కోవిడ్ వ్యాక్సిన్ వేయించుకున్న ఏపీ సీఎం వైఎస్ జగన్.. మూడు నెలల్లో వ్యాక్సినేషన్ పూర్తి చేస్తామన్న సీఎం.!
CM YS Jagan: ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన సతీమణి వైఎస్ భారతితో కలిసి గురువారం ఉదయం కోవిడ్ వ్యాక్సిన్ వేయించుకున్నారు...
CM YS Jagan: ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన సతీమణి వైఎస్ భారతితో కలిసి గురువారం ఉదయం కోవిడ్ వ్యాక్సిన్ వేయించుకున్నారు. గుంటూరులోని భారత్‌పేట 140వ వార్డు సచివాలయ ఆవరణలో ముఖ్యమంత్రికి టీకా వేసేందుకు వ్యాక్సిన్ కేంద్రం, రిజిస్ట్రేషన్, వ్యాక్సిన్ రూమ్, అబ్సర్వేషన్ రూమ్‌లను అధికారులు ఏర్పాటు చేశారు. ఈ ఏర్పాట్లను హోంమంత్రి మేకతోటి సుచరిత, కలెక్టర్ వివేక్ యాదవ్ పరిశీలించిన విషయం విదితమే. ఇక వ్యాక్సిన్ వేయించుకున్న అనంతరం సీఎం వైఎస్ జగన్ 45 ఏళ్ల దాటినవారికి వార్డు/గ్రామ సచివాలయాల్లో వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించారు.
వైద్యుల పర్యవేక్షణలో కోవిడ్ టీకా వేయించుకున్న ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. కొద్దిరోజులు డాక్టర్ల పరిశీలనలో ఉండనున్నారు. ఇక టీకా తీసుకున్న తర్వాత ఆయన వైద్యులు, సచివాలయ సిబ్బందితో కొంతసేపు చర్చించారు. ఇదిలా ఉంటే ఈరోజు నుంచి మూడో దశ కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ మొదలైంది. ఈ విడతలో 45 ఏళ్లు పైబడిన వారికి టీకా వేయనున్నారు.
కాగా, రాష్ట్రమంతటా మూడు నెలల్లో వ్యాక్సినేషన్ ప్రక్రియ పూర్తి చేస్తామని సీఎం జగన్ ధీమా వ్యక్తం చేశారు. అటు అర్హులందరూ కూడా వ్యాక్సిన్ తీసుకోవాలని సీఎం పిలుపునిచ్చారు. కోవిడ్ టీకా తీసుకోవడంతో పాటు జాగ్రత్తలు కూడా పాటించాలని సూచించారు. ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకుంటే వైరస్ వ్యాప్తిని నియంత్రించవచ్చునని సీఎం జగన్ అన్నారు.
Also Read:
ఏపీలో మరోసారి పడగ విప్పిన కరోనా.. భారీగా నమోదైన పాజిటివ్ కేసులు.. ఆ జిల్లాలో అత్యధికం.!
LPG Cylinder: సామాన్యులకు గుడ్ న్యూస్.. తగ్గనున్న గ్యాస్ సిలిండర్ ధరలు.. ఎంతంటే.!
అలెర్ట్: ఆధార్‌తో పాన్ కార్డు లింక్.? చివరి తేదీ పొడిగింపు.. వివరాలివే.!
IPL 2021: సన్‌రైజర్స్ హైదరాబాద్ అభిమానులకు ఓ బ్యాడ్ న్యూస్.. మరో గుడ్ న్యూస్..!