తీరుతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక ఆట తీరు కంటే.. సోహైల్ కోపంతోనే ఎక్కువగా ఫేమస్ అయ్యాడు అని చెప్పుకోవచ్చు. కథ వేరే ఉంటది అంటూ తనలోని సీరియస్ యాంగిల్ మొత్తం చూపించిన సోహైల్ నాగ్ మాటలకు కాస్త కోపాన్ని తగ్గించుకున్నాడు. తోటి కంటెస్టెంటకు గట్టి పోటి ఇస్తూ.. ఫైనల్ వరకు వెళ్లిన సోహైల్.. చివరకు రూ.25 లక్షలు ఫ్రైజ్ మనీ తీసుకొని ఆట నుంచి ఎలిమినేట్ అయ్యాడు. ఇక బిగ్ బాస్ ఫైనల్ స్టేజీపై తనకు మూవీ తీయాలని ఉందంటూ.. తన మనసులోని మాటను బయటపెట్టిన సంగతి తెలిసింది. బిగ్ బాస్ తర్వాత సోహైల్‏కు ఆఫర్లు క్యూ కట్టాయి. ఇటీవల సోహైల్ హీరోగా ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. అయితే అక్కడ ఓ సభ్యుడితో సోహైల్ గొడవకు దిగాడు. ప్రస్తుతం ఇందుకు సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

హీరోగా నటిస్తున్న సోహైల్ షూటింగ్ స్పాట్‏కు చేరుకొని అక్కడున్న యూనిట్ సభ్యుడితో గొడవకు దిగాడు. ఆ గొడవ కాస్తా చిన్నపాటి ఘర్షణకు దారి తీసింది. దీంతో అతడి కాలర్ పట్టుకోని పరస్పరం అరుచుకుంటూ మరీ కొట్టుకునే స్థాయికి వెళ్ళారు ఇద్దరు. దీంతో అక్కడున్న వారంతా ఒక్కసారిగా షాక్‏కు గురయ్యారు. నిర్మాతతోపాటు… హీరోయిన్ కూడా ఆ గొడవ చూసి బిత్తరపోయింది. అయితే వెంటనే షాక్ నుంచి తెరుకున్న నిర్మాత.. తనకు ఇలాంటివి నచ్చవని.. కాబట్టి వెంటవనే గొడవ ఆపాలని ఇద్దరికి సూచించాడు. వెంటనే సోహైల్ ఇదంత ఫ్రాంక్ వీడియో అని.. కేవలం సరదాకే ఇద్దరం గొడవ పడ్డామని సోహైల్ చెప్పుకోచ్చాడు. దీంతో అందరూ ఒక్కసారిగా ఊపీరి పీల్చుకున్నారు. అయితే ఈ గొడవ ఫ్రాంక్ అని నిర్మాత, హీరోయిన్‏తోపాటు.. అక్కడున్న వారికి కూడా తెలియదని తెలిపాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

వీడియో…

Also Read: మోనిత పాత్రను చేయడానికి మొదట్లో ఒప్పుకోలేదు.. కానీ ఇప్పుడు ఆనందంగా ఉన్నాను.. ‘కార్తీక దీపం’ మోనిత కామెంట్స్..

Ram Charan: రామ్ చరణ్, శంకర్ ప్రాజెక్ట్ క్రేజీ అప్‏డేట్.. మరోసారి మెగా కాంబో రిపీట్ కాబోతుందా ?

Vakeel Saab pre release event live: ‘వకీల్ సాబ్’ ప్రీరిలీజ్ ఈవెంట్.. హోరెత్తుతున్న శిల్పకళావేదిక