Ram Charan: రామ్ చరణ్, శంకర్ ప్రాజెక్ట్ క్రేజీ అప్‏డేట్.. మరోసారి మెగా కాంబో రిపీట్ కాబోతుందా ?

Ram Charan Shankar Movie Update: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ మూవీ షూటింగ్‏లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.

Ram Charan: రామ్ చరణ్, శంకర్ ప్రాజెక్ట్ క్రేజీ అప్‏డేట్.. మరోసారి మెగా కాంబో రిపీట్ కాబోతుందా ?
Ram Charan Shankar
Follow us
Rajitha Chanti

|

Updated on: Apr 04, 2021 | 7:50 PM

Ram Charan Shankar Movie Update: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ మూవీ షూటింగ్‏లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ మూవీలో చెర్రీతోపాటు యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ప్రధాన పాత్రలో నటిస్తుండగా.. ఈ మెగా మల్టీస్టారర్ సినిమా దర్శకధీరుడు రాజమౌళి పాన్ ఇండియా మూవీగా తెరకెక్కిస్తున్నాడు. దాదాపు రూ.450 కోట్ల భారీ బడ్జెట్‏తో ఈ చిత్రాన్ని డీవీవీ దానయ్య నిర్మిస్తుండగా.. ఇందులో బాలీవుడ్ బ్యూటీ అలియా భట్, హాలీవుడ్ భామా ఒలీవియా మోరీస్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. అలాగే ఇందులో శ్రియ, సముద్రఖని, అజయ్ దేవ్ గణ్ కీలక పాత్రలలో నటిస్తుండగా.. పలువురు హాలీవుడ్ నటులు కూడా నటిస్తున్నారు. ఈ సినిమాను అక్టోబర్ 13న విడుదల చేయనుంది చిత్రయూనిట్. ఈ సినిమా తర్వాత రామ్ చరణ్.. సక్సెస్ ఫుల్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే.

ఆర్ఆర్ఆర్ సినిమా పూర్తైన తర్వాత వీరిద్దరి కాంబోలో తెరకెక్కే మూవీ సెట్స్ పైకి వెళ్ళనున్నట్లు సమాచారం. తాజాగా ఈ మూవీ గురించి ఓ క్రేజీ అప్ డేట్ ఫిల్మ్ నగర్ వర్గాల్లో చక్కర్లు కొడుతుంది. అదెంటంటే… ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో మెగాస్టార్ చిరంజీవి నటించబోతున్నట్లుగా టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ పలు సినిమాల్లో కొన్ని గెస్ట్ రోల్స్ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా కొరటాల శివ దర్శకత్వంలో చిరు ప్రధాన పాత్రలో నటిస్తున్న ఆచార్య సినిమాలోనూ చరణ్ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీకి సంబంధించిన చిత్రీకరణను చరణ్ పూర్తిచేసుకున్నాడు. ఇందులో చిరుకు జోడీగా కాజల్ నటిస్తుండగా… చరణ్‏కు జోడీగా పూజా హెగ్డే నటిస్తోంది. ఈ మూవీ మే 13న దేశవ్యాప్తంగా విడుదల చేయనుంది చిత్రయూనిట్.

Also Read: Vakeel Saab pre release event live: ‘వకీల్ సాబ్’ ప్రీరిలీజ్ ఈవెంట్.. హోరెత్తుతున్న శిల్పకళావేదిక

ఎమెషనల్‏గా ఆకట్టుకుంటున్న ‘కార్తీకదీపం టీం’.. సీతారాములుగా వంటలక్క, డాక్టర్ బాబు అధుర్స్.. రామాయణ గాథతో..

Vakeel Saab Pre Release: వకీల్ సాబ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లైవ్ వీడియో..