Karthika Deepam: భార్య పిల్లలకి అన్యాయం చేస్తున్నావు.. అంటూ తిడుతూ శాపాలు పెడుతూ లెటర్స్ అందుకుంటున్నా..
Karthika Deepam: తెలుగు బుల్లి తెరపై టాప్ రేటింగ్ తో దూసుకుపోతుంది కార్తీక్ దీపం. వెయ్యి ఎపిసోడ్లు దాటినా ఇప్పటికీ క్రేజ్ తగ్గలేదు. ఇక ఈ సీరియల్ లో నటించిన నటీనటులు ఓ రేంజ్ లో క్రేజ్ సొంతం...
Karthika Deepam: తెలుగు బుల్లి తెరపై టాప్ రేటింగ్ తో దూసుకుపోతుంది కార్తీక్ దీపం. వెయ్యి ఎపిసోడ్లు దాటినా ఇప్పటికీ క్రేజ్ తగ్గలేదు. ఇక ఈ సీరియల్ లో నటించిన నటీనటులు ఓ రేంజ్ లో క్రేజ్ సొంతం చేసుకున్నారు. దీప క్యారెక్టర్ లో నటించిన ప్రేమి విశ్వనాధ్, డాక్టర్ బాబు నిరుపమ పరిటాల, సౌందర్య గా నటించిన అర్చనా అనంత్, మోనిత గా నటించిన శోభాశెట్టి నుంచి పనిమనిషి ప్రియమణి వరకూ అందరికీ ప్రేవు తెచ్చింది ఈ సీరియల్. అయితే ఈ సీరియల్లోని ప్రధాన పాత్రల్లో నటించినవారిలో ఎక్కువ మంది ఇతరభాషా నటులు కాగా.. హీరో నిరుపమ్ మాత్రమే తెలుగు నటుడు.
ఇటీవల వెయ్యి ఎపిసోడ్స్ దాటిన నేపథ్యంలో కార్తీక్ .. (నిరుపమ్ ) తన ఫీలింగ్స్ ను పంచుకున్నారు. ఈ సీరియల్ లోని కథ ప్రేక్షకుల మదిని తాకింది. అందుకనే ఈ సీరియల్ అంత విజయవంతమైందని తాను నమ్ముతున్నట్లు చెప్పారు. ఇంతగా ఆదరిస్తున్న ప్రేక్షకులకు కృతఙ్ఞతలు చెప్పారు.
ఇక తన పాత్ర గురించి స్పందిస్తూ.. ఇందులో అన్ని రకాల షేడ్స్ ఉన్నాయని.. ఓ వైపుతల్లిదండ్రులను గౌరవించే కొడుకుగా.. పిల్లలని ప్రేమించే తండ్రిగా.. దీపపై అనుమానం ఇలా అన్ని రకాల షేడ్స్ ఉన్నాయని అన్నారు. అసలు తాను ఎప్పుడు కార్తీక్ పాత్రలో విసుగు చెందలేదని అన్నారు. ఆయితే ఒక ప్రేక్షకుడిగా చూస్తే .. కార్తీక్ ప్రవర్తన తనను కూడా బాధపెడుతుందని తెలిపారు. ఇక ఇన్ని సంవత్సరాలు అయినా నిరాధారమైన అబద్ధాన్ని నమ్ముతూ దీపను అనుమానించడం తనను కూడా బాధపెడుతుందని చెప్పారు. అయితే ఏమి చేయాలి? ఇది పాత్ర యొక్క నైజం.. అన్నారు.
ఇక తాను నిజ జీవితంలో ఎక్కడికి వెళ్లినా కార్తీక్ క్యారెక్టర్ ప్రభావం తనపై చూపిస్తుందని.. దీపను ఎందుకు అనుమానిస్తున్నావంటూ ప్రశ్నిస్తున్నారు. ఇక ఇటీవల వెబ్ సిరీస్ కోసం షూటింగ్ చేస్తున్నప్పుడు.. కొంతమంది వంటలక్కకు, పిల్లలకు ఎలా అన్యాయం చేయగలుగుతున్నావని ప్రశ్నిచారు. ఇక కొంతమంది తనకు బెదిరింపు కాల్స్ , మెయిల్స్ కూడా వస్తున్నాయని.. అందులో దీపని కష్టపెడుతునందుకు శాపాలు కూడా ఉన్నాయని చెప్పారు. వారు డాక్టర్ బాబుగా నా నటనను వ్యక్తిగతంగా తీసుకున్నారు.. అది నా విజయానికి సంకేతం. నేను పొగడ్తలు మరియు విమర్శలను ఒకేలా తీసుకోవడం నేర్చుకున్నానని చెప్పారు నిరుపమ్ పరిటాల. రాబోయే ఎపిసోడ్స్ మరింత ఇంట్రెస్టింగ్ మలుపులతో ప్రసారం కానుందని చెప్పారు డాక్టర్ బాబు.
Also Read: అమావాస్యకు బూడిద రంగులో..పౌర్ణమికి గంధం రంగులో దర్శనమిచ్చే శివుడు..
మీరు వాడే టూత్ బ్రష్ కు ఆయుస్సు ఉంటుంది.. ఎన్ని నెలలకు మార్చాలంటే..
Vakeel Saab Pre Release: వకీల్ సాబ్ ప్రీ రిలీజ్ ఈవెంట్.. పవన్ డైనమిక్ ఎంట్రీ