AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Indian Railways: కరోనా కష్టాలను అధిగమించి…ఆ విషయంలో భారత రైల్వే శాఖ సరికొత్త రికార్డు..

Indian Railways News: కోవిడ్ కారణంగా ప్యాసింజర్ రైళ్ల రాకపోకలకు గత ఆర్థిక సంవత్సరం తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీంతో రైల్వే శాఖ భారీగా ఆదాయాన్ని కోల్పోయింది. అయితే అలా రైల్వే శాఖ అదనపు ఆదాయాన్ని ఆర్జించగలిగింది.

Indian Railways: కరోనా కష్టాలను అధిగమించి...ఆ విషయంలో భారత రైల్వే శాఖ సరికొత్త రికార్డు..
Indian Railways
Janardhan Veluru
|

Updated on: Apr 01, 2021 | 12:19 PM

Share

కోవిడ్ పరిస్థితుల కారణంగా ప్యాసింజర్ రైళ్ల రాకపోకలకు గత ఆర్థిక సంవత్సరం తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీంతో రైల్వే శాఖ భారీగా ఆదాయాన్ని కోల్పోవాల్సిన దుస్థితి ఏర్పడింది. అయితే సరకు రవాణాలో మాత్రం భారత రైల్వే శాఖ సరికొత్త రికార్డు సృష్టించింది. కరోనా కారణంగా నెలకొన్న గడ్డు పరిస్థితులను అధిగమించి మునుపటి ఆర్థిక సంవత్సరం కంటే అధికంగా 2020-21 ఆర్థిక సంవత్సరంలో రికార్డు స్థాయి సరకు రవాణా చేపట్టింది. అదే స్థాయిలోనే  అధిక ఆదాయాన్ని ఆర్జించింది రైల్వే శాఖ. 2019-20 ఆర్థిక సంవత్సరంలో రైల్వే శాఖ 1,2005.04 మెట్రిక్ టన్నుల సరకులను రవాణా చేయగా…2020-21 ఆర్థిక సంవత్సరంలో 1,224.45 మెట్రిక్ టన్నులు రవాణా చేసినట్లు కేంద్ర రైల్వే శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. మునుపటి సంవత్సరంతో పోలిస్తే గత ఆర్థిక సంవత్సరంలో సరకు రవాణాలో 2 శాతం వృద్ధి నమోదయ్యింది. 2020-21 ఆర్థిక సంవత్సరపు తొలి నాలుగు మాసాల్లో సరకు రవాణా తక్కువగా ఉన్నా…ఆ తర్వాత క్రమంగా పుంజుకుంది. ఒక్క మార్చి నెలలోనే 130 మెట్రిక్ టన్నుల సరకులను రవాణా చేయగా…అంతకు ముందు ఆర్థిక సంవత్సరంలో ఇదే మాసంతో పోలిస్తే 26 శాతం వృద్ధిని నమోదుచేసుకుంది.

అలాగే సరకు రవాణా ద్వారా రైల్వే శాఖ ఆదాయం కూడా పెరగడం విశేషం. సరకు రవాణా ద్వారా 2019-20 ఆర్థిక సంవత్సరంలో రైల్వే శాఖ రూ.1,13,477.9 కోట్ల రాబడి ఆర్జించగా….2020-21 ఆర్థిక సంవత్సరంలో 3 శాతం వృద్ధితో రూ.1.16,634.9 కోట్ల రాబడిని నమోదుచేసుకుంది.

తిండి గింజలు, సిమెంట్, ఐరన్, స్టీల్, ఎరువులు, కంటైనర్లు తదితర సరకుల రవాణాలో గణనీయమైన వృద్ధి నమోదైనట్లు రైల్వే మంత్రిత్వ శాఖ బుధవారం విడుదల చేసిన ఓ ప్రకటనలో తెలిపింది. మునుపటి ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే గత ఆర్థిక సంవత్సరంలో తిండి గింజల రవాణాలో 68 శాతం వృద్ధి నమోదైనట్లు రైల్వే శాఖ అధికారులు తెలిపారు. ఐరన్, స్టీల్ రవాణాలో 11 శాతం, 5 శాతం వృద్ధి నమోదయ్యింది. రసాయన ఉప్పు, కాటన్, ఉల్లిగడ్డలు, మట్టి, ఆటోమొబైల్ రవాణా కూడా గణనీయంగా పెరిగింది. ముగిసిన ఆర్థిక సంవత్సరంలో పెట్రోలియం ఉత్పత్తులు, బొగ్గు రవాణా గణనీయంగా తగ్గుముఖం పట్టినట్లు వెల్లడించింది.

ఇది కూడా చదవండి..Johnson and Johnson: జాన్సన్ అండ్ జాన్సన్ సింగిల్ డోస్ వ్యాక్సిన్ పై ఎన్నో సందేహాలు.. నాణ్యతలో విఫలం

Viral Video: అమ్మ ప్రేమకు మరో సాక్ష్యం.. తన పిల్లల క్షేమం కోసం తల్లి ఎలుగు తపన.. నెటిజన్లు ఫిదా..!