మందుబాబులకు గుడ్ న్యూస్.. బీర్‌ వెరీ చీప్‌…. భారీగా తగ్గిన ధరలు.. వివరాలివే..!

Rajasthan Government Decision: బీర్‌ ప్రియులకు గుడ్‌న్యూస్‌... నిన్నటివరకు ఒక్క బాటిల్ ధర రూ. 100 నుంచి 150 వరకు ఉండేది. తాజాగా ఒక్కో...

మందుబాబులకు గుడ్ న్యూస్.. బీర్‌ వెరీ చీప్‌.... భారీగా తగ్గిన ధరలు.. వివరాలివే..!
beer
Follow us

|

Updated on: Apr 02, 2021 | 2:17 PM

Rajasthan Government Decision: బీర్‌ ప్రియులకు గుడ్‌న్యూస్‌… నిన్నటివరకు ఒక్క బాటిల్ ధర రూ. 100 నుంచి 150 వరకు ఉండేది. తాజాగా ఒక్కో బీర్‌పై ఏకంగా రూ. 30 నుంచి రూ. 35 తగ్గిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఏంటీ నమ్మలేకపోతున్నారా? ఇది నిజమండీ.. అయితే.. ఈ నిర్ణయం తీసుకుంది మన రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు కాదు.. రాజస్థాన్ సర్కార్ తీసుకుంది.

కరోనా టైమ్‌లో లిక్కర్‌పై అధిక ప్రభావం పడింది. లాక్ డౌన్ సమయంలో మద్యం షాపులు క్లోజ్‌ చేయడంతో ప్రభుత్వ ఖజానాకు గండి పడింది. 2019-20 ఏడాదిలో 2 కోట్ల 65 లక్షల బీర్ల కేసులు అమ్ముడుపోయాయి. 2020 -21 సంవత్సరంలో ఆ సంఖ్య ఒక కోటి 60 లక్షలకు తగ్గింది. కేవలం 95 లక్షల బీర్ల కేసులు మాత్రమే అమ్ముడయ్యాయి. బీర్ల రేట్లపై అదనపు ఎక్సైజ్ సుంకం, కొవిడ్ సర్ ఛార్జీ పెంచడంతో.. అది కాస్తా అమ్మకాలపై ఎఫెక్ట్ పడింది. దీంతో ప్రభుత్వ ఆదాయానికి భారీగా నష్టం వాటిల్లింది.

ఈ నేపథ్యంలోనే రాజస్థాన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. బీర్ల ధరలను రూ. 30 నుంచి రూ. 35 వరకు తగ్గించింది. బ్రాండ్ల వారీగా ధరలు మారబోతున్నాయని తెలుస్తోంది. బీర్ల అమ్మకాలను పెంచి ప్రభుత్వానికి ఆదాయం వచ్చేలాగా కొత్త ఎక్సైజ్ పాలసీలో మార్పులు చేశారు. దీని ప్రకారం…వాటి ఎమ్మార్పీ ధరలపై అదనపు ఎక్సైజ్ సుంకం, కొవిడ్ సర్ ఛార్జీని తగ్గించారు.

మరిన్ని ఇక్కడ చదవండి:

ఏపీలో విజృంభిస్తున్న కరోనా మహమ్మారి.. అక్కడ మరోసారి లాక్‌డౌన్.. ఎన్ని రోజులంటే.!

ఆ బ్యాంకుల్లోని ఖాతాదారులకు ముఖ్య గమనిక.. అమలులోకి కొత్త రూల్స్.. వివరాలివే.!

రైల్వే ప్రయాణీకులకు గుడ్ న్యూస్.. ఇవాళ్టి నుంచి పట్టాలెక్కనున్న మరిన్ని స్పెషల్ ట్రైన్స్.!