Vakeel Saab : ‘వకీల్ సాబ్‏’కు సర్వం సిద్ధం.. మరికొద్ది గంటల్లో ప్రీరిలీజ్ ఈవెంట్..

Vakeel Saab Pre Release Event: పవన్ స్టార్ పవన్ కళ్యాణ్ రీఎంట్రీతో వస్తున్న చిత్రం 'వకీల్ సాబ్'. అసలే పవన్ కళ్యాణ్..

Vakeel Saab : 'వకీల్ సాబ్‏'కు సర్వం సిద్ధం.. మరికొద్ది గంటల్లో ప్రీరిలీజ్ ఈవెంట్..
Vakeel Saab Pre Release Eve
Rajitha Chanti

|

Apr 04, 2021 | 3:18 PM

Vakeel Saab Pre Release Event: పవన్ స్టార్ పవన్ కళ్యాణ్ రీఎంట్రీతో వస్తున్న చిత్రం ‘వకీల్ సాబ్’. అసలే పవన్ కళ్యాణ్.. దాదాపు మూడు సంవత్సరాల తర్వాత మళ్లీ తెరపై కనిపించబోతున్నారు. ఇక ఆయనను మళ్లీ అలా చూడాలని అభిమానులు ఎప్పటినుంచే ఎదురుచూస్తున్నారు. ఇక ఆ తరుణం ఏప్రిల్ 9న రాబోతుంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్‏కు రెస్సాన్స్ మాములుగా రాలేదు. ఈ ట్రైలర్ తెలుగు ఇండస్ట్రీలోనే అత్యధిక లైకులు సాధించిన వీడియోగా రికార్డు సృష్టించింది. థియేటర్లో విడుదలైన ట్రైలర్‏ను వీక్షించడానికే అభిమానులు అద్దాలు పగలగొట్టేసారు. ఇక ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‏ను యూసుఫ్గూడా పోలీస్ గ్రౌండ్స్‏లో నిర్వహించాలనుకున్నారు చిత్రయూనిట్. కానీ రాష్ట్రంలో కరోనా పెరుగుతున్న నేపథ్యంలో పోలీసులు పర్మిషన్ ఇవ్వలేదు. దీంతో ఈ వేడుక జరగదని అంతా అనుకున్నారు. కానీ చిత్ర నిర్మాత దిల్ రాజ్ మాత్రం గట్టిగా ప్రయాత్నించి… ఎట్టకేలకు పర్మిషన్ సాధించాడు. దీంతో ఆదివారం సాయంత్రం 6 గంటలకు వకీల్ సాబ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ శిల్ప కళావేదికలో జరగనున్నాయి. ఈ కార్యక్రమాన్ని టీవీ9లో లైవ్‏లో చూడొచ్చు.

ఇక పవన్ ఫ్యాన్స్ దృష్ట్యా హైదరాబాద్ పోలీసులు కొన్ని కరోనా నిబంధనల మధ్య పర్మిషన్ ఇచ్చారు. కేవలం పాసులు ఉన్నవారు మాత్రమే రావాలని.. ముందుగానే కొన్ని పాస్ ప్రింట్స్ చేశారు. అయితే ఒకే సారి గుంపులుగా రాకుడదని… అనవసరంగా అక్కడకు వచ్చి మిగతా వారిని ఇబ్బంది పెట్టకూడదని కోరుతున్నారు మేకర్స్. తాజా సమాచారం ప్రకారం ఈ ప్రీరిలీజ్ ఈవెంట్‏కు మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ ముఖ్య అతిథిలుగా రాబోతున్నట్లుగా టాక్ వినిపిస్తోంది. ఉమెన్ ఎంపవర్‏మెంట్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో పవన్ న్యాయవాదిగా నటిస్తున్నారు. ఇందులో నివేథా థామస్, అంజలి, అనన్య నాగల్ల, ప్రకాశ్ రాజ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ప్రముఖ బాలీవుడ్‌ నిర్మాత బోనీ కపూర్‌ సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్సన్‌ బ్యానర్‌పై ఈ సినిమా నిర్మించారు. అలాగే ఇందులో పవన్ సరసన శ్రుతి హాసన్ నటిస్తోంది. ప్రస్తుతం పవన్… క్రిష్ డైరెక్షన్లో హరిహర విరమల్లు సినిమా చేస్తుండగా.. అటు అయ్యపనుమ్ కోషియమ్ సినిమాలో నటిస్తున్నాడు.

వకీల్ సాబ్ ప్రీ రిలీజ్ ఈవెంట్…

Also Read: ఈ సినిమాలు చూస్తే రూ.71 వేలు ఇస్తారట.. ఇవే కాకుండా ఇంకా బోలెడన్నీ ఆఫర్లు.. ఎక్కడో తెలుసా..

Sarangadariya: ‘లవ్‏స్టోరీ’లో నా పాట పెట్టుకున్నందుకే హిట్ అయ్యింది.. పైర్ అవుతున్న నెటిజన్స్..

జాను కోసం అప్పుడే మూడు స్కూల్స్ మారాను… అమ్మకు ఏడో తరగతిలోనే తెలుసు.. సింగర్ యశస్వి…

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu