Bigg Boss 5 Telugu: తెలుగు బిగ్ బాస్ 5 స్టార్ట్ అయ్యేది అప్పుడే..! కంటెస్టెంట్లు వీరేనా..?

Bigg Boss 5 Telugu: బుల్లితెరపై బిగ్ బాస్‌ షోకు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. భాష ఏదైనా కూడా షో మొదలైతే చాలు.. అభిమానుల హడావుడి పీక్స్‌కు...

Bigg Boss 5 Telugu: తెలుగు బిగ్ బాస్ 5 స్టార్ట్ అయ్యేది అప్పుడే..! కంటెస్టెంట్లు వీరేనా..?
Follow us
Ravi Kiran

|

Updated on: Jun 09, 2021 | 12:03 PM

Bigg Boss 5 Telugu: బుల్లితెరపై బిగ్ బాస్‌ షోకు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. భాష ఏదైనా కూడా షో మొదలైతే చాలు.. అభిమానుల హడావుడి పీక్స్‌కు చేరుకుంటుంది. తెలుగులో అయితే బిగ్ బాస్‌కు ఆదరణ చాలా ఎక్కువ. కరోనా కాలంలో గతేడాది డిసెంబర్ 20న ప్రారంభమైన బిగ్ బాస్ సీజన్ 4 హయ్యస్ట్ టీఆర్పీ రేటింగ్స్ దక్కించుకున్న విషయం విదితమే. ఆ సీజన్‌లో చాలామంది కంటెస్టెంట్లు కొత్తవాళ్ళే అయినా.. నాగార్జున తనదైన శైలి హోస్టింగ్‌తో షోను మరోసారి రక్తి కట్టించారు. ఇలా నాలుగో సీజన్ విజయవంతంగా ముగిసింది. దీనితో షో నిర్వాహకులు ప్రస్తుతం ఐదో సీజన్‌పై దృష్టి సారించారు.

బిగ్ బాస్ ఐదో సీజన్ మొదలుపెట్టడంపై ఇటీవలే స్టార్ మా ఛానల్ తన అధికారిక యూట్యూబ్ ఛానల్‌లో ఓ పోల్ నిర్వహించింది. దానికి ప్రేక్షకుల నుంచి అనూహ్య స్పందన లభించింది. దీనితో అతి త్వరలోనే బిగ్ బాస్ సీజన్ 5ను ప్రారంభించాలని స్టార్ మా భావిస్తోంది. మొదటిగా ఏప్రిల్‌లో మొదలవుతుందని సోషల్ మీడియాలో పలు వార్తలు వచ్చినా.. తాజాగా సమాచారం ప్రకారం జూలై మొదటి వారంలో ఐదో సీజన్ ప్రారంభమవుతుందని తెలుస్తోంది. ఈసారి మరింత కొత్తగా ఉండబోతుందని టాక్. పాపులర్ నటీనటులను షోకు తీసుకురావాలని నిర్వాహకులు ప్రణాళికలు సిద్దం చేస్తున్నారట.

ఇదిలా ఉంటే ఐదో సీజన్‌కు కూడా అక్కినేని నాగార్జునే హోస్టుగా వ్యవహరించబోతున్నారని టాక్ నడుస్తోంది. అటు యూట్యూబ్ స్టార్ షణ్ముఖ్‌ జశ్వంత్‌ యాంక‌ర్ ర‌వి, టిక్‌టాక్‌ స్టార్‌ దుర్గారావు, క‌మెడియ‌న్ హైప‌ర్ ఆదిలు బిగ్ బాస్ 5 కంటెస్టెంట్ల లిస్టులో ఉన్నారని సమాచారం. మరి ఇందులో నిజమెంత ఉందో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.!

Also Read:

మందుబాబులకు గుడ్ న్యూస్.. బీర్‌ వెరీ చీప్‌…. భారీగా తగ్గిన ధరలు.. వివరాలివే..!

వింత జంతువు కలకలం.. రాత్రయితే భయం.. భయం.. గ్రామస్తుల్లో ఆందోళన.!

ఆ యువ క్రికెటర్‌ను బెదిరిచిన విరాట్ కోహ్లీ.. ‘ఇలా ఆడటం ఇదే చివరిసారి’ అంటూ వార్నింగ్.!

అయ్యో.! చిరుత నోటికి చిక్కింది.. ప్రాణాలతో కొట్టుమిట్టాడుతోంది.. చివరికి ఏమైందంటే.!