Prabhas : తమిళ్ స్టార్ డైరెక్టర్ కు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఒకే చెప్పాడా…

ప్రభాస్ ఇప్పుడు కేవలం టాలీవుడ్ హీరో మాత్రమే కాదు పాన్ ఇండియా స్టార్. బాహుబలి, సాహో సినిమాలతో టాలీవుడ్ తోపాటు బాలీవుడ్ ను కూడా షేక్ చేసాడు డార్లింగ్.

Prabhas : తమిళ్ స్టార్ డైరెక్టర్ కు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఒకే చెప్పాడా...
Prabhas
Follow us
Rajeev Rayala

|

Updated on: Apr 04, 2021 | 4:17 PM

Prabhas : ప్రభాస్ ఇప్పుడు కేవలం టాలీవుడ్ హీరో మాత్రమే కాదు పాన్ ఇండియా స్టార్. బాహుబలి, సాహో సినిమాలతో టాలీవుడ్ తోపాటు బాలీవుడ్ ను కూడా షేక్ చేసాడు డార్లింగ్. ప్రస్తుతం వరుస భారీ ప్రాజెక్ట్స్ తో ఫుల్ బిజీగా ఉన్నాడు ఈ రెబల్ స్టార్. ఇప్పటికే రాధాకృష్ణ దర్శకత్వంలోతెరకెక్కుతున్న రాధేశ్యామ్ సినిమాను పూర్తి చేసాడు. ఈ సినిమాలో ప్రభాస్ సరసన పూజాహెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది. ఈ మూవీ పిరియాడికల్ డ్రామాగా తెరకెక్కుతుంది.

ఈ మూవీతర్వాత బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. ఆదిపురుష్ అనే టైటిల్ తో వస్తున్న ఈ సినిమాలో ప్రభాస్ రాముడిగా కనిపించనున్నాడు. బాలీవుడ్ హీరో సైఫ్ అలీఖాన్ రావణ్ గా నటిస్తున్నాడు. ఇక సీతగా కృతిసనన్ నటిస్తుంది. ఇక కేజీఎఫ్ తో సంచలనం సృష్టించిన ప్రశాంత్ నీల్ తో ఓ సినిమా చేస్తున్నాడు ప్రభాస్.ఈ సినిమాకు సలార్ అనే ఇంట్రస్టింగ్ టైటిల్ ను ఫిక్స్ చేశారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ ప్రారంభం అయ్యింది. ఈ మూవీకి సంబంధించిన ఫస్ట్ లుక్ ను కూడా ఆమధ్య రిలీజ్ చేశారు. వీటితోపాటు మహానటి ఫేమ్ నాగ్ అశ్విన్ తో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా సైన్స్ ఫిక్షన్ కథాంశంతో తెరకెక్కుతోందని తెలుస్తుంది. ఈ మూవీ భారీ బడ్జెట్ తో తెరకెక్కించాలని చూస్తున్నారు. ఇలా వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న డార్లింగ్ ఇప్పడు మరో డైరెక్టర్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని టాక్ నడుస్తుంది.తమిళ్ డైరెక్టర్ లోకేష్ కనగ రాజ్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడని జోరుగా ప్రచారం జరుగుతుంది. ప్రభాస్-లోకేష్ కనగరాజ్ ప్రాజెక్ట్ వచ్చే వేసవిలో ప్రారంభమయ్యేందుకు ఆస్కారం ఉందని అంటున్నారు. లోకేష్ ఇటీవల తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ కి మాస్టర్ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ అందించాడు. ప్రస్తుతం లోకేష్ కమల్ హాసన్ తో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత ప్రభాస్ మూవీ ఉంటుందని అంటున్నారు.

మరిన్ని ఇక్కడ చదవండి: 

ఇక పై కనిపించను.. ఒంటరిగానే వెళ్తున్నాను.. అర్థం చేసుకోండి.. అరియానా కామెంట్స్ వైరల్..

Karthika Deepam: భార్య పిల్లలకి అన్యాయం చేస్తున్నావు.. అంటూ తిడుతూ శాపాలు పెడుతూ లెటర్స్ అందుకుంటున్నా..

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!