AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇప్పటికే నాకు మూడు, నాలుగుసార్లు పెళ్లి చేసారు… ఆసక్తికర విషయాలను చెప్పిన కీర్తి సురేష్..

Keerthy Suresh : ఎనర్జిటిక్ స్టార్ రామ్ సరసన నేను శైలజ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది కీర్తి సురేష్. మొదటి సినిమాతో ఫుల్ ఫాలోయింగ్ సంపాదించుకుంది ఈ అమ్మడు. అమాయకంగా ఉండడం.

ఇప్పటికే నాకు మూడు, నాలుగుసార్లు పెళ్లి చేసారు... ఆసక్తికర విషయాలను చెప్పిన కీర్తి సురేష్..
 తెలుగు ... తమిళ భాషల్లో విపరీతమైన క్రేజ్ సంపాదించుకుంది కీర్తిసురేష్ 
Rajitha Chanti
|

Updated on: Apr 01, 2021 | 3:18 PM

Share

Keerthy Suresh : ఎనర్జిటిక్ స్టార్ రామ్ సరసన నేను శైలజ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది కీర్తి సురేష్. మొదటి సినిమాతో ఫుల్ ఫాలోయింగ్ సంపాదించుకుంది ఈ అమ్మడు. అమాయకంగా ఉండడం.. క్యూట్ లుక్స్‏కు ఎంతో మంది ఫిదా అయిపోయారు. ఇక ఆ తర్వాత అలనాటి హీరోయిన్ సావిత్రం జీవిత కథ ఆధారంగా.. డైరెక్టర్ నాగ్ అశ్విన్ తెరకెక్కించిన ‘మహానటి’ సినిమాతో కీర్తి జాతీయ స్థాయి గుర్తింపు తెచ్చుకుంది. ఈ మూవీ తర్వాత కీర్తి రేంజ్ ఒక్కసారిగా మారిపోయింది. వరుసగా ఆమె వద్దకు ఆఫర్లు క్యూ కట్టాయి. ఇక ఆ తర్వాత కీర్తి ఎక్కువగా లేడీ ఓరియోటెండ్ సినిమాలు చేసినా..అవి అంతగా హిట్ అవ్వలేదు. కానీ కీర్తికి అవకాశాలు మాత్రం తగ్గడం లేదు.

ప్రస్తుతం కీర్తి మహేష్ సరసన సర్కారు వారి పాట సినిమాలో నటిస్తోంది. అటు ఇటీవల యంగ్ హీరో నితిన్ సరసన ‘రంగ్ దే’ సినిమాలోనూ నటించింది ఈ అమ్మడు. ఇటీవలే ఆ మూవీ విడుదలై మంచి టాక్‏తో దూసుకుపోతుంది. ఈ చిత్ర ప్రమోషన్స్‏లో పాల్గోన్న కీర్తి.. తన వ్యక్తిగత విషయాల గురించి మాట్లాడింది.

“నా పెళ్లి గురించి చాలా సందర్బాల్లో సోషల్ మీడియాలో పోస్టులు, ఫోటోలు కనిపించాయి. వాటిని చూసి ముందు షాకయ్యాను. కొంతమంది నెట్టింట్లో నాకు ఇప్పటికే మూడు, నాలుగు సార్లు పెళ్లి చేసేశారు. మొదట అవి చూసి షాక్ అయ్యాను. ఆ తర్వాత నవ్వుకున్నాను. కానీ ఒకటి మాత్రమం పక్కా చెప్పగలను… నా పెళ్ళికి ఇంకా చాలా సమయం ఉంది. సరైన సమయం వచ్చినప్పుడు తప్పకుండా వివాహం చేసుకుంటా” అని కీర్తి సురేష్ చెప్పుకోచ్చింది. నితిన్, కీర్తి జంటగా నటించిన ‘రంగ్ దే’ సినిమాకు వెంకీ అట్లూరి దర్శకత్వం వహించారు. ఇందులో నితిన్‌ సతీమణిగా కీర్తి నటించారు.

Also Read: RRR Movie Update: ‘ఆర్ఆర్ఆర్’ థియేట్రికల్ రైట్స్ దక్కించుకున్న పెన్ స్టూడియోస్.. అఫీషియల్‏గా ట్వీట్..

Telugu Upcoming Movies April: ఏప్రిల్‏లో సందడి చేయనున్న సినిమాలు ఇవే.. సినీ ప్రియులకు పండగ.. బాక్సాఫీసు కళకళ..