ఇక పై కనిపించను.. ఒంటరిగానే వెళ్తున్నాను.. అర్థం చేసుకోండి.. అరియానా కామెంట్స్ వైరల్..

Ariyana Glory:  సోషల్ మీడియా వేదికగా యాంకర్‏గా కెరీర ఆరంభించి.. అతి తక్కువ సమయంలోనే ఫుల్ ఫాలోయింగ్ సొంతం చేసుకుంది అరియానా గ్లోరీ.

ఇక పై కనిపించను.. ఒంటరిగానే వెళ్తున్నాను.. అర్థం చేసుకోండి.. అరియానా కామెంట్స్ వైరల్..
Ariyana Glory
Follow us
Rajitha Chanti

| Edited By: Team Veegam

Updated on: Apr 04, 2021 | 9:20 PM

Ariyana Glory:  సోషల్ మీడియా వేదికగా యాంకర్‏గా కెరీర ఆరంభించి.. అతి తక్కువ సమయంలోనే ఫుల్ ఫాలోయింగ్ సొంతం చేసుకుంది అరియానా గ్లోరీ. సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మను ఇంటర్వ్యూ చేసి.. ఒక్కసారిగా ఫుల్ క్రేజ్ సొంతం చేసుకుంది.ఇక అదే ఫాలోయింగ్‏తో బిగ్ బాస్ సీజన్ 4లోకి ఐ యామ్ బోల్డ్ అంటూ ఎంట్రీ ఇచ్చింది అరియానా. బిగ్ బాస్ ఇంట్లో తన ఆట తీరుతో కంటెస్టెంట్స్‏కు గట్టి పోటీ ఇస్తూ.. పైనల్ వరకు వెళ్లింది ఈ బ్యూటీ. షో నుంచి బయటకు వచ్చాక సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‏గా ఉంటూ అభిమానులకు టచ్‏లో ఉంటుంది ఈ ముద్దుగుమ్మ. తాజాగా అరియానా ఇక పై కనిపించను అంటూ అభిమానులకు షాక్ ఇచ్చింది ఈ బ్యూటీ.

ఇటీవల తన ఆరోగ్యం బాగాలేకపోవడం వలన దాదాపు రోజులపాటు సోషల్ మీడియాకు దూరంగా ఉంది ఈ అమ్మడు. దీంతో అభిమానులు ఒకింత ఆందోళన చెందారట. అరియానాకు ఏమైంది.. తనకు ఏం కాకుడదని పూజలు కూడా చేశారట. దీంతో తన ఫ్యాన్స్‏ ఆందోళన తగ్గించేందుకు ఓ వీడియోను షేర్ చేసుకుంది అరియానా.. నాకు గత వారం రోజుల క్రితం జ్వరం వచ్చింది. ఇప్పుడు తగ్గిపోయింది. నాకు ఎలాంటి హాని కలగలేదు. ఇప్పుడు నేను బాగున్నాను. నా కోసం ప్రార్థించిన వారికి థ్యాంక్స్. కొందరు నా కోసం పూజలు చేశారట. మీ అభిమానానికి థ్యాంక్స్ అంటూ చెప్పుకోచ్చింది. ఇక మళ్లీ అభిమానులు ఇలా ఆందోళన చెందకూడదు అంటూ.. ముందుగానే ఓ విషయం పై క్లారిటీ ఇచ్చేసింది అరియానా.

ఇక నుంచి ఓ వారం పది రోజులు సోషల్ మీడియాలో కనిపించను. నేను ఈ నెల 11, 12 వరకు సోషల్ మీడియాలో యాక్టివ్‏గా ఉండను. ఎందుకంటే నేను హిమాలయాలకు వెళ్తున్నాను. అక్కడికి ట్రెక్కింగ్ చేయడానికి ఒంటరిగానే వెళ్తున్నాను. అక్కడ ట్రెక్కింగ్ గ్యాంగ్ ఉంటుంది.. అయినా కానీ నేను ఒక్కదాన్నే వెళ్తున్నాను. అక్కడ సిగ్నల్స్ ఉండవు. కాబట్టి నేను సోషల్ మీడియాలో ఉండను. అర్థం చేసుకోండి. ఈ పది రోజులు సోషల్ మీడియాలో ఎలాంటి పోస్టులు పెట్టను. తర్వాత అన్ని విషయాలను చెబుతాను అంటూ చెప్పుకోచ్చింది అరియానా. ప్రస్తుతం ఈ అమ్మడు యంగ్ హీరో రాజ్ తరుణ్ సరసన ఓ సినిమా చేస్తుంది.

Also Read: Vakeel Saab : ‘వకీల్ సాబ్‏’కు సర్వం సిద్ధం.. మరికొద్ది గంటల్లో ప్రీరిలీజ్ ఈవెంట్..

Sarangadariya: ‘లవ్‏స్టోరీ’లో నా పాట పెట్టుకున్నందుకే హిట్ అయ్యింది.. పైర్ అవుతున్న నెటిజన్స్..

జాను కోసం అప్పుడే మూడు స్కూల్స్ మారాను… అమ్మకు ఏడో తరగతిలోనే తెలుసు.. సింగర్ యశస్వి…

Vakeel Saab Pre Release: వకీల్ సాబ్ ప్రీ రిలీజ్ ఈవెంట్.. పవన్ డైనమిక్ ఎంట్రీ

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!