ఏపీలో విజృంభిస్తున్న కరోనా మహమ్మారి.. అక్కడ మరోసారి లాక్‌డౌన్.. ఎన్ని రోజులంటే.!

Corona Lockdown In Guntur: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తున్న నేపధ్యంలో రోజురోజుకూ పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూపోతోంది...

  • Publish Date - 12:21 pm, Thu, 1 April 21
ఏపీలో విజృంభిస్తున్న కరోనా మహమ్మారి.. అక్కడ మరోసారి లాక్‌డౌన్.. ఎన్ని రోజులంటే.!
Corona Lockdown Ap

Corona Lockdown In Guntur: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తున్న నేపధ్యంలో రోజురోజుకూ పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూపోతోంది. ఈ క్రమంలోనే వైరస్ వ్యాప్తిని తగ్గించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోంది. ఇదిలా ఉంటే గుంటూరు జిల్లాలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. దీనితో ఆ జిల్లాలోని భట్టిప్రోలు మండలంలో అధికారులు తాత్కాలికంగా లాక్‌డౌన్ ప్రకటించారు.

ఏప్రిల్ 1వ తేదీ నుంచి వారం రోజుల పాటు లాక్‌డౌన్ అమలులో ఉంటుందని భట్టిప్రోలు తహశీల్దార్ శ్రవణ్ కుమార్ ప్రకటించారు. ఉదయం 7 గంటల నుంచి 11 గంటల వరకే నిత్యావసర వస్తువులకు అనుమతి ఉంటుందని.. అత్యవసర ఆరోగ్య సేవలు సైతం లాక్‌డౌన్ సమయంలో యధావిధిగా కొనసాగుతాయని స్పష్టం చేశారు. కాగా, ప్రజలు ఈ లాక్‌డౌన్‌కు సహకరించి వైరస్ వ్యాప్తిని నియంత్రించడంలో భాగంగా మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించాలని తహశీల్దార్ శ్రవణ్ కుమార్ తెలిపారు. ఈ వారం రోజుల పాటు పరిస్థితులను పరిశీలించి.. ఆ తర్వాత నిర్ణయం తీసుకుంటామని అన్నారు..

ఏపీలో కొత్తగా 1184 పాజిటివ్ కేసులు…

ఏపీలో గడిచిన 24 గంటల్లో 30,964 శాంపిల్స్ పరీక్షించగా.. కొత్తగా 1,184 పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. దీనితో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 9,01,989కి చేరింది. ఇందులో 7338 యాక్టివ్ కేసులు ఉండగా.. 8,87,434 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. అటు నిన్న వైరస్ కారణంగా రాష్ట్రంలో నలుగురు మృతి చెందారు. దీనితో మొత్తం మరణాల సంఖ్య 7217కు చేరుకుంది. ఇక నిన్న 456 మంది కరోనా నుంచి కోలుకుని సంపూర్ణ ఆరోగ్యవంతులు అయ్యారు. ఇక నిన్న అత్యధికంగా గుంటూరు జిల్లాలో 352 పాజిటివ్ కేసులు బయటపడ్డాయి.

Also Read:

ఏపీలో మరోసారి పడగ విప్పిన కరోనా.. భారీగా నమోదైన పాజిటివ్ కేసులు.. ఆ జిల్లాలో అత్యధికం.!

LPG Cylinder: సామాన్యులకు గుడ్ న్యూస్.. తగ్గనున్న గ్యాస్ సిలిండర్ ధరలు.. ఎంతంటే.!

అలెర్ట్: ఆధార్‌తో పాన్ కార్డు లింక్.? చివరి తేదీ పొడిగింపు.. వివరాలివే.!

IPL 2021: సన్‌రైజర్స్ హైదరాబాద్ అభిమానులకు ఓ బ్యాడ్ న్యూస్.. మరో గుడ్ న్యూస్..!