Digital Payments : ఊపందుకున్న డిజిటల్ చెల్లింపులు.. చైనా కంటే ముందంజలో భారత్.. రాబోయే రోజుల్లో పరిస్థితి ఎలా ఉంటుందంటే..?
Digital Payments : కరోనా పుణ్యమా అని డిజిటల్ చెల్లింపులు ఊపందుకున్నాయి. గత సంవత్సరం దేశంలో పలు రాష్ట్రాల్లో లాక్‌డౌన్ కొనసాగడం వల్ల బయటికి వెళ్లే
Digital Payments : కరోనా పుణ్యమా అని డిజిటల్ చెల్లింపులు ఊపందుకున్నాయి. గత సంవత్సరం దేశంలో పలు రాష్ట్రాల్లో లాక్‌డౌన్ కొనసాగడం వల్ల బయటికి వెళ్లే పరిస్థితులు లేకపోవడంతో చాలామంది డిజిటల్ చెల్లింపుల ద్వారానే అన్నిటిని కొనుగోలు చేశారు. వీటికి అలవాటు పడటంతో జనాలు డబ్బులను మెయింటేన్ చేయడం లేదు. మొత్తం ఆన్‌లైన్‌లోనే అన్ని పనులు చేస్తున్నారు. ఈ క్రమంలో రాబోయే కొన్నేళ్లలో డిజిటల్ చెల్లింపులు అత్యంత వేగంగా పెరుగుతాయని, 2025 నాటికి భారత్‌లో ఇవి 71.7 శాతం వాటాను కలిగి ఉంటాయని ఓ నివేదిక ద్వారా తెలుస్తోంది.
ఏసీఐ వరల్డ్‌వైడ్ నివేదిక ప్రకారం.. 2020లో 2,550 కోట్ల రియల్ టైమ్ చెల్లింపులతో భారత్ చైనా కంటే ముందంజలో ఉందని స్పష్టం చేసింది. నగదు, చెక్కులు, ఇతర చెల్లింపులు 28.3 శాతం వాటాను మాత్రమే కలిగి ఉంటాయని ఏసీఐ వరల్డ్‌వైడ్ నివేదిక చెబుతోంది. 2020లో మొత్తం చెల్లింపుల్లో తక్షణ చెల్లింపు 15.6 శాతం వాటాను కలిగి ఉండగా, ఎలక్ట్రానిక్ చెల్లింపులు 22.9 శాతం, పేపర్ ఆధారిత చెల్లింపు 61.4 శాతం వాటాను కలిగి ఉన్నాయి.
భారత్‌లో ప్రభుత్వం, రెగ్యులేటరీ, బ్యాంకులు, ఫిన్‌టెక్ సంస్థల మధ్య సహకారం మెరుగ్గా ఉంది. దీనివల్ల ఆర్థిక వృద్ధి లక్ష్యాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు సహాయపడుతుందని, ముఖ్యంగా ప్రజల్లో వేగవంతమైన చెల్లింపుల డిజిటలైజేషన్ అందించిందని ఏసీఐ వరల్డ్‌వైడ్ వైస్-ప్రెసిడెంట్ కౌశిక్ రాయ్ వెల్లడించారు. 2025 నాటికి ఈ చెల్లింపులు భారీగా పెరుగుతాయని, తక్షణ చెల్లింపు 37.1 శాతానికి, ఎలక్ట్రానిక్ చెల్లింపు 34.6 శాతానికి పెరుగుతాయని, నగదు, పేపర్ ఆధారిత చెల్లింపు 28.3 శాతానికి తగ్గిపోవచ్చని నివేదిక పేర్కొంది.
మరిన్ని చదవండి :