‘సారంగదరియా’ సెన్సెషనల్ .. సౌత్ ఇండియాలో ఆ రికార్డ్ సాధించిన ఏకైక సాంగ్.. సాయిపల్లవి క్రేజ్ మాములుగా లేదుగా..

Sarangadariya Song: సారంగదరియా... ఇప్పుడు ఈ సాంగ్ యూట్యూబ్‏లో రచ్చ చేస్తుంది. "దాని కుడీ భుజం మీద కడవా.. దాని గుత్తెపు రైకలు మెరియా.. అది రమ్మంటె రాదురా సెలియా.. దాని పేరే సారంగదరియా"...అంటూ

'సారంగదరియా' సెన్సెషనల్ .. సౌత్ ఇండియాలో ఆ రికార్డ్ సాధించిన ఏకైక సాంగ్.. సాయిపల్లవి క్రేజ్ మాములుగా లేదుగా..
Sarangadariya Song
Follow us
Rajitha Chanti

|

Updated on: Apr 01, 2021 | 12:03 PM

Sarangadariya Song: ‘సారంగదరియా’… ఇప్పుడు ఈ సాంగ్ యూట్యూబ్‏లో రచ్చ చేస్తుంది. “దాని కుడీ భుజం మీద కడవా.. దాని గుత్తెపు రైకలు మెరియా.. అది రమ్మంటె రాదురా సెలియా.. దాని పేరే సారంగదరియా”…అంటూ సాగే ఈ జానపద పాట ప్రతి ఒక్కరిని ఎంతగానో ఆకట్టుకుంటుంది. నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘లవ్ స్టోరీ’ మూవీలో నుంచి విడుదలైన ఈ పాట సరికొత్త రికార్డులు సృష్టిస్తుంది. సుద్దాల అశోక తేజ రాసిన లిరిక్స్‏ను.. సింగర్ మంగ్లీ అద్భుతంగా ఆలపించగా… హీరోయిన్ సాయిపల్లవి మెరుపుతీగల వేసిన స్టెప్పులకు ప్రతిఒక్కరు ఫిదా అయిపోయారు.  ముఖ్యంగా ‘సారంగ దరియా’ పాటకు సాయిపల్లవి టైమింగ్, ఎనర్జీ, ఎక్స్ ప్రెషన్స్, ఇన్‏వాల్వ్‏మెంట్  ప్రధాన ఆకర్షణ అయ్యాయి. దీంతో ఈ పాటకు ఎంతో మంది తమదైన స్టైల్లో స్టెప్పులేస్తూ.. ఎంజాయ్ చేస్తున్నారు.

ఇటీవలే విడుదలై అతి తక్కువ కాలంలోనే యూట్యూబ్‏లో 75 మిలియన్ వ్యూస్ క్రాస్ చేసి కొత్త రికార్డును క్రియేట్ చేసిన ఈ సాంగ్ ఇప్పుడు మరో కొత్త రికార్డు క్రియేట్ చేసింది. కేవలం 32 రోజుల్లోనే 100 మిలియన్ వ్యూస్ సాధించింది. సౌతిండియాలో మరే లిరికల్ సాంగ్ ఇంత తక్కువ సమయంలో వంద మిలియన్ మార్క్ చేరుకోలేదు. ‘రౌడీ బేబీ’, ‘బుట్ట బొమ్మ’ వంటి సంచలన పాటలు కూడా లిరికల్ సాంగ్ వ్యూస్ లో ‘సారంగ దరియా’ కంటే వెనకబడ్డాయి. ఫిబ్రవరి 28న ఆదిత్య మ్యూజిక్ ఛానెల్ లో అప్ లోడ్ అయిన ‘సారంగ దరియా’ పాట తొలి రోజు నుంచే శ్రోతలను ఆకట్టుకుంటుంది. రోజూ రోజూకు ఈ పాట ప్రతివారి మదిని తాకుతూ.. మిలియన్స్ కొద్ది వ్యూస్ సాధిస్తూ.. రికార్డుల మోత మోగిస్తుంది. ఇక ఈ పాటకు మ్యూజిక్ డైరెక్టర్ పవన్ సీహెచ్ అందించిన క్యాచీ ట్యూన్ హైలెట్‏గా చెప్పుకోవచ్చు.

“లవ్ స్టోరి” సినిమాలో  ‘సారంగదరియా’ పాటను తీసుకోవాలి అని దర్శకుడు శేఖర్ కమ్ముల చేసిన ఆలోచన నూటికి నూరు శాతం హిట్ అయ్యింది. మొత్తంగా ఈ సినిమాకు ‘సారంగ దరియా’ డ్రైవింగ్ ఫోర్స్ అయ్యిందని చెప్పొచ్చు. రేవంత్, మౌనిక లవ్ స్టోరిని ఏప్రిల్ 16న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్లుగా  చిత్రయూనిట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్ పీ, అమిగోస్ క్రియేషన్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇందులో రాజీవ్ కనకాల, ఈశ్వరీ రావు, దేవయాని ఇతర కీలక పాత్రల్లో నటించారు.

సాంగ్..

Also Read:

Celeb birthdays in April: అల్లు అర్జున్, సమంత‏తోపాటు ఏప్రిల్‏లో పుట్టిన రోజులు జరుపుకోనున్న స్టార్స్ వీళ్లే..

పవన్ కోసమే ఉమెన్ ఎంపవర్‏మెంట్ స్టోరీ.. ‘వకీల్ సాబ్’ సినిమాలో మెయిన్ పాయింట్ అదే.. డైరెక్టర్ శ్రీరామ్ వేణు..

గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!