ఆ బ్యాంకుల్లోని ఖాతాదారులకు ముఖ్య గమనిక.. అమలులోకి కొత్త రూల్స్.. వివరాలివే.!

Account Holders In These Banks: మీకు బ్యాంక్ ఖాతా ఉందా.? తరచుగా లావాదేవీలు చేస్తుంటారా.? అయితే ఈ విషయాలను మీరు ఖచ్చితంగా...

ఆ బ్యాంకుల్లోని ఖాతాదారులకు ముఖ్య గమనిక.. అమలులోకి కొత్త రూల్స్.. వివరాలివే.!
Follow us
Ravi Kiran

|

Updated on: Apr 01, 2021 | 3:44 PM

Account Holders In These Banks: మీకు బ్యాంక్ ఖాతా ఉందా.? తరచుగా లావాదేవీలు చేస్తుంటారా.? అయితే ఈ విషయాలను మీరు ఖచ్చితంగా తెలుసుకోవాల్సిందే.! ఈ రోజు నుంచి కొన్ని కొత్త రూల్స్ అమలులోకి వచ్చాయి. ప్రభుత్వ రంగ బ్యాంకుల విలీనం నేపధ్యంలో ఈ నూతన నిబంధనలు ఏప్రిల్ 1వ తేదీ నుంచి అమలులోకి వచ్చాయి. మీకు గానీ ఈ బ్యాంకుల్లో ఖాతాలు ఉన్నట్లయితే.. ఆ మార్పులు ఏంటి.? వాటికి సంబంధించిన వివరాల గురించి తెలుసుకోండి.

విజయ బ్యాంక్, కార్పోరేషన్ బ్యాంక్, ఆంధ్రాబ్యాంక్, సిండికేట్ బ్యాంక్, ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్, యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, అలహాబాద్ బ్యాంక్, దేనా బ్యాంక్‌లలో అకౌంట్ ఉన్న ఖాతాదారులకు ముఖ్య గమనిక. ఇవాళ్టి నుంచి వారందరికీ కూడా కొత్త ఐఎఫ్ఎస్‌సీ కోడ్‌లు అమలులోకి వచ్చాయి. అంతేకాకుండా పైన పేర్కొన్న బ్యాంకులకు సంబంధించిన చెక్‌బుక్‌లు, పాస్ బుక్‌లు సైతం పని చేయవు. అందువల్ల ఆయా బ్యాంకులకు సంబంధించిన ఖాతాదారులు వెంటనే తమ దగ్గరలోని బ్రాంచ్‌కు వెళ్లి కొత్త పాస్‌బుక్, చెక్ బుక్‌తో పాటు కొత్త ఐఎఫ్ఎస్‌సీ కోడ్‌లు పొందండి. ఆన్‌లైన్ లావాదేవీల్లో ఈ కొత్త కోడ్‌లు ఉపయోగించడం వల్ల మీకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తవు.

Also Read:

ఏపీలో మరోసారి పడగ విప్పిన కరోనా.. భారీగా నమోదైన పాజిటివ్ కేసులు.. ఆ జిల్లాలో అత్యధికం.!

LPG Cylinder: సామాన్యులకు గుడ్ న్యూస్.. తగ్గనున్న గ్యాస్ సిలిండర్ ధరలు.. ఎంతంటే.!

అలెర్ట్: ఆధార్‌తో పాన్ కార్డు లింక్.? చివరి తేదీ పొడిగింపు.. వివరాలివే.!

IPL 2021: సన్‌రైజర్స్ హైదరాబాద్ అభిమానులకు ఓ బ్యాడ్ న్యూస్.. మరో గుడ్ న్యూస్..!