మరోసారి సింగర్‌గా మారనున్న పవన్ కళ్యాణ్.. అసలు విషయం చెప్పిన మ్యూజిక్ డైరెక్టర్.. ఇంతకీ ఏ మూవీలో అంటే..
Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. మరోసారి గాయకుడిగా మారబోతున్నారు. ఇప్పటికే ఎన్నో సినిమాల్లో స్వయంగా పాట పాడి అలరించిన
Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. మరోసారి గాయకుడిగా మారబోతున్నారు. ఇప్పటికే ఎన్నో సినిమాల్లో స్వయంగా పాట పాడి అలరించిన పవన్ మరోసారి పాట పాడేందుకు సిద్ధమయ్యారట. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘అయ్యప్పనుమ్ కోషియమ్’ రీమేక్‌గా తెరకెక్కుతున్న సినిమాలో పవన్ ఓ పాట పాడబోతున్నట్లుగా ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ఎస్ తమన్ తెలిపారు. ఈ చిత్రానికి సాగర్ కె. చంద్ర దర్శకత్వం వహిస్తున్నారు.
‘వకీల్ సాబ్’ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా.. ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న తమన్.. అయ్యప్పనుమ్ కోషియమ్ సినిమా గురించి కొన్ని ఆసక్తికర విషయాలను చెప్పారు. పవన్‌కు సంగీతం అంటే చాలా ఇష్టం, ఆయన సినిమాలకు సంగీతం అందించాలని ఎప్పటి నుంచో నాకు ఓ కోరిక ఉంది. ‘వకీల్‌సాబ్’తో నా కల నెరవేరింది. అలాగే ‘అయ్యప్పనుమ్ కోషియం’ రీమేక్‌కు కూడా సంగీతం అందిస్తున్నాను. నేను చాలా సంతోషంగా ఉన్నాను. ఈ రీమేక్ కోసం పవన్ ఓ పాట పాడనున్నారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ వల్లే ‘వకీల్‌సాబ్’, ‘అయ్యప్పనుమ్ కోషియం’ ప్రాజెక్ట్‌లలో నేను భాగమయ్యాను’ అంటూ చెప్పుకోచ్చారు తమన్.
సినిమాలకు స్వస్తి చెప్పి రాజకీయాల వైపు వెళ్ళిన పవన్… దాదాపు మూడు సంవత్సరాల తర్వాత ‘వకీల్ సాబ్’ (vakeel Saab) సినిమాతో రీఎంట్రీ ఇస్తున్నారు. బాలీవుడ్లో సూపర్ హిట్ అయిన పింక్ రీమేక్‌గా ఈ చిత్రం తెరకెక్కించారు డైరెక్టర్ శ్రీరామ్ వేణు. ఇందులో పవన్ న్యాయవాదిగా నటిస్తున్నారు. ఇందులో పవన్ సరసన శ్రుతిహాసన్ నటిస్తుండగా.. నివేథా థామస్, అంజలి, అనన్య నాగల్ల, ప్రకాశ్ రాజ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఉమెన్ ఎంపావర్ మెంట్ నేపథ్యంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు ఏప్రిల్ 9న రానుంది. (Vakeel Saab On April 9th) ఈ సందర్భంగా ఏప్రిల్ 4న సాయంత్రం 6 గంటలకు హైదరాబాద్‌లోని శిల్పా కళ వేదికలో వకీల్ సాబ్ ప్రీరిలీజ్ ఈవెంట్ (Vakeel Saab Pre Release Event) నిర్వహిస్తున్నారు చిత్రయూనిట్. పవన్ క్రేజ్‌ను దృష్టిలో పెట్టుకొని కరోనా నిబందనలను పాటిస్తూ.. ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించాలని పోలీసులు పర్మిషన్ ఇవ్వగా.. కేవలం పాసులు ఉన్నవారినే అనుమతిస్తామంటూ ప్రకటించింది చిత్రయూనిట్. ఈ వేడుకకు మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ ముఖ్యఅతిథులుగా రాబోతున్నట్లుగా టాక్ నడుస్తోంది. బాలీవుడ్ నిర్మాత బోనీ కపూర్ సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్సన్ బ్యానర్‌పై ఈ సినిమా నిర్మించారు. ఇక ఇవే కాకుండా.. ప్రస్తుతం పవన్ క్రిష్ డైరెక్షన్లో ‘హరిహర విరమల్లు’ సినిమాలో కూడా నటిస్తున్నాడు. ఇందులో ఇస్మార్ట్ బ్యూటీ.. నిధి అగర్వాల్ హీరోయిన్గా నటిస్తోంది.
Also Read: Vakeel Saab pre release event live: ‘వకీల్ సాబ్’ ప్రీరిలీజ్ ఈవెంట్.. హోరెత్తుతున్న శిల్పకళావేదిక