AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telugu Upcoming Movies April: ఏప్రిల్‏లో సందడి చేయనున్న సినిమాలు ఇవే.. సినీ ప్రియులకు పండగ.. బాక్సాఫీసు కళకళ..

కరోనా సంక్షోభం తర్వాత సినీ పరిశ్రమ ఇప్పుడిప్పుడే పుంజుకుంటుంది. థియేటర్లు ఓపెన్ అయిన ప్రారంభంలో ఆశించినంతగా ప్రేక్షకులు రాలేకపోవడంతో... సినీ పరిశ్రమకు ఒకింత ఆందోళ నెలకొంది. ఇక ఇటీవల విడుదలై...

Telugu Upcoming Movies April: ఏప్రిల్‏లో సందడి చేయనున్న సినిమాలు ఇవే.. సినీ ప్రియులకు పండగ.. బాక్సాఫీసు కళకళ..
Movies In April
Rajitha Chanti
|

Updated on: Apr 01, 2021 | 12:47 PM

Share

కరోనా సంక్షోభం తర్వాత సినీ పరిశ్రమ ఇప్పుడిప్పుడే పుంజుకుంటుంది. థియేటర్లు ఓపెన్ అయిన ప్రారంభంలో ఆశించినంతగా ప్రేక్షకులు రాలేకపోవడంతో… సినీ పరిశ్రమకు ఒకింత ఆందోళ నెలకొంది. ఇక ఇటీవల విడుదలై… సూపర్ హిట్‏ సాధించిన సినిమాలు ప్రేక్షకులను మళ్లీ థియేటర్ల వైపు అడుగులు వేసేలా చేశాయనడంలో అతిశయోక్తి లేదు. కరోనా ప్రభావంతో కోల్పోయిన వినోదాన్ని ఇప్పుడోస్తున్న సినిమాలు అందిస్తుండడంతో.. ప్రేక్షకుల సంఖ్య మరింత పెరిగింది. దీంతో అగ్రహీరోల సినిమా నిర్మాతలు ఓటీటీలలో కాకుండా.. థియేటర్లలోనే చిత్రాలను విడుదల చేయడానికి మొగ్గు చూపిస్తున్నారు. ఇప్పటికే పలు సినిమాల విడుదల తేదీలను ప్రకటించారు మేకర్స్. మరీ ఈ ఏప్రిల్ నెలలో ఏ ఏ సినిమాలు విడుదల కాబోతున్నాయో తెలుసుకుందామా.

Wild Dog

అసలే వేసవి కాలం ప్రారంభమవుతుండడం.. అగ్రహీరోల సినిమాలు థీయేటర్ల వైపు క్యూ కట్టనున్నాయి. ఇక ఏప్రిల్ నెల ప్రారంభం నుంచే సినిమాల జోరు పెరగనుంది. ఏప్రిల్ 2న నాగార్జున ‘వైల్డ్ డాగ్’ సినిమా ప్రేక్షకులను అలరించనుంది.

Sultan

అదే రోజున తమిళ స్టార్ కార్తీ నటించిన ‘సుల్తాన్’ కూడా తెలుగులో విడుదల కానుంది.

Seetimarr

వీటితోపాటు టాలెంటెడ్ హీరో గోపీచంద్, తమన్నా జంటగా నటించిన ‘సీటిమార్ ‘సినిమా కూడా ఏప్రిల్ 2న విడుదల కానుంది.

Vakeel Saab

ఇక ఆ తర్వాత పవన్ అభిమానులు ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న ‘వకీల్ సాబ్’ సినిమా ఏప్రిల్ 9న థియేటర్లలోకి రానుంది.

Love Story

ఇక ఆ తర్వాత నాగచైతన్య, సాయిపల్లవి జంటగా నటించిన ‘లవ్ స్టోరి’ సినిమా ఏప్రిల్ 16న విడుదల కానుంది.

Gurthunda Seethakalam

యంగ్ హీరో సత్యదేవ్.. మిల్కిబ్యూటీ తమన్నా నటిస్తోన్న ‘గుర్తుందా శీతకాలం’ సినిమా ఏప్రిల్ 14న విడుదల కానుంది.

Tuck Jagadish

వీటితోపాటు నేచురల్ స్టార్ నాని కూడా ఇదే నెలలో రాబోతున్నాడు. ప్రస్తుతం నాని నటిస్తోన్న ‘టక్ జగదీష్’ సినిమా ఏప్రిల్ 23న విడుదల కానుంది. ఇక ఈ ఏప్రిల్ నెల మొత్తం సినీ ప్రియులను అలరించేందుకు సిద్ధమైంది.

Also Read: ‘సారంగదరియా’ సెన్సెషనల్ .. సౌత్ ఇండియాలో ఆ రికార్డ్ సాధించిన ఏకైక సాంగ్.. సాయిపల్లవి క్రేజ్ మాములుగా లేదుగా..