AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

SBI Customer Alert: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక ప్రకటన.. ఆ మూడు గంటలు సేవలు బంద్…

SBI request: దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక ప్రకటన జారీ చేసింది. తమ వినియోగదారులను అలర్ట్ చేసింది. ఖాతాదారులు ఈ రోజు సుమారు మూడున్నర గంటలపాటు ఎస్‌బీఐ..

SBI Customer Alert: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక ప్రకటన.. ఆ మూడు గంటలు సేవలు బంద్...
Sanjay Kasula
|

Updated on: Apr 01, 2021 | 12:42 PM

Share

దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక ప్రకటన జారీ చేసింది. తమ వినియోగదారులను అలర్ట్ చేసింది. ఖాతాదారులు ఈ రోజు సుమారు మూడున్నర గంటలపాటు ఎస్‌బీఐ, ఇంటర్నెట్ బ్యాంకింగ్ సేవలను పొందలేరని తెలిపింది. ఆన్‌లైన్ బ్యాంకింగ్ అప్‌గ్రేడ్ వల్ల ఇంటర్నెట్ బ్యాంకింగ్, యోనో యాప్, యోనో లైట్ యాప్ ద్వారా సేవలు కొంత సమయం వరకు నిలిపివేస్తున్నట్లు ఎస్‌బీఐ ప్రకటించింది. కస్టమర్లు గురువారం ఏవైనా ముఖ్యమైన లావాదేవీలు ఉంటే మధ్యాహ్నం 2 గంటల్లోగా పూర్తి చేసుకోవాలని కోరింది. లేదంటే సాయంత్రం 5.40 తర్వాత లావాదేవీలను ప్లాన్ చేసుకోవాలి వెల్లడించింది.

ఈ మేరకు ఎస్‌బీఐ తన ట్విట్టర్ ఖాతా ద్వారా వినియోగదారులకు సూచించింది. బ్యాంకులో ముఖ్యమైన పనులుంటే తొందరగా ముగించుకోవాలని పేర్కొంది. ఎస్‌బీఐ పేర్కొన్న పోస్ట్ లో “ఈ రోజు మధ్యాహ్నం 1.10 నుంచి సాయంత్రం 5.40 గంటలకు ఎస్‌బీఐ బ్యాంకింగ్, యాప్ సేవలు ఉపయోగించుకోలేరు.”  ఎస్‌బీఐ ఆన్‌లైన్ బ్యాంకింగ్ వ్యవస్థను అప్‌గ్రేడ్ చేస్తున్నందున బ్యాంకు కార్యకలాపాలు నిలిచిపోతాయాని తెలిపింది. ఇందుకు తమ కస్టమర్లు సహకరించాలని కోరింది.

ఆన్‌లైన్ బ్యాంకింగ్ విషయంలో కస్టమర్లకు మెరుగైన సేవలు అందించేందుకు మెయింటనెన్స్‌ పనులు చేస్తామని, ఇంటర్నెట్ బ్యాంకింగ్ ప్లాట్‌ఫామ్‌ను అప్‌గ్రేడ్ చేస్తున్నామని ఎస్‌బీఐ ప్రకటించింది.

ఇవి కూడా చదవండి :  April 1st : మీకు తెలియకుండానే మీ జీవితం ఈ మార్పులతో మొదలైంది.. అవేంటో తెలుసా..