Vakeel Saab: నివేదా థామస్ కు కరోనా పాజిటివ్… అలర్ట్ అయిన వకీల్ సాబ్ చిత్రయూనిట్.. టీమ్ కు కరోనా టెస్టులు..
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న తాజా చిత్రం వకీల్ సాబ్. ఈ సినిమా కోసం అభిమానులంతా వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు.
Vakeel Saab: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న తాజా చిత్రం వకీల్ సాబ్. ఈ సినిమా కోసం అభిమానులంతా వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. పవన్ రాజకీయాలోకి ఎంట్రీ ఇచ్చిన నేపథ్యంలో కొంతకాలం సినిమాలకు దూరంగా ఉన్నాడు. ఇప్పుడు తిరిగి సినిమాల్లో నటిస్తుండటంతో అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. బాలీవుడ్ లో సూపర్ హిట్ అయిన పింక్ సినిమాకు రీమేక్ గా ఈ మూవీ తెరకెక్కుతుంది. ఈ సినిమాలో పవన్ లాయర్ గా కనిపించనున్నాడు.
అంజలి, నివేదా థామస్ కీలక పాత్రలోనటిస్తున్నారు. ఈ సినిమా రిలీజ్ ఈవెంట్ నేడు హైదరాబాద్ లోని శిల్పకళావేదిక లో ఘనంగా జరగనుంది. ఇదిలా ఉంటే ఈ సినిమాలో కీలక పాత్ర పోషించిన నివేద థామస్ కరోనా బారిన పడింది.దాంతో ఒక్కసారిగా చిత్రయూనిట్ ఉలిక్కిపడింది. నివేదా థామస్ కి పాజిటివ్ అని రావడంతో ఇప్పుడు చిత్రబృందం అలెర్ట్ అయ్యింది. చిత్ర బృందం మొత్తం కరోనా టెస్ట్ చేయించుకున్నారు. అయితే అందరికి నెగిటివ్ వచ్చిందని తెలుస్తుంది. దాంతో అందరు ఊపిరిపీల్చుకున్నారు. ఇక ఈ సినిమా ట్రైలర్ ఇటీవలే విడుదల చేశారు చిత్రయూనిట్. ఈ ట్రైలర్ కు విపరీతమైన రెస్పాన్స్ వస్తుంది. పవన్ చెప్పిన డైలాగులకు అభిమానులకు పూనకాలు తెప్పిస్తున్నాయి. వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను దిల్ రాజు, బోనికపూర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
మరిన్ని ఇక్కడ చదవండి :
Vakeel Saab: పవన్ కళ్యాణ్ తో నటించటం ఇబ్బంది అని తన అనుభవాలను షేర్ చేసుకున్న అంజలి.. ( వీడియో )
Prabhas : తమిళ్ స్టార్ డైరెక్టర్ కు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఒకే చెప్పాడా…
ఇక పై కనిపించను.. ఒంటరిగానే వెళ్తున్నాను.. అర్థం చేసుకోండి.. అరియానా కామెంట్స్ వైరల్..